Municipal Elections: ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలు హోరాహోరీగా వ్యూహాలు, ప్రతివ్యూహాలు వేస్తారు. అయితే సాధరణంగా అధికారంలో ఏ పార్టీ ఉంటే స్ధానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి అవకాశాలుంటాయి. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్(BRS) అధికారంలో ఉంటే క్షేత్రస్థాయిలో వచ్చిన ప్రతి ఎన్నికల్లో తమ సత్తా చాటుకున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో విభన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పార్లమెంట్, బైఎలక్సన్స్, స్ధానిక సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చూపించుకుంది. కానీ సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన స్ధాయిలో ఫలితాలు కాంగ్రెస్‌కు రాలేదు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 80శాతం పైగా ఫలితాలు సాధిస్తే.. ప్రతిపక్ష పార్టీలో ఉండి కూడా 50శాతం ఫలితాలు సాధించామనే ధీమాలో ఉన్నారు. ప్రస్తుతం జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో తమ సత్తా చూపించాలని బీఆర్ఎస్ సీరియస్గా తీసుకుంటుంది.
ఇప్పటికే కార్యకర్తలతో సమావేశం..
మున్సిపాలిటీ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లు అధికారులు సిద్దం చేయడంతో రేపో, మాపో ఎన్నికల నోటీఫికేషన్ వస్తుందని పార్టీలు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా పార్టీ అధిష్టానం మున్సిపాలిటీ ఎన్నికలపై సీరియస్గా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ తమ పట్టును నిలబెట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రంగారెడ్డి(Rangareddy), మేడ్చల్(Medchal), వికారాబాద్(Vikaranad) జిల్లాలోని మున్సిపాలిటీల చైర్మన్లు తిరిగి సాధించుకోవాలనే కుతుహాలంలో బీఆర్ఎస్(BRS) పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గ పార్టీ ఇంచార్జీలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపాలిటీలోని వార్డుల వారీగా బలబలాలపై చర్చ సాగించారు. అదేవిధంగా ప్రకటించిన రిజర్వేషన్లకు అనుగుణంగా అభ్యర్థుల ఎంపికలో నేతలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
బలమైన అభ్యర్థులపై నిఘా..
పార్టీ గెలుపునకు బీఆర్ఎస్ నేతలు బలమైన అభ్యర్థుల వేటలో ఉన్నట్లు సమాచారం. అందులో భాగంగానే వికారాబాద్ జిల్లా పరిధిలోని తాండూర్, పరిగి, వికారాబాద్ మున్సిపాలిటీల్లో అధికార పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతుంది. అధికార పార్టీలో టికెట్ ఆశించిన భంగపడే నాయకులు బీఆర్ఎస్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో కొన్ని వార్డులకు అభ్యర్థులను ప్రకటించినట్లుగా ఆశావాహులు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకోని బీఆర్ఎస్ గెలుపు గుర్రాలతో పాటు సామాజికవర్గాల వారీగా అంచనాలు వేసుకుంటూ అభ్యర్థులపై నిఘా పెట్టినట్లు స్పస్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించగా… మున్సిపాలిటీల వారీగా నియామించిన ఇంచార్జీలు నేటి నుంచి సమావేశాలు పెట్టే అవకాశం ఉన్నట్లు కార్యకర్తలు వివరిస్తున్నారు.
మున్సిపాలిటీల వారీగా బీఆర్ఎస్ నేతల ఇంచార్జీలు
రంగారెడ్డిలోని 7, వికారాబాద్‌లోని నాలుగు, మేడ్చల్లోని మూడు మున్సిపాలిటీలకు ఎన్నికల ఇంచార్జీలుగా బీఆర్ఎస్ నేతలను అధిష్టానం ప్రకటించింది. ఇబ్రహీంపట్నం–నందికంటి శ్రీదర్, చేవెళ్ల–పటోళ్ల కార్తీక్ రెడ్డి, శంకర్పల్లి–కాసాని విరేశం ముదిరాజ్, మొయినాబాద్–ముఠా జయసింహాం,అమృతదల్ చౌహ్లా, అమన్గల్లు–రజీని సాయిచంద్, వికారాబాద్–మధుసుధానా చారీ, తాండూర్–శ్రీశైలం రెడ్డి, పరిగి–ఎంఎన్ శ్రీనివాస్, కొడంగల్–గట్టు రాంచందర్, అలియాబాద్–మన్నే క్రిశాంక్, యల్లంపేట్–వెంకట్ రెడ్డి, మూడుచింతలపల్లి గజ్జెల నగేష్‌లను మున్సిపాలిటీ ఎన్నికల బాధ్యతలను బీఆర్ఎస్ పార్టీ అప్పగించింది.
Alson Read: Nagarkurnool Tragedy: నాగర్‌కర్నూల్ జిల్లాలో ఘోరం.. సెల్ఫీ దిగబోయి కుంటలో పడి ముగ్గురు దుర్మరణం

