Vishwak Sen
Cinema, ఎంటర్‌టైన్మెంట్

Vishwak Sen | పృథ్వీ మాటలతో నాకు సంబంధం లేదు.. విశ్వక్ సేన్ ఝలక్..!

Vishwak Sen | విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా చిక్కుల్లో పడింది. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ చేసిన గొర్రెల వ్యాఖ్యలే ఇప్పుడు పెద్ద రచ్చకు దారి తీశాయి. దీంతో బాయ్ కాట్ లైలా మూవీ అంటూ పోస్టులు వెలుస్తున్నాయి. దీనిపై తాజాగా హీరో విశ్వక్ సేన్ ( Vishwak Sen) స్పందించారు. పృథ్వీ చేసిన వ్యాఖ్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అతను సినిమాలో కేవలం నటుడు మాత్రమే అని చెప్పారు. సినిమాలో అన్ని గొర్రెలు లేవని.. పృథ్వీ చేసిన వ్యాఖ్యలకు విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పారు. తాను ఎవరికీ అన్యాయం చేయలేదని.. తనను ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ఎమోషనల్ అయ్యారు.

Read Also :రంగరాజన్ కు అండగా ఉంటా.. నిందితులను రేవంత్ ప్రభుత్వం శిక్షించాలి: పవన్ కల్యాణ్

రిలీజ్ కు ముందే హెచ్ డీ ప్రింట్ రిలీజ్ చేస్తామని బెదిరిస్తున్నారని.. ఇప్పటికే బాయ్ కాట్ లైలా పేరుతో 22 వేల ట్వీట్స్ వేశారని విశ్వక్ చెప్పాడు. అసలు పృథ్వీ చేసిన వ్యాఖ్యలకు తమకు ఏం సంబంధం అని.. తాము ఈవెంట్ లో లేనప్పుడు విశ్వక్ సేన్ మాట్లాడితే తమ సినిమాను నిందించడం కరెక్ట్ కాదన్నాడు. పృథ్వీ సినిమాలో కేవలం నటుడు మాత్రమేనని.. అతని వ్యాఖ్యలతో తనను టార్గెట్ చేయడం ఏంటని విశ్వక్ మండిపడ్డారు. తాను ఎలాంటి బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదని విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు.

Just In

01

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు