Municipal Politics: సర్వే ఆధారంగానే టికెట్లు డిసైడ్ చేస్తాం
మ్యాచ్ ఫిక్సింగ్‌లకు పాల్పడితే శాశ్వతంగా సస్పెండ్ చేస్తాం
అభ్యర్థులను గెలిపించే భాద్యత కాంగ్రెస్ క్యాడర్ పై ఉంది
టికెట్లురాని వారు ఆందోళన చెందవద్దు
నామినేటెడ్ పోస్టుల్లో వారికి న్యాయం చేస్తాం
జిల్లాలోని 4 మున్సిపాలిటీ ల్లో కాంగ్రెస్ జెండా ఎగురావేస్తాం
మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంత రావు ధీమా
మెదక్ బ్యూరో, స్వేచ్ఛ: మున్సిపల్ ఎన్నికల్లో సర్వే ఆధారంగానే అభ్యర్థులకు టికెట్లు డిసైడ్ చేస్తామని, ఇప్పటికే ఒకసారి సర్వే పూర్తి అయిందని, ఇంకా సర్వేలు నిర్వహిస్తున్నామని మెదక్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హన్మంత రావు (Municipal Politics) స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల నుంచి డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ తో కలిసి బుధవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్బంగా మైనం పల్లి హన్మంత రావ్ మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీ లపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.మ్యాచ్ ఫిక్సింగ్ లకు పాల్పడితే పార్టీ నుంచి శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించారు. గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులుంటే ఈ రోజు పార్టీలో చేరిన టికెట్లు ఇస్తామన్నారు. టికెట్లు రాని సీనియర్లు ఆందోళన చెందవద్దని, వారికి నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పిస్తామన్నారు.
Read Also- Athreyapuram Brothers: కొత్త కథాంశంతో ప్రారంభమైన ‘ఆత్రేయపురం బ్రదర్స్’.. నేటి తారానికి తగ్గట్టు
మంచి మెజార్టీ తో గెలిస్తే సీఎం తో మాట్లాడి మరిన్ని నామినేటెడ్ పోస్టులు తీసుకవస్తానన్నారు. అభ్యర్థులను గెలిపించే భాద్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. ఎన్నికలు అయ్యే లోపు ఇతర పార్టీల నేతలతో మాట్లాడవద్దని సూచించారు. కాంగ్రెస్ దెబ్బకు హరీష్ రావ్ మెదక్ వైపు తొంగి చూడవద్దని, ఆ దిశగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేసి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రెండేళ్లలో మెదక్ నియోజక వర్గ అభివృద్ధి కి వందలాది కోట్ల రూపాయల నిధులు తెచ్చామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చోరువతో మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావ్ ఇటీవల మెదక్ మున్సిపాలిటీకి రూ 85 కోట్లు అభివృద్ధి పనుల నిమిత్తం తీసుకొచ్చారన్నారు.
Read Also- Sangareddy District: చెల్లిని ప్రేమించాడని.. ప్రియుడ్ని అడవిలోకి తీసుకెళ్లి.. అన్నలు దారుణం!
ఏడుపాయల కు రూ 35కోట్లు, మెదక్ చర్చి కి రూ 30కోట్లు తెచ్చామని పనులు సైతం జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మందుగుల గంగాధర్, మున్సిపల్ మాజీ చైర్మన్ తోడుపు నూరి చంద్రపాల్, గూడూరి కృష్ణ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడి మధుసూదన్ రావ్,సీనియర్ నాయకులు మ్యాడం బాలకృష్ణ, రాగి అశోక్,బొజ్జ పవన్, అరుణార్తి వెంకట రమణ,ఉప్పల రాజేష్ ముత్యాంగౌడ్, మున్నా, అఫ్జల్, దుర్గ ప్రసాద్,శంకర్ గౌడ్, ఆంజనేయులు గౌడ్,దయా సాగర్, మధు, దేవులా తదితరులు పాల్గొన్నారు.

