Jhansi Incident: ఉత్తర్ ప్రదేశ్ లోని ఝాన్సీలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడితో హోటల్ గదిలో ఉన్న భార్యను భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. భర్తను చూసి ఒక్కసారిగా భయపడిపోయిన ప్రియుడు.. మంచం కిందకు దూరి దాక్కునే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. భర్త ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఘటన యూపీ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
అసలేం జరిగిందంటే?
ఝాన్సీ బస్ స్టాండ్ సమీపంలోని నవాబాద్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. భర్త తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 11న తన భార్య వేరే వ్యక్తితో తిరుగుతున్నట్లు ఆమె భర్తకు సమాచారం అందింది. దీంతో భార్య, ఆమె ప్రియుడ్ని భర్త వెంబడించాడు. వారిద్దరు ఓ హోటల్ గదిలోకి వెళ్లడాన్ని గమనించాడు. దీంతో అప్రమత్తమైన భర్త.. వెంటనే 112 హెల్ప్ లైన్ నెంబర్ కు సమాచారం ఇచ్చాడు. ఆపై భార్య, ప్రియుడు బుక్ చేసుకున్న హోటల్లోని 103 గదిలోకి వెళ్లాడు.
మంచం కిందకు దూరిన ప్రియుడు..
భర్త హోటల్ గది తలుపు తెరవగానే.. పరిస్థితి ఉద్రిక్తంగా మారిపోయింది. భర్తను చూసి భార్య, ఆమె ప్రియుడు ఒక్కసారిగా ఖంగు తిన్నారు. భర్త నుంచి తప్పించుకునేందుకు భార్య ప్రియుడు మంచం కిందకు దూరాడు. ఈ క్రమంలో భార్య, భర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా.. చుట్టుపక్కల గదులవారు, హోటల్ సిబ్బంది 103 రూమ్ వద్దకు చేరుకున్నారు. భర్తకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు పోలీసులు సైతం హుటాహుటీనా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు.
నాకు విడాకులు ఇవ్వండి: భార్య
భర్తతో గొడవపడుతున్న క్రమంలో భార్య కీలక విషయాలు వెల్లడించింది. తాను రెండేళ్లుగా భర్తకు దూరంగా ఉంటున్నట్లు ఆమె తెలిపింది. విడాకులు తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. దీంతో భర్త ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ఫలితంగా హోటల్ గదిలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు.. వారి ఇరువురుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
సహచర ఉద్యోగితో సంబంధం!
అయితే తమకు మూడేళ్ల క్రితం వివాహమైనట్లు భర్త స్పష్టం చేశాడు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే తమ మధ్య గొడవలు జరిగాయని పేర్కొన్నాడు. ఈ క్రమంలో 2023లోనే భర్తపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే కోర్టు మద్యవర్తిత్వం వహించడంతో సమస్య పరిష్కారమైంది. రాజీ పడిన తర్వాత కొన్నిరోజులు బాగానే ఉన్న ఈ జంట.. తిరిగి గొడవలు పడటం ప్రారంభించింది. దీంతో ఏడాదిన్నర కాలంగా విడివిడిగా ఉంటున్నట్లు భర్త తెలిపాడు. తన భార్య ఓ స్కూల్లో పనిచేస్తోందని.. అక్కడ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందని ఆరోపించాడు.
Also Read: Koluvula Panduga: ఆశ్చర్యం.. చంద్రబాబు నాయుడికి జాబ్.. నియామక పత్రం ఇచ్చిన సీఎం రేవంత్!
పోలీసు అధికారి ఏమన్నారంటే?
తొలుత విడాకులు ఇచ్చేందుకు తన భార్య రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు భర్త ఆరోపించాడు. తనను మానసికంగా వేధిస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై స్పందించిన నవాబాద్ పోలీసు స్టేషన్ ఇంఛార్జ్ రవి శ్రీవాస్తవ.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భర్త స్టేట్ మెంట్ ను రికార్డు చేశామని.. అతడి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. భర్త ఆరోపణల్లో నిజా నిజాలను నిగ్గుతేల్చి.. తదుపరి చర్యలు తీసుకుంటామని రవి శ్రీవాస్తవ చెప్పుకొచ్చారు.
In a dramatic incident in #Jhansi, #UttarPradesh, a husband caught his wife red-handed with her boyfriend at a hotel in the #Navabad area.
Acting on a tip-off, the husband learned that his wife was travelling with another man. Suspicious of her movements, he followed the couple.… pic.twitter.com/ueB31ToXQi
— Hate Detector 🔍 (@HateDetectors) January 16, 2026

