Agra Murder Case: ఉత్తర్ ప్రదేశ్ లోని ఆగ్రాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రేయసి అతి దారుణంగా హత్య చేసిన ప్రియుడు.. ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి యమునా నదిలో పడేశారు. ఆపై తలను మురికి కాలువలోకి విసిరేశాడు. అనంతరం బాధితురాలి కుటుంబం దగ్గరకు వెళ్లి ప్రేయసి కనిపించడం లేదంటూ కపట కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా సంచలన నిజాలు వెలుగు చూశాయి.
వివరాల్లోకి వెళ్తే..
అగ్రాలోని ట్రాన్స్ – యమునా పోలీసు స్టేషన్ పరిధిలో జనవరి 23న మింకి శర్మ మహిళ కనిపించడం లేదంటూ మిస్సింగ్ కేసు నమోదైంది. బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో మరుసటి రోజు (జనవరి 24) తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో ఆగ్రాలోని పార్వతి విహార్ ప్రాంతంలో పోలీసులు ఓ సంచిని గుర్తించారు. తెరిచి చూడగా మహిళ మృతదేహాం లభ్యమైంది. అయితే తల మాత్రం కనిపించలేదు.
దర్యాప్తు ముమ్మరం..
సంచి లభించిన ప్రాంతానికి దారి తీసే రోడ్లు, ఆ మార్గాల్లోని సీసీటీవీలను పోలీసులు పరిశీలించారు. 100కి పైగా కెమెరాలను జల్లెడ పట్టారు. ఈ క్రమంలో ఓ వీడియోలో స్కూటీపై ఓ వ్యక్తి.. సంచితో ప్రయాణించడాన్ని దర్యాప్తు వర్గాలు గుర్తించాయి. స్కూటర్ రిజిస్ట్రేషన్ ఆధారంగా అతడు.. మృతురాలి సహోద్యోగి అయిన వినయ్ రాజ్ పుత్ గా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అతడ్ని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. మహిళను తానే హత్య చేసినట్లు వినయ్ అంగీకరించాడు.
Also Read: Vivo X200T Mobile: మార్కెట్లోకి వచ్చేసిన.. మోస్ట్ వాంటెడ్ ఫోన్.. ఫీచర్లు చూస్తే వెంటనే కొనేస్తారు!
అనుమానంతోనే హత్య..
వినయ్ ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. జనవరి 23న మింకి శర్మను వినయ్ తన కార్యాలయానికి రప్పించాడు. సదరు మహిళకు మరో వ్యక్తితో సంబంధం ఉన్నట్లు వినయ్ రాజ్ పుత్ అనుమానించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర కోపోద్రిక్తుడైన వినయ్.. తన దగ్గర ఉన్న కత్తితో ప్రేయసిని పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి.. వాటి అవశేషాలను రెండు గోను సంచిల్లో చుట్టాడు. మహిళ స్కూటీని ఉపయోగించి.. బాధితురాలి మృతదేహాన్ని యమునా నదిలో విసిరేశాడు. అయితే తలను మాత్రం సమీపంలోని మురికి కాలువలో పారేసినట్లు వినయ్ అంగీకరించాడు. అయితే ప్రేయసి హత్యకు సంబంధించి అనుమానం రాకుండా.. వినయ్ బాధితురాలి కుటుంబం వెంటే ఉన్నాడని పోలీసులు తెలిపారు. నదిలో కొట్టుకుపోయిన మిగిలిన శరీర భాగాల కోసం వెతుకున్నట్లు తెలిపారు.
Vinay Rajput from Agra murder his girlfriend, he killed and dismembered before dumping her body parts in a sack, with the victim's head still missing. Later accompanied the girls family to the police station to file the missing person report.pic.twitter.com/9jFNrtLUEt
— Mohammed Zubair (@zoo_bear) January 27, 2026

