Telangana BJP: ఉత్తర తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్..?
Telangana BJP (imagecredit:swetcha)
Technology News, హైదరాబాద్

Telangana BJP: ఉత్తర తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్.. మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పావులు

Telangana BJP: తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం వ్యూహాలకు పదును పెడుతోంది. ఇందులో భాగంగా, పార్టీకి పట్టున్న ఉత్తర తెలంగాణ జిల్లాలపై ప్రధానంగా దృష్టి సారించింది. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని, తద్వారా రాష్ట్ర రాజకీయాల్లో తమ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎన్నికల పర్యవేక్షణ కోసం బీజేపీ జాతీయ అధ్యక్షుడు ముగ్గురు సభ్యులతో కూడిన కేంద్ర బృందాన్ని(ఇన్‌చార్జీ, సహ ఇన్‌చార్జీలు) నియమించారు. మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్ నేతృత్వంలోని ఈ బృందం ఇప్పటికే రంగంలోకి దిగింది. రాష్ట్ర నేతలతో మున్సిపల్ ఎన్నికల ఇన్ చార్జీలు కీలక భేటీ నిర్వహించారు. ఎన్నికల్లో రచించాల్సిన వ్యూహాలపై బీజేపీ మున్సిపల్ ఎన్నికల ఇన్ చార్జీలు దిశానిర్దేశం చేశారు.

అభ్యర్థుల ఎంపికకు సర్వే..

అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సర్పంచ్ ఎన్నికల స్ఫూర్తితో ముందుకెళ్లి, తటస్థ ఓటర్లను బీజేపీ వైపునకు ఆకర్షించేలా కృషి చేయాలని ఈ భేటీలో దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలం పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుని, పట్టణ ప్రాంతాల్లో తమ పట్టును ప్రదర్శించాలని భావిస్తోంది. అందుకు గెలుపు గుర్రాలను అభ్యర్థులుగా ప్రకటించాలని నిర్ణయించింది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో అభ్యర్థుల ఎంపికను సర్వే ఆధారంగా చేపడుతామని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టంచేశారు. వీక్ గా ఉన్నచోట ఇతర పార్టీల్లో బలంగా ఉన్న వారిని పార్టీలోకి చేర్చుకుని టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు గతంలోనే తెలిపారు. అందుకు అనుగుణంగా పార్టీ ముందడుగు వేసి సత్తా చాటాలని భావిస్తున్నారు. అందుకే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై పార్టీ ప్రధానంగా దృష్టి సారించనుంది.

Also Read: Bhartha Mahasayulaku Wignyapthi: ‘వామ్మో వాయ్యో’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. ఎంజాయ్!

ఉత్తర తెలంగాణపై..

తెలంగాణలో ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వగా.. మరోవైపు బీజేపీ మున్సిపల్ ఎన్నికల ఇన్ చార్జీ ఆశీష్ శెలార్, సహా ఇన్ చార్జీలు రేఖా శర్మా, అశోక్ పర్నామి ముఖ్య నేతలతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఈ ఎన్నికల్లో పార్టీకి బలంగా ఉన్న ఉత్తర తెలంగాణపై దృష్టిసారించనుంది. ఈ ప్రాంతం నుంచే బీజేపీకి అత్యధిక ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. సర్పంచ్ ఎన్నికల్లోనూ ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా కమలం పార్టీ దూకుడు ప్రదర్శించింది. గతంలో ఎన్నడూ లేనంతగా భారీ స్థాయిలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది. అదే మాదిరిగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో కాషాయ దళం సత్తా చాటాలని యోచిస్తోంది. ఇదిలా ఉండగా బుధవారం మున్సిపల్ ఎన్నికల ఇన్ చార్జీలతో కీలక సమావేశం జరగాల్సి ఉండగా ఈ మీటింగును రాష్ట్ర నాయకత్వం రద్దుచేసింది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో సమయాభావం వల్ల వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. కాగా జిల్లాల్లో ఎక్కడిక్కడ కోర్ కమిటీ మీటింగులు నిర్వహించుకుని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు రచించాలని రాష్ట్ర నాయకత్వం దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు.

సమన్వయం చేసుకుంటూ ప్రచారం

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ముఖ్య నేతలతో భేటీ అయిన ఎన్నికల ఇన్ చార్జీలు.. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా, ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల్లో రచించాల్సిన వ్యూహాలను సమీక్షించడంతో పాటు, పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న కార్యాచరణను అమలు చేయడం, పార్టీ కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ప్రచారం చేసేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని దిశానిర్దేశం చేసినట్లు చెబుతున్నారు. ప్రతి ఇంటికీ చేరువయ్యేందుకు పన్నా ప్రముఖ్ వ్యవస్థను బీజేపీ విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 భారీ బహిరంగ సభలు నిర్వహించి సత్తా చాటాలని కమలం పార్టీ భావిస్తోంది. మరి వారి అంచనాలు ఎంత మేరకు వర్కవుటవుతాయనేది చూడాలి.

Also Read: Dr Suranjan: జంపింగ్ రాజా జంపింగ్.. మున్సిపల్ పీఠం కోసం హస్తం వీడి గులాబీ గూటికి చేరిన నేత..?

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?