UP Shocker: ఉత్తర్ ప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దివ్యాంగుల కోటాలో ఎంబీబీఎస్ సీటు కోసం సూరజ్ భాస్కర్ (20) అనే విద్యార్థి.. తన పాదాన్ని నరుక్కోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పోలీసులు సైతం యువకుడు చేసిన వెర్రి పనిని చూసి నివ్వెరపోయారు. తొలుత దీనిని దాడి ఘటనగా భావించిన పోలీసులు.. అనుమానం వచ్చి విద్యార్థిని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే..
యూపీ జౌన్ పూర్ జిల్లాలోని ఖలీల్ పూర్ గ్రామంలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సూరజ్ భాస్కర్ అనే విద్యార్థి.. డాక్టర్ కావాలని ఎన్నో కలలు కన్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్ పరీక్షకు సైతం హాజరయ్యాడు. అయితే పరీక్ష రాసిన రెండుసార్లు సూరజ్ కు ఛేదు అనుభవమే ఎదురైంది.
दिव्यांग कोटे से एमबीबीएस करने के लिए युवक ने खुद ही काट लिया पैर का पंजा, मगर गर्लफ्रेंड ने खोल दी पोल।#जौनपुर में नीट अभ्यर्थी सूरज भास्कर ने 2026 में #MBBS में एडमिशन पाने के लिए अपना पैर खुद काट लिया, उसने दिव्यांग कोटा हासिल करने के लिए पैर खुद काट लियाm pic.twitter.com/TefVnR7wdP
— वर्तमान न्यूज़ (@nvartmaan) January 23, 2026
దివ్యాంగుల కోటా కోసం..
జనరల్ కోటాలో పరీక్ష రాసి రెండుసార్లు పరాభవం ఎదురుకావడంతో పోటీ తక్కువగా ఉండే దివ్యాంగుల కోటాలో ఎంబీబీఎస్ సీటు సాధించాలని సూరజ్ భాస్కర్ భావించాడు. ఇందుకోసం అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. కాలును నరుక్కోవడం ద్వారా దివ్యాంగుడిగా మారి.. నీట్ లో రిజర్వేషన్ సాధించవచ్చని ప్లాన్ చేశాడు. ఆలోచన వచ్చిందే తడువుగా.. తన గదిలోకి వెళ్లి కాలును నరికేసుకున్నాడు.
దాడి చేసినట్లుగా కంప్లైంట్..
గదిలోకి వెళ్లిన సూరజ్ నుంచి ఎలాంటి చప్పుడు లేకపోవడంతో అనుమానించి అతడి అన్న ఆకాష్ భాస్కర్ గదిలోకి వెళ్లాడు. అక్కడ కనబడిన దృశ్యాలు చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. కాలు తెగిపడి. అపస్మారక స్థితిలో ఉన్న తమ్ముడ్ని చూసి ఆకాష్ షాక్ కు గురయ్యాడు. హుటాహుటీనా ఆస్పత్రికి తరలించాడు. అనంతరం తమ్ముడిపై ఎవరో దాడి చేశారని భావించి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read: Palnadu district Shocking: ప్రేయసి దూరం పెట్టిందని.. కోడికత్తితో ముక్కు కోసేశాడు.. వీడేంట్రా ఇలా ఉన్నాడు!
కేసును ఎలా ఛేదించారంటే?
సూరజ్ అన్న ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు. ఏం జరిగందని సూరజ్ ను ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు ఇచ్చాడని జౌన్ పూర్ జిల్లా ఎస్పీ ఆయుష్ శ్రీవాస్తవ తెలిపారు. దీంతో అతడి ఫోన్ ను పరిశీలించి అతడు తరుచూ మాట్లాడే యువతిని విచారించినట్లు పేర్కొన్నారు. ఆమె ఇచ్చిన క్లూ ఆధారంగా సూరజ్ డైరీని స్వాధీనం చేసుకున్నామని.. అందులో ‘నేను 2026లో ఎంబీబీఎస్ డాక్టర్ అవుతాను’ అని రాసి ఉందని చెప్పారు. నీట్ పరీక్షల్లో విఫలమైనందున దివ్యాంగ కోటాలో ఎంబీబీఎస్ సీటు సాధించేందుకు సూరజ్ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. ఘటనపై కేసు నమోదు చేసి.. సూరజ్ కు ఎలాంటి సెక్షన్లు అప్లై అవుతాయో పరిశీలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆయుష్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.

