Hydra: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మెట్ మండలం పెద్దంబర్పేట విలేజ్‌లో ఓ లే ఔట్లోకి చొరబడి రహదారులను ఆక్రమించి నిర్మించిన ప్రహరీని హైడ్రా తొలగించింది.265 సర్వే నెంబరులో 278 ప్లాట్లతో శబరిహిల్స్ పేరిట లే ఐట్ వేశారు. ఈ లే ఔట్‌కు ఆనుకుని 346 సర్వే నెంబరులో ఎకరం భూమి కొన్న వ్యక్తి లే ఔట్లోకి జరిగి 20 ప్లాట్ల మేర ఆక్రమించారు. తన స్థలంలో నుంచి నాలా వెళ్తోందని చెబుతూ,ఈ స్థలం తనదంటూ ఆక్రమణకు పాల్పడ్డాడు.
Also Read: HYDRA Hyderabad: భేష్…హైడ్రాపై కురుస్తున్న ప్రశంసల జల్లు.. ఎందుకంటే?
హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు
ఈ ఆక్రమణతో తమ ప్లాట్లతో పాటు లే ఔట్లోకి వెళ్లే దారి కూడా బంద్ చేశారని శబరి హిల్స్ లేఔట్ ప్లాట్ల యజమానులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు హైడ్రా విచారణ చేపట్టింది. ఇరుపక్షాల సమక్షంలో ఏడీ సర్వేతో హద్దులను నిర్ధారించింది. లే ఔట్లోకి 4 వేల గజాల వరకు జరిగినట్టు నిర్ధారించిన హైడ్రా అందులోని రహదారులకు ఆటంకంగా ఉన్న ప్రహరీలను గురువారం తొలగించింది. దీంతో శబరిహిల్స్ లే ఔట్ నివాసితులు ఊరట లభించింది.
Also Read: Hydra: హైడ్రా ప్రజావాణికి ఒక్కరోజే 76 ఫిర్యాదులు.. నేరుగా స్వీకరించిన కమిషనర్ రంగనాథ్!

