Honeytrap Couples: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ భార్య భర్తల ముఖాలు విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సులభంగా డబ్బు సంపాదించేందుకు వారు ఎంచుకున్న మార్గాన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. సాధారణంగా భార్యను ఎవరైనా తప్పుడు ఉద్దేశ్యంతో చూస్తేనే తట్టుకోలేని భర్తలు ఉన్న ఈ సమాజంలో ఓ వ్యక్తి ఏకంగా తన భాగస్వామిని పరాయి వ్యక్తులతో పాన్పు పంచుకునేలా చేయడం విస్మయానికి గురిచేస్తోంది. ఏకంగా 100 మందితో భార్యను శృంగారంలో పాల్గొనేలా చేసి.. భర్త తన సెల్ ఫోన్ లో వాటిని చిత్రీకరించడం ప్రతీ ఒక్కరిని షాక్ కు గురిచేస్తోంది. తెలంగాణలో జరిగిన ఈ భార్య భర్తల గలీజ్ దందా ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
ఛీ.. ఛీ వీడు భర్తేనా?
మంచిర్యాల జిల్లాకు చెందిన ఈ దంపతులు.. కరీంనగర్ లో ఉంటూ మార్బుల్ వ్యాపారం చేసేవారు. అయితే వ్యాపారంలో నష్టాలు రావడం, ఈఏంఐ భారం పెరిగిపోవడం, చేతిలో చిల్లిగవ్వ మిగలకపోతుండటంతో ఆర్థికంగా ఏం చేయాలో పాలు పోని స్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే భర్త బుర్రలోకి భయంకరమైన ఆలోచన వచ్చింది. భార్య అందాన్ని ఎరగా వేసి.. హానీ ట్రాప్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు. భర్త క్రూరమైన ఆలోచనను ఛీకొట్టాల్సిన భార్య.. ఇందుకు సై అనడంతో వారి జీవితాలు ఊహించని మలుపు తీసుకున్నాయి. సులభంగా డబ్బు సంపాదించేందుకు పక్కా ప్లాన్ తో హనీ ట్రాప్ కు ఈ జంట రూపకల్పన చేసింది.
In Telangana’s Karimnagar, the police have arrested a couple involved in honey-trapping and blackmailing people through social media.
The woman allegedly lured men using Instagram and YouTube, while her husband secretly recorded objectionable videos and used them for blackmail.… pic.twitter.com/CfFrlptpUE— iMayankofficial 🇮🇳 (@imayankindian) January 17, 2026
100 మందితో శృంగారం!
తమ హనీ ట్రాప్ ప్లాన్ ను అమలు చేసేందుకు భార్య.. తన ఇన్ స్టాగ్రామ్ ను వేదికగా ఎంచుకుంది. తన అందమైన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ.. నెటిజన్లను ఆకర్షించేది. తన మాయ మాటలతో వారిని బుట్టలో వేసుకునేది. తన ట్రాప్ లో పడ్డ మగవారిని ఇంటికి పిలిపించి.. వారితో తన ఫ్లాట్ లో ఏకాంతంగా గడిపేది. అయితే పరాయి పురుషుడితో భార్య సన్నిహితంగా ఉన్న దృశ్యాలను.. భర్త స్వయంగా తన మెుబైల్ లో బందించేవాడు. ఆ తర్వాత వారిని డబ్బు కోసం ఇద్దరూ బెదిరించేవారు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తామని హెచ్చరించేవారు. అలా దాదాపు 100 మంది నుండి ఈ కంత్రీ భార్య భర్తలు డబ్బు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. అయితే దాదాపు 1500 మంది పురుషులపై హనీ ట్రాప్ చేసేందుకు వీరు యత్నించినట్లు సమాచారం.
చివరికీ ఎలా చిక్కారంటే..
హానీ ట్రాప్ లో భాగంగా కరీంనగర్ కు చెందిన ఓ లారీ వ్యాపారిని సైతం ఈ భార్య భర్తలు బెదిరించడం ప్రారంభించారు. నగ్న వీడియోలు బయటపెడతామని బెదిరించి అప్పటికే రూ.13 లక్షలు దోచేశారు. అవి చాలక మరో రూ.5 లక్షలు ఇవ్వాలంటూ సదరు వ్యక్తిని బెదిరించడం మెుదలు పెట్టారు. దీంతో విసుగు చెందిన లారీ వ్యాపారి.. పోలీసులను ఆశ్రయించాడు. జరిగినదంతా వారికి చెప్పారు. దీంతో రంగంలోకి దిగిన కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి.. తన బృందంతో కలిసి వెళ్లి భార్య భర్తలు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Komatireddy IAS Issue: మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ ఎన్టీవీ వివాదం.. తెర వెనుక ఇంత కుట్ర దాగుందా?
రూ.కోట్లల్లో సంపాదన..
భార్య, భర్తలను తమదైన శైలిలో విచారణ చేయగా.. తాము చేసిన హానీ ట్రాప్ వ్యవహారం మెుత్తాన్ని పోలీసులకు చెప్పేశారు. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బుతో వారు రూ.65 లక్షల ఫ్లాట్, లగ్జరీ కారు, ఫర్నిచర్ కొనుగోలు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. నేరానికి ఉపయోగించిన సెల్ ఫోన్లతో పాటు కారు, నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాధితులు ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి తెలియజేస్తే వారికి న్యాయం చేస్తామని కరీంనగర్ రూరల్ పోలీసులు హామీ ఇచ్చారు. మరోవైపు ఈ భార్యభర్తల బాగోతం చూసి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి కపుల్స్ సమాజానికి సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

