Ramchander Rao: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందా? అనే అనుమానం కలుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (Ramchander Rao) ఆరోపించారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కేవలం ఒక డ్రామాలా సాగుతోందని విమర్శించారు. దర్యాప్తుకు వస్తున్న వారికి పోలీసులు రాచమర్యాదలు చేసి పంపిస్తున్నారని, ఇది ప్రజలను వంచించడమేనని ఆయన మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రమైన రాజ్యాంగ ఉల్లంఘన అని, కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకరికొకరు సహకరించుకుంటూ కాలయాపన చేస్తున్నాయని రాంచందర్ పేర్కొన్నారు.
Also Read: Ramchander Rao: సేమ్ అక్కడ సీన్ ఇక్కడ కూడా రిపీట్ చేస్తాం: రాంచందర్ రావు
నేతలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు!
అధికారులపై చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం, ఈ వ్యవహారంలో కీలకమైన రాజకీయ నేతలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. దర్యాప్తు వివరాలన్నీ బహిర్గతం చేయాలని, చిత్తశుద్ధి ఉంటే వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నటి మాధవీలత షిరిడీ సాయిబాబాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని, ఇతరుల మనోభావాలను దెబ్బతీయడం తప్పని ఆయన పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తూ, ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హిందువులను చీల్చేందుకు ప్రయత్నించే ఎవరికైనా బీజేపీ మద్దతు ఉండదని స్పష్టం చేశారు.
Also Read: Ramchander Rao: ట్రాఫిక్ చలాన్లు సైకిల్‌కి కూడా వేస్తారా.. ప్రభుత్వంపై రాంచందర్ రావు సెటైర్లు

