Harish Rao: ప్రాజెక్టులు కట్టడం బీఆర్ఎస్ వంతు..
Harish Rao ( image credit: twitter)
Political News

Harish Rao: ప్రాజెక్టులు కట్టడం బీఆర్ఎస్ వంతు..పేర్లు పెట్టుకోవడం కాంగ్రెస్ వంతు.. ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్!

Harish Rao: ప్రాజెక్టులు కట్టడం బీఆర్ఎస్ వంతు, వీసమెత్తు కృషి చేయని కాంగ్రెస్ నాయకుల పేర్లు పెట్టి మనోభావాలను అవమానించడం కాంగ్రెస్ వంతు అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao) అన్నారు. ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. రెండేళ్ల పాలనలో చేసింది లేదు, చెప్పుకునేందుకు ఏదీ లేదన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు కేసీఆర్ అహర్నిశలు శ్రమించి ప్రాజెక్టులు కడితే.. వాటిపై కాంగ్రెస్ స్టిక్కర్లు వేసుకోవాలని చూస్తున్న రేవంత్ అర్భకత్వాన్ని చూసి జాలి వేస్తోందన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో నిర్మించిందేం లేక కేసీఆర్ పూర్తి చేసిన ప్రాజెక్టులు, నిర్మాణాలకు రిబ్బన్ కట్ చేయడమే పనిగా పెట్టుకున్నడు రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. సీఎం పదవి కలిసొచ్చిన రేవంత్ రెడ్డికి కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టులు, ఉద్యోగ నియామకపత్రాలు రెడీ మేడ్ గా తయారై ఉన్నాయి.. తట్టెడు మట్టి తీసింది లేదు, ఒక్క ఇటుక వేసింది లేదు అయినా చనాకా కొరటా, సదర్మాట్ బ్యారేజీలను తామే పూర్తి చేసినట్లు గొప్పలు చెప్పుకున్న నేటి మీ సభ మీరు చెప్పినట్లే.. చరిత్రలో నిలబడుతుంది మంత్రి ఉత్తం అని మండిపడ్డారు.

రూ. 1200 కోట్లు ఖర్చు

కేసీఆర్ మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకొని, రూ. 1200 కోట్లు ఖర్చు పెట్టి చనాకా-కొరాటా బ్యారేజీ, పంప్ హౌస్‌లు, మెయిన్ కెనాల్, సబ్ స్టేషన్లతో సహా పనులు పూర్తి చేయించారు. 2023 సెప్టెంబర్‌లోనే సక్సెస్‌ఫుల్‌గా వెట్ రన్ కూడా పూర్తి చేసారన్నారు. ప్రాజెక్టుకు కాలువల పనులకు అవసరమైన 3,200 ఎకరాల్లో 1600 ఎకరాలను కేసీఆర్ సేకరిస్తే.. ఈ రెండేళ్లలో ఒక్క ఎకరా భూమి కూడా సేకరించలేని నువ్వు, ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వని నువ్వు.. ఏ మొహం పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ రీ-రన్ (వెట్ రన్) డ్రామాలు ఆడుతున్నావు?.. రెండేళ్లుగా భూమి సేకరించకుండా, కాలువలు తవ్వకుండా.. ఆదిలాబాద్ ప్రజలను మోస పుచ్చారు.. క్రెడిట్ కొట్టేయడం మీద ఉన్న శ్రద్ధ.. భూసేకరణ మీద పెట్టి ఉంటే ఈపాటికి ప్రాజెక్ట్ ఫలితాలు రైతులకు దక్కేవి 1.5 టీఎంసీ ల సామర్థ్యంతో కేసీఆర్ గారు రూ. 500 కోట్లతో సదర్మాట్ బ్యారేజీని సిద్ధం చేస్తే.. రెండేళ్లుగా చుక్క నీరు నిలపకుండా ఉమ్మడి ఆదిలాబాద్ రైతుల నోట్లో మట్టి కొట్టారు. రెండేళ్ల క్రిందనే 18 వేల ఎకరాల ఆయకట్టును నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా, ఇవ్వకున్నా రైతులకు తీరని అన్యాయం చేసారు. ఇప్పుడు సిగ్గులేకుండా రిబ్బన్ కట్ చేస్తూ అంతా మీ ఘనతే అని డబ్బా కొట్టుకోవడం మీ దగుల్భాజీతనానికి పరాకాష్ట.. ఈ రెండేళ్ల కాలం వృథా చేసినందుకు ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణ చెప్పాలి.

Also Read: Harish Rao: యూనివర్సిటీలపై ఎందుకంత కక్ష? కాంగ్రెస్ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం : హరీశ్ రావు కామెంట్స్!

కాంగ్రెస్ ప్రభుత్వం హరీష్ రావు ఫైర్!

కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు పంచడం కేసీఆర్ కట్టిన ప్రాజెక్టులకు రిబ్బన్లు కట్ చేయడం తప్ప సొంతంగా మీరు చేసిందేం లేదు. బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టుకు సున్నాలు వేసి నాదే అని చాటింపు వేసుకోవడం మీ అల్పబుద్దికి నిదర్శనం. ప్రాజెక్టులు కట్టడం మా వంతు, పేర్లు పెట్టుకోవడం మీ వంతు పరిపాటిగా మారింది.. లోయర్ పెన్ గంగా ప్రాజెక్టు పేరు చెప్పుకొని రెండు సార్లు ఎన్నికల్లో గెలిచి, ప్రజల్ని మోసం చేసిన రామచంద్రారెడ్డి పేరు ప్రాజెక్టుకు పెట్టడం అంటే ఆదిలాబాద్ ప్రజల మనోభావాలను అవమానించడమేఅన్నారు. ప్రాజెక్టు నిర్మించి ఆదిలాబాద్ ప్రజల కలలు సాకారం చేసింది బీఆర్ఎస్ అయితే, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో వీసమెత్తు కృషి చేయని వ్యక్తి పేరు పెట్టి మోసం చేస్తున్నది కాంగ్రెస్. ఆదిలాబాద్ వెనుకబాటు తనానికి, పాలమూరు వలసలకు కారణం దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వానిది కాదా తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు కడుతామని చెప్పి రెండేళ్లు గడిచినా ఒక్క తట్టెడు మట్టి కూడా ఎందుకు తీయలేక పోయారు? తమ్మిడిహట్టి పేరు మీద అప్పుడు ఆరేండ్లు, ఇప్పుడు రెండేళ్లు కాలయాపన చేసారన్నారు. మాయ మాటలు చెప్పి అదిలాబాద్ జిల్లాకు తీరని ద్రోహం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు

రెండేళ్లలో రాష్ట్రం అప్పుల కుప్ప

గ్రావిటి కాలువను వదిలి ఎత్తిపోతలకు వెళ్లామని మమ్మల్ని విమర్శించిన మీరు ఇప్పుడు తమ్మడిహట్టి నుంచి గ్రావిటి ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తెచ్చి చూపండి. లేదంటే అధికారం కోసం ప్రజలకు నోటికొచ్చిన అబద్దం చెప్పినందుకు క్షమాపణలు చెప్పమని డిమాండ్ చేశారు. చిత్తశుద్ది గల ప్రభుత్వం ఉంటే పనులు చేస్తది తప్ప సాకులు వెతకదు. రెండేళ్లలో చేసిందేం లేక బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నడు రేవంత్ రెడ్డి అని దుయ్యబడ్డారు. అభివృద్ది కోసం రెండేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో చేసిన అప్పు అక్షరాల రూ.4.17లక్షల కోట్లే అని కాగ్‌ రిపోర్ట్‌తో పాటు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో చెప్పినా ఎందుకు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

జీవితమంతా అబద్దాలేనా?

ప్రతిపక్షంలో అబద్దాలే, అధికార పక్షంలో అబద్దాలే జీవితమంతా అబద్దాలేనా? రేవంత్ రెడ్డి రెండేళ్లలోనే రెండున్నర లక్షల కోట్లు అప్పు చేసి, ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క కాల్వ తీయలేదు, ఒక్క చెరువు తవ్వలేదు, ఒక్క హామి నిలబెట్టుకోలేదు, తెచ్చిన అప్పులతో ఏం చేసావో దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాలన మీద మీకు నమ్మకం ఉంటే జోగు రామన్నని, బిఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఎందుకు ఉదయం నుంచి అరెస్టులు చేసావు రేవంత్ రెడ్డి? అరెస్టులు చేపిస్తూ, బెదిరింపులకు పాల్పడుతూ, పోలీసులను అడ్డం పెట్టుకొని తిరుగుతూ ఇలా ఎన్ని రోజులు గడుపుతావు రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు. పరిపాలన అంటే కేవలం కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల దగ్గర శిలాఫలకాల మీద మీ పేరు చెక్కించుకోవడం కాదు, ప్రజల మనోఫలకాల మీద మీ ముద్ర వేసుకునేలా పని చేయడం అని ఇప్పటికైనా గ్రహించండి అని హితవు పలికారు.

Also Read: Harish Rao: నల్లమల సాగర్ కు సహకరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. నీళ్ల శాఖ మంత్రిపై హరీష్ రావు ఫైర్!

Just In

01

BJP Group Politics: బీజేపీలో గ్రూప్ పాలిటిక్స్.. ఆ తరహా రాజకీయాలుంటే తప్పేంటి.. బీజేపీ ఎంపీల భిన్న స్వరాలు!

Naveen Polishetty: క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తే.. అవుట్ పుట్ ‘రాజు’లా ఉంటుంది

CM Revanth Reddy: ఆదిలాబాద్‌లో యూనివర్సిటీ, ఎయిర్ పోర్టులను ఏర్పాటు చేస్తాం.. నిర్మల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు!

Sharwanand: సంక్రాంతికి శర్వా వస్తే.. అన్ని సినిమాలు హిట్టే. వచ్చే సంక్రాంతికి కూడా రెడీ!

Chikiri Chikiri Song: ‘పెద్ది’ మేనియా.. మరో ఘనతను సాధించిన ‘చికిరి చికిరి’ సాంగ్!