Gajwel Municipality: దశాబ్దాలు ఎదురుచూపుల తర్వాత ఇల్లు మంజూరు అయ్యాయి. అనేక రకాలు గా తిప్పుకొని ఇండ్లు అప్పగించారు. అయినా ఇంకా మా కష్టాలు తీరలేదని గజ్వేల్ మున్సిపాలిటీ(Gajwel Municipality)కి చెందిన డబుల్ బెడ్ రూమ్ కాలనీ లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ఏ పార్టీ నాయకులు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ పట్ల నిర్లక్ష్యం చేస్తున్న నాయకులకు తెలిసి వచ్చేవరకు తామ మున్సిపల్ ఎన్నికలను బహిష్కరిస్తామని పేర్కొన్నారు. గజ్వేల్ డబల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారులు ఆదివారం కాలనీలో తమ నిరసన వ్యక్తం చేస్తూ తమ సమస్యలను పట్టించుకోవాలని కోరారు.
ఇండ్లలో కనీస వసతులు లేవు..
1100 డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి లాటరీ పద్ధతిలో తమకు కేటాయించారని, అంతర్గత రోడ్లు తదితర సమస్యలు అనేకం ఉన్నట్లు వివరించారు. సుమారు 5000 ఓట్లున్న తమ కాలనీకి ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలన్నారు. తమకు కేటాయించిన ఇళ్లకు సంబంధించిన పట్టాలను మంజూరు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో కనీస వసతులు లేవని వెంటనే కల్పించాలని ప్రభుత్వాధికారులకు, రాజకీయ నాయకులకు సూచించారు. మున్సిపల్ ఎన్నికల అప్పుడే తమ ఓట్ల కోసం వస్తారు తప్ప ఆ తర్వాత తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్ రూమ్ కాలనీ కమిటీ అధ్యక్షులు దయాకర్, సభ్యులు పాషా, శేఖర్, స్వరూప, లక్ష్మి పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.
Also Read: Municipal Elections: మున్సిపాలిటీ ఎన్నికలపై గులాబీ గురి.. గెలుపుకోసం సీరియస్ స్ట్రాటజీ సిద్దం

