Gambling Case: మెదక్ జిల్లాలో నలుగురు అరెస్ట్
నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం
టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి వెల్లడి
మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: నమ్మదగిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి బృందం మెదక్ జిల్లాలో పేకాట ఆడుతున్న (Gambling Case) నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. శంకరంపేట్-ఆర్ మండలం కాజాపూర్ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ దాడిలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పాల్త్య బద్రు నాయక్, పాల్త్య శంకర్ నాయక్, బానోతు ప్రకాష్, నేనావత్ అనిల్ అనే నిందితులను అరెస్టయ్యారు. వీళ్లంతా నార్సింగి మండలంలోని సంకాపూర్ తండాకు చెందినవారిగా గుర్తించారు.
4 మొబైల్ ఫోన్లు స్వాధీనం
నిందితుల నుంచి రూ.8,725 నగదుతో పాటు 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదు, మొబైల్ ఫోన్లు, నిందితులను శంకరంపేట్-ఆర్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐకి తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం అప్పగించామని టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, జూదం, పేకాట, బెట్టింగ్‌లతో కుటుంబాలు నష్టపోతున్నాయని, యువత తప్పుదారులు ఎంచుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.
Read Also- Srinath Maganti: హిట్ సినిమా సీక్వెల్‌లో ఛాన్స్ కొట్టేసిన శ్రీనాథ్ మాగంటి.. ఎలా వచ్చిందంటే?

