Collector : డ్రగ్స్ మత్తు పదార్థాలు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతయుతంగా కృషి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు (Collector Hanumantha Rao) అన్నారు. కలెక్టరేట్లో మాదకద్రవ్యాల నిరోధక కార్యక్రమంలో భాగంగా ఏఎస్పీ రాహుల్ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.
ప్రత్యేక దృష్టి పెట్టాలి
మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలను గురించి ప్రజలకు తెలియపరచాలన్నారు. గంజాయి తోపాటు ఇతర మత్తు పదార్థాలు అమ్మిన కొనుగోలు చేసిన అక్రమ రవాణా చేసిన ఆ వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులకు తెలియజేయాలని డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లల పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. యువత మాదక ద్రవ్యాల వాడకుండా గ్రామాలలో, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ,జిల్లా సంక్షేమ అధికారి నర్సింహా రావు, వైద్య శాఖ అధికారి డా.మనోహర్, జిల్లా విద్యాధికారి సత్యనారాయణ , సంబంధిత అధికారులుపాల్గొన్నారు.

