Municipal Reservations:అత్యధిక చైర్ పర్సన్ స్ధానాలు జనరల్
–చైర్ పర్సన రిజర్వేషన్లో ఎస్టీలకు దక్కని చోటు
–మొయినాబాద్, వికారాబాద్, మూడు చింతలపల్లి ఎస్సీ రిజ్వర్
–జిల్లా యూనిట్‌గా చూస్తే మహిళాలకు మొండిచెయ్యి
–రాష్ట్ర యూనిట్లోనే మహిళాలకు 50శాతం రిజర్వేషన్
–మున్సిపాలిటీల్లోని వార్డుల వారీగా రిజర్వేషన్ ఖరారు
–ఆశావాహులకు తప్పని భంగపాటు
రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: రంగారెడ్డిలో 7 మున్సిపాలిటీలు, వికారాబాద్లో 4 మున్సిపాలిటీలు, మేడ్చల్‌లో 3 మున్సిపాలిటీలున్నాయి. అయితే మున్సిపాలిటీల వారీగా వార్డులకు అనుగుణంగా రిజర్వేషన్ల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ సంఖ్య ఆధారంగా జిల్లా కలెక్టర్లు ప్రతి మున్సిపాలిటీల్లోని వార్డుల రిజర్వేషన్లు ఖరారు చేశారు. అదేవిధంగా రాష్ట్రా స్థాయి యూనిట్‌గా మున్సిపాలిటీ చైర్ పర్సన్ రిజర్వేషన్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా యూనిట్‌గా పరిగణిస్తే మహిళాల కోటా తగ్గినట్లేనని తెలియజేయాలి. కానీ బీసీలకు కూడా మొండి చెయ్యి ఇచ్చినట్లు తెలుస్తోంది. జనరల్ స్ధానాలు అత్యధికంగా పెరిగిపోయాయి. వికారాబాద్లోలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లకు తగ్గట్టుగానే ఖరారు చేశారు. అదే మేడ్చల్ జిల్లాలో జనరల్, బీసీలకు పూర్తిగా అన్యాయమనే చెప్పక తప్పదు. మూడు జిల్లాలోని మున్సిపాలిటీను పరిశీలిస్తే జనరల్ స్ధానాలకే అత్యధిక రిజర్వేషన్లు దక్కినట్లు స్పష్టమైతున్నాయి. అదే ఎస్టీలకు ఒకే ఒక స్ధానం మేడ్చల్ జిల్లాలోని ఎల్లంపేట్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ దక్కగా… మిగిలిన జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎస్టీకి మొండి చెయ్యి.
ఆశావాహులకు భంగపాటు..
మున్సిపాలిటీ ఎన్నికలపై గత కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్న ఆశావాహుల ఉత్కంఠకు తెరపడింది. వార్డులు, చైర్ పర్సన్ స్ధానాల రిజర్వేషన్ల ఖరారుతో ఆశావాహుల ఆందోళనకు విముక్తి కలిగింది. ఈ రిజర్వేషన్లు కొంత మందకి అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిఫల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైతున్నప్పటి నుంచి ఆశావాహులు ఇప్పటికే పోటీ చేస్తున్నాను.. బరిలో ఉంటున్నాని ప్రచారాలు చేసుకున్నారు. కానీ తీరా రిజర్వేషన్ల విడుదలతో అనేక మంది ఆశావాహులు మౌనం వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఆశించి భంగపడ్డ వాళ్ల అధికంగా ఉన్నారంటే నమ్మశక్యంగా లేదు. రిజర్వేషన్లు అనుకూలించకపోతే రాజకీయాలను శాసించే వాళ్లు సైతం వెనుకడుగు వేయడం సహాజం. ఇప్పుడు పార్టీల నాయకులు అభ్యర్థులను బరిలో దించేందుకు తంటాలు పడాల్సి వస్తుందని ప్రచారం సాగుతుంది. బీసీ జనరల్, మహిళా అనుకుంటే.. ఎస్సీ మహిళా, జనరల్ రిజర్వేషన్లు. ఎస్టీలకు వార్డుల రిజర్వేషన్లు వస్తాయని ఆశించిన వారికి భంగపాటు కలిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు దక్కుతాయని అనుకున్న స్ధానాలు జనరల్ రిజర్వేషన్ కావడంతో ఆశావాహులు ఆలోచిస్తున్నారు.
చైర్ పర్సన్ రిజర్వేషన్లు ఇలా..
రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ ఎస్సీ జనరల్, షాద్‌నగర్ బీసీ జనరల్, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, చేవెళ్ల, అమన్‌గల్లు, కొత్తూరు మున్సిపాలిటీల చైర్ పర్సన్లు జనరల్ అభ్యర్ధులు పోటి పడే అవకాశం ఇచ్చింది. రంగారెడ్డి జిల్లాలో ఒక్క మహిళాలకు చైర్ పర్సన్ స్ధానం రిజర్వేషన్లు దక్కకపోవడం ఆశ్చర్యం కలుగుతుంది. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ బీసీ జనరల్, పరిగి బీసీ మహిళా, కొడంగల్ జనరల్, వికారాబాద్ ఎస్సీ మహిళాకు రిజర్వేషన్లు దక్కాయి. అదేవిధంగా మేడ్చల్ జిల్లాలోని అలియాబాద్ జనరల్ ఉమెన్స్, మూడు చింతలపల్లి ఎస్సీ జనరల్, ఎల్లంపేట్ ఎస్టీ మహిళాకు రిజర్వషన్లు అనుకూలంగా వచ్చయి.

