CI Mahender Reddy: విధుల్లో అప్రమత్తంగా ఉంటూ మహబూబాబాద్ పట్టణాన్ని శాంతిభద్రతలకు నిలయంగా టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి (CI Mahender Reddy) నిలుపుతున్నారు. ఉన్నతాధికారులు ఎస్పీ డాక్టర్ పి శబరిష్, మహబూబాబాద్ డిఎస్పి ఎన్ తిరుపతిరావు ఆదేశాలతో అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ సిబ్బందిని సైతం అప్రమత్తం చేస్తూ మహబూబాబాద్ పట్టణాన్ని రాత్రి అంతా గాలిస్తూ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. రహదారులపై రాత్రి వేళల్లో తిరిగే అల్లరి మూకలపై తనదైన స్టైల్ లో ఉక్కు పాదం మోపుతూ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. మళ్లీ మళ్లీ కౌన్సిలింగ్ నిర్వహించిన వారు రహదారులపై కనిపిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కేసులు నమోదు చేస్తున్నారు.
పెట్రోలింగ్, సడన్ చెకింగ్ లతో అక్రమాలకు అడ్డుకట్ట
పెట్రోలింగ్, సడన్ చెకింగ్ లతో విధులు చేపడుతూ మహబూబాబాద్ పట్టణంలో అక్రమాలకు టౌన్ సిఐ మహేందర్ రెడ్డి అడ్డుకట్ట వేస్తున్నారు. తెల్లవారుజామున 1.30 నిమిషాల నుంచి 2.11 గంటల వరకు మహబూబాబాద్ పట్టణంలోని రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ లలో అక్రమ వ్యాపారాలకు అవకాశం లేకుండా విస్తృత తనిఖీలను నిర్వహించారు. పెట్రోలింగ్ ఎస్సై సహా బ్లూ కోల్డ్స్ సిబ్బందితో రాజీవ్ నగర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్, నంది నగర్, బెస్త బజార్, కురవి గేట్, పత్తిపాక, బాబు నాయక్ తండ, భవాని నగర్ తండా, హస్తినాపురం, ఆదర్శనగర్, బ్యాంకు కాలనీ, సిగ్నల్ కాలనీ, కాకతీయ నగర్, ఇందిరా కాలనీ, వడ్డెర కాలనీ, లెనిన్ నగర్ కాలనీ, మిలటరీ కాలనీ, బీసీ కాలనీలను చుట్టుముట్టి రహదారులపై మధ్య రాత్రుల్లో ప్రయాణించే వారి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
Also Read: Mahabubabad CI: విద్యార్థులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలి.. సిఐ ఆదేశం
ఓపెన్ ప్రాంతాల్లో మద్యం సేవించే వారిపై ప్రత్యేక ఫోకస్
రాత్రి 12 తర్వాత బార్ షాపుల మూసివేత అనంతరం ఓపెన్ ప్రాంతాల్లో మద్యం సేవించే వారిపై ప్రత్యేక ఫోకస్ పెట్టి అసాంఘిక కార్యకలాపాలకు చోటు లేకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. డబల్ బెడ్ రూమ్ సమీప ప్రాంతంలో ఉన్న గ్లామర్ ద్విచక్ర వాహనాన్ని కనిపెట్టి సదరు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించే విచారణ చేపడుతున్నారు. మహబూబాబాద్ టౌన్ సిఐ గా విధులు చేపట్టిన నాటి నుంచి గట్ల మహేందర్ రెడ్డి తనదైన స్టైల్ లో డ్యూటీలో దూసుకుపోతూ ఇతర అధికారులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Also Read: Mahabubabad District: సీసీ నిఘాతో నిందితులకు దడ దడ.. సిఐ మహేందర్ రెడ్డి

