Hyderabad Traffic: ట్రాఫిక్ చిక్కులకు.. యువ ఐపీఎస్‌లతో చెక్!
CM Revanth Reddy Focuses on Hyderabad Traffic Reforms (Image Source: AI and Twitter)
హైదరాబాద్

Hyderabad Traffic: హైదరాబాద్ ట్రాఫిక్ చిక్కులకు.. యువ ఐపీఎస్‌లతో చెక్.. సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్!

Hyderabad Traffic: తెలంగాణలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఐపీఎస్ (IPS) అధికారుల బదిలీలను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేపట్టారు. శనివారం వెలువడిన ఉత్తర్వుల్లో ముఖ్యమంత్రి ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. నగరవాసులను ఏళ్ల తరబడి వేధిస్తున్న ట్రాఫిక్ చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేసే యువ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం రంగంలోకి దించింది.

ట్రాఫిక్‌పై సీఎం ఫోకస్!

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సైబర్ నేరాలను, మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మాదకద్రవ్యాల సరఫరాను ఉక్కుపాదంతో అణచివేయాలని పోలీసు అధికారులకు సూచించారు. ఆ దిశగా చర్యలు చేపట్టడంతో గతంతో పోలిస్తే హైదరాబాద్ లో డ్రగ్స్ కేసుల కలకలం కొద్దిమేర తగ్గింది. ఇప్పుడు తాజాగా రేవంత్ రెడ్డి దృష్టి హైదరాబాద్ ట్రాఫిక్ పై పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆ దిశగా యువ ఐపిఎస్ అధికారులకు హైదరాబాద్ లో కీలక ఏరియాల ట్రాఫిక్ బాధ్యతలను అప్పగించారు.

ట్రాఫిక్ వ్యవస్థ బలోపేతం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లతో పాటు కొత్తగా రూపుదిద్దుకుంటున్న ‘ఫ్యూచర్ సిటీ’ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేయడం ఈ బదిలీల ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. జిల్లాల్లో అదనపు ఎస్పీలుగా సమర్థవంతంగా పనిచేస్తున్న యువ అధికారులను ఎంపిక చేసి, వారికి నగరంలో ట్రాఫిక్ డీసీపీలుగా పోస్టింగులు ఇచ్చారు. ఈ బదిలీల్లో భాగంగా కొత్తగూడెం ఆపరేషన్స్ అదనపు ఎస్పీగా ఉన్న అవినాష్ కుమార్ ను హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-1 (ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు) గానూ, ఉట్నూరు అదనపు ఎస్పీగా ఉన్న కాజల్ ను హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-2 (గోల్కొండ, జూబ్లీహిల్స్ జోన్లు) గానూ నియమించారు.

అధికారుల బదిలీలు ఇలా..

అదే విధంగా జగిత్యాల అదనపు ఎస్పీ ఎస్. శేషాద్రిని రెడ్డిని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ-2 (కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ జోన్లు) బాధ్యతల్లోకి తీసుకురాగా, భువనగిరి అదనపు ఎస్పీ కనకాల రాహుల్ రెడ్డికి మల్కాజ్‌గిరి కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ డీసీపీ-1 బాధ్యతలు అప్పగించారు. ములుగు జిల్లా ఆపరేషన్స్ అదనపు ఎస్పీగా పనిచేస్తున్న శివం ఉపాధ్యాయను ప్రతిష్ఠాత్మక ‘ఫ్యూచర్ సిటీ’ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీగా నియమించడం విశేషం. రైల్వేస్ డీఐజీ హోదాలో ఉన్న జి. చందనా దీప్తిని ఫ్యూచర్ సిటీ అడ్మిన్ అండ్ ట్రాఫిక్ అదనపు సీపీగా నియమించారు. హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఉన్న బి.కె రాహుల్ హెగ్డేను అదే కమిషనరేట్ లో ట్రాఫిక్ డీసీపీ-3 (చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లు) గాను నియమించారు. అలాగే సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీగా ఉన్న జి. రంజన్ రతన్ కుమార్ ను అక్కడే ట్రాఫిక్ డీసీపీ-1 (శేరిలింగంపల్లి జోన్) గాను ప్రభుత్వం బదిలీ చేసింది.

Also Read: PhonePe Fake Links: సంక్రాంతి కానుక.. ఉచితంగా రూ.5 వేలు.. ఇలాంటి లింక్ కనిపిస్తే జాగ్రత్త!

ఇసుక అక్రమ రవాణాకు చెక్ పెట్టేలా..

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా వంటి అక్రమాలను అడ్డుకునేందుకు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్‌మెంట్‌లో డీఐజీగా ఉన్న అభిషేక్ మహంతిని నియమించారు. తద్వారా సహజ వనరుల లూటీని అరికట్టడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి గండిపడకుండా కఠిన చర్యలు చేపట్టనున్నారు. మొత్తంగా చూస్తే తాజా ఐపీఎస్ అధికారుల బదిలీల్లో అటు అనుభవానికి.. ఇటు యువత ఉత్సాహానికి సమ ప్రాధాన్యం కల్పిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పోలీసు వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Also Read: Assembly Session: ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు.. ఈసారి జగన్ రావాల్సిందేనా? లేదంటే సీటు గల్లంతేనా?

Just In

01

Telangana Cabinet Meet: చారిత్రాత్మక రీతిలో హరిత హోటల్‌లో తెలంగాణ కేబినెట్ భేటీ

Sankranthi Movies: సంక్రాంతి సినిమాలు.. మండే టెస్ట్‌లో నిలిచే సినిమా ఏది?

GHMC Politics: జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగియక ముందే మొదలైన పాలిటిక్స్

Municipal Elections 2026: మునిసిపల్ ‘రిజర్వేషన్ల’పై అసంతృప్తి.. టాక్ ఎలా ఉందంటే?

Dhanush and Mrunal: ధనుష్, మృణాల్ ఠాకూర్ పెళ్లి రూమర్స్.. సోషల్ మీడియాలో మీమ్స్ జాతర!