Mahabubabad District: సీసీ కెమెరాలతోనే ప్రజలకు పూర్తి భద్రత లభిస్తుందని మహబూబాబాద్ టౌన్ సిఐ గట్ల మహేందర్ రెడ్డి(CI Gatla Mahender Reddy) పేర్కొన్నారు. శుక్రవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ లో గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా, అదేవిధంగా సీసీ కెమెరాలు(CCTV cameras) అమర్చుకుంటే కలిగే లాభాలను వివరించారు. కాలనీలు, గ్రామాలు, పట్టణాలు, పట్టణాల ప్రధాన కూడలలో సిసి నిఘా తోనే నిందితులకు దాదాపుడుతుందని తెలిపారు. ఏదైనా అసాంఘిక, అక్రమ కార్యకలాపాలకు పాల్పడాలంటే సీసీ కెమెరాలు చూసి భయపడాల్సిన పరిస్థితి ఉంటుందని తెలిపారు. గ్రామ కాలనీల అభివృద్ధికి సీసీ కెమెరాలు ఎంతగానో దోహద పడతాయని పేర్కొన్నారు.
చందాల డబ్బుల్లో సీసీ కెమెరాలు
గణపతి మండపాల నిర్వహకులు గణేష్ నవరాత్రుల ఉత్సవాల కోసం వసూలు చేసే చందాల డబ్బుల్లో కొంత సీసీ కెమెరాలు కేటాయించాలని సూచించారు. ప్రత్యేకించి కమ్యూనిటీ కార్యక్రమంలో భాగంగా సీసీ కెమెరాలు పెట్టుకునేందుకు కాలనీ, గ్రామ వాసులు ఫండింగ్ చేసుకోవాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో రాత్రి వేళల్లో చోరీలు జరగకుండా సీసీ కెమెరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. అసాంఘిక శక్తులను అరికట్టేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఆవశ్యకమన్నారు. నిమజ్జన సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. ప్రశాంత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకుని ప్రతి భక్తుడు గణపతి ఆశీస్సులను పొందాలన్నారు. మండపాల వద్ద మత్తు పదార్థాలు వినియోగించే వద్దని తెలిపారు. మండపాల వద్ద రాత్రి వేళల్లో వాచ్ చేసేవారు నిత్యం అప్రమత్తంగా ఉండాలని వివరించారు. మండపాల వద్ద రిజిస్టర్(Register) పెట్టుకుంటే పోలీసులు(police) వచ్చి పర్యవేక్షిస్తారని తెలిపారు.
Also Read: Janahita Padayatra: వర్ధన్నపేటలో జనహిత యాత్రకు నీరాజనం
పోలీసుల గోల్ సీసీ కెమెరాలు
ప్రధానంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు మండపాల నిర్వాహకులు ప్రత్యేకంగా కృషి చేయాలని సూచించారు. నిమజ్జన సమయంలో డీజే(DJ)లు పెడితే సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా డీజే పరికరాలను శాశ్వతంగా సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. పోలీసుల గోల్ సీసీ కెమెరాలు ఫుల్ గా పెట్టించడమేనని స్పష్టం చేశారు. సిటీ ఔట్స్కట్స్ లో జరిగే అసాంఘిక కార్యకలాపాలను సీసీ కెమెరాలు కాపాడేందుకు దోహదపడతాయన్నారు. గణపతి చెందాల్లో కొంత డబ్బును సీసీ కెమెరాలు కచ్చితంగా వినియోగించుకునేందుకు కమిటీ నిర్వాహకులు చర్యలు తీసుకోవాలన్నారు. న్యూసెన్సును అరికట్టేందుకు సీసీ కెమెరాలు పనిచేస్తాయన్నారు. మహిళ(Womens)లు, యువతులు, బాలికలు, విద్యార్థినీల రక్షణకు సీసీ కెమెరాలు మరింత దోహదం చేస్తాయన్నారు. 50 లక్షలు పెట్టి ఇండ్లు కట్టుకునేవారు 50,000 పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. ప్రతి ఇంటి నిర్మాణంతో పాటే సీసీ కెమెరాలను అమర్చుకుంటే సంబంధిత ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ వ్యాపారాలు, చోరీలు, కిడ్నాప్లు జరిగితే వేగంగా కేసులను పరిష్కరించేందుకు సీసీ కెమెరాలు ప్రత్యేకించి దోహదపడతాయని వెల్లడించారు.
Also Read: Attack on Minister: బీహార్ మంత్రిని ఛేజ్ చేసి దాడికి పాల్పడ్డ గ్రామస్తులు.. ఎందుకంటే?