Romania Accident: రొమేనియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై ఫుట్ బాల్ లీగ్ అభిమానులతో వెళ్తున్న మినీ వ్యాన్ ను ఎదురుగా వచ్చిన ఓ ట్రక్ బలంగా ఢీకొట్టింది. దీంతో వ్యాన్ తునాతునకలు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా రోడ్డుపై ఎగిరిపడ్డారు. వాహన శిథిలాలు, రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలతో ఘటనాస్థలి భీతావాహంగా మారింది.
ఏడుగురు స్పాట్.. మరో ముగ్గురు
గ్రీక్ ఫుట్ బాల్ క్లబ్ పీఏఓకే (PAOK) మ్యాచ్ చూసేందుకు 10 మంది అభిమానులు మినీ వ్యాన్ లో బయలు దేరారు. లియాన్ ప్రాంతంలో ముందున్న వెహికల్ ను వ్యాన్ డ్రైవర్ ఓవర్ టేక్ చేసే క్రమంలో ఎదురుగా వచ్చిన ట్రక్ ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత పడగా.. మరో ముగ్గురు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా ప్రమాద దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావాడంతో అవి చూసి నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు.
BREAKING:
🇷🇴Romania – Tragedy strikes as seven PAOK Thessaloniki football fans were killed and three others seriously injured in a devastating head-on collision while traveling to their team’s Europa League away match.
The driver reportedly swerved to avoid the crash but veered… pic.twitter.com/vsTQWiCmkA
— 𝐀𝐋𝐏𝐇𝐀 ® (@Alpha7021) January 28, 2026
ప్రధాని దిగ్భ్రాంతి
గ్రీస్ లోని అతిపెద్ద ఫుట్ బాల్ క్లబ్ లలో PAOK థెస్సలోనికి ఒకటి. ఈ క్లబ్ ఆడే ఫుట్ బాల్ మ్యాచ్ లను వీక్షించేందుకు లక్షలాది మంది అభిమానులు వస్తుంటారు. ఇదిలా ఉంటే ప్రమాద ఘటనపై గ్రీస్ ప్రధాని కిరియాకోస్ మిత్సోటాకిస్ (Kyriakos Mitsotakis) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రొమేనియాలో జరిగిన ఈ ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ ప్రమాదంలో ఏడుగురు చనిపోవడం బాధాకరం. గ్రీకు ప్రభుత్వం, మా రాయబార కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. మా తరపున పూర్తి సహాయ సహయ సహకారాలు అందిస్తాం’ అని గ్రీకు ప్రధాని పేర్కొన్నారు.
Also Read: Ponguleti Srinivas Reddy: మేడారం జాతర ఏర్పాట్లపై.. అన్ని శాఖల అధికారులను మంత్రి పొంగులేటి ఆరా!
PAOK క్లబ్ అధ్యక్షుడి స్పందన
పీఏఓకే (PAOK) క్లబ్ అధ్యక్షుడు ఇవాన్ సావ్విడిస్ సైతం ప్రమాద ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని చెప్పలేనంత విషాదంగా అభివర్ణించారు. ‘మా PAOKకు అండగా నిలిచేందుకు వస్తున్న అభిమానులు ప్రమాదంలో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నేను వారి కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నా’ అంటూ ఇవాన్ సానుభూతి వ్యక్తం చేశారు.

