Municipality Elections: రెండో రోజు 103 నామినేషన్లు
మహబూబాబాద్ కాంగ్రెస్తో సీపీఐకి కుదరని పొత్తు
సీపీఎం పార్టీకి నాలుగు… మిగతా అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు
మహబూబాబాద్, స్వేచ్ఛ: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో (Municipality Elections) మొదటి రోజు 36 వార్డులకు గానూ, 10 నామినేషన్లు దాఖలు అయ్యాయి. రెండో రోజు అత్యధికంగా 103 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో రోజు వరకు మొత్తం 113 నామినేషన్లు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. నామినేషన్లకు శుక్రవారం చివరి తేదీ కావడంతో 36 వార్డులకు సంబంధించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, ఇండిపెండెంట్ అభ్యర్థులు అత్యధికంగా నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంది.
కాంగ్రెస్తో సీపీఐ పార్టీకి కుదరని పొత్తు
కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పార్టీకి వార్డు కౌన్సిలర్ల సర్దుబాటు పొత్తు కుదరలేదు. ఇప్పటికే చాలాసార్లు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్తో మహబూబాబాద్ సీపీఐ జిల్లా కార్యదర్శి భామనపల్లి విజయ సారధి రెడ్డి సారథ్యంలో వార్డు కౌన్సిలర్ల సీట్ల సర్దుబాటు చర్చలు జరిగాయి. తొలుత 13 సీట్లు అడిగిన సీపీఐ పార్టీ, ఆ తర్వాత 10 సీట్లు ఇవ్వాలని కోరింది. అందులో 33వ వార్డు ప్రత్యేకించి డిమాండ్ చేసినట్లు సమాచారం. 33 వార్డు సీపీఐకి ఇవ్వమని స్థానిక ఎమ్మెల్యే మురళి నాయక్ స్పష్టం చేసినట్లుగా సమాచారం. దీంతో గురువారం 36వ వార్డు ఇస్తూ 9 వార్డులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా తెలిసింది. అందుకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఒప్పుకోనట్లుగా తెలిసింది. ఆ తర్వాత ఎనిమిది సీట్లు ఇవ్వాలని, దానికి కూడా ఎమ్మెల్యే ఒప్పుకోకపోవడంతో ఏడు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లుగా తెలిసింది.
Read Also- Jogipet Municipality: ఉత్కంఠ మధ్య కాంగ్రెస్ అభ్యర్థిత్వాలు ఖరారు… జోగిపేటలో ఇదీ పరిస్థితి
ఇక్కడ కూడా పొత్తులు కుదరకపోవడంతో సీపీఐ, కాంగ్రెస్ పార్టీ జరిపిన చర్చలు విఫలమైనట్లుగా విశ్వసనీయ సమాచారం. అయితే సీపీఎం పార్టీకి మహబూబాబాద్ మున్సిపాలిటీలో తొలుత ఐదు సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తే, అందులో నాలుగవ వార్డు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో సీపీఎం పార్టీకి నాలుగు వార్డు కౌన్సిలర్ సీట్లు మాత్రమే సర్దుబాటు చేయడంతో ఆ పార్టీ నాయకులు సర్దుకుని వెళ్లారని తెలిసింది. సీపీఎం పార్టీకి కేటాయించిన నాలుగు వార్డులు మినహాయిస్తే 32 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి నామినేషన్లు దాఖలు చేసేలా ప్రణాళికలు చేసుకుంటున్నట్లుగా తెలిసింది. రేపు నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీ కావడంతో సిపిఐ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మురళి నాయక్తో చర్చలు జరుపుతారా..? లేదంటే సొంతంగానే వార్డు కౌన్సిలర్ల పోటీకి దిగుతారా..? అనేది తేలాల్సి ఉంది.
మధిర మున్సిపాలిటీ ఎన్నికలలో పొత్తులు ఖరారు?
కాంగ్రెస్ , టీడీపీ, సీపీఐ కలిసి పోటీ
ఖమ్మం , స్వేచ్ఛ: మధిర మున్సిపాలిటీ ఎన్నికల్లో పొత్తుపై స్థానిక ఎమ్మెల్యే , ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి సమావేశంలో పొత్తులు కొలిక్కి వచ్చి నట్లు సమాచారం. ఇక్కడ బిఆర్ఎస్ – సి.పి.యం పార్టీ లు ఎన్నికల పొత్తులు ఖరారయ్యాయి. ప్రచారంలో భాగంగా గురువారం ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించారు . మరో వైపు కాంగ్రెస్ , టీడీపీ, సీపీఐ కలసి పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ – 18 కౌన్సిలర్ లతో పాటు ఛైర్మెన్ పదవి, టీడీపీ పార్టీ కి -03 కౌన్సిలర్ లు, వైస్ చైర్మన్ , సిపిఐ పార్టీ01(మడుపల్లి), కో ఆప్షన్ సభ్యునిగా సిపిఐ సీనియర్ నాయకులు బెజవాడ రవి బాబుకి అవకాశం కల్పించాలని నిర్ణయించారని విస్వసనీయ సమాచారం.

