Crime News: సంక్రాంతి పండుగతో దొంగలు హల్చల్ చేస్తున్నారు. మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ దొంగల ముఠా పంజా విసిరుతున్నారు. సంక్రాంత్రికి అందరు కలిసి కుటుంభంతో సరాదాగా గడపడానికి పట్టనప్రాంతాల్లొ ఉన్న ప్రజలు పల్లె బాట పట్టారు. దీంతో ఇదే అదునైన సమయం అనుకోని కొందరు దొంగల ముఠా మేడిపల్లి(Medipally)లోని చెంగిచెర్లలో భారీ చోరీలకు పాల్పడుతున్నారు. దాదాపుగా 12 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డారు. తెల్లవారు జామున 2:30 ఘటల సమయంలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. ఊరికి వెల్లిన వారి ఇళ్లను టార్గెట్ చేస్తూ వరుస దొంగతనాలకు పాల్బడుతున్నారు.
చెంగిచెర్ల పరిసర ప్రాంతంలో
మేడిపల్లి పరిసర ప్రాంతాల్లో దొంగలు హడలెత్తిస్తున్నారు. ఇంట్లో ఎవరులేని సమయం చూసుకోని చోరీలకు పాల్పడుతున్నారు. నిన్న రాత్రికాల సమయంలో దొంగలు చేతిలో కత్తులతో చెంగిచెర్ల(Chengicherla) కాలనీలో కొంతమందికి కనిపించారని తెలిపారు. మేడిపల్లిలోని చెంగిచెర్ల పరిసర ప్రాంతంలో అక్కడ ముందే రెక్కి చేసి కారు(Car)లో వచ్చి భారీగా చోరీలకు పాల్పడ్డుతున్నట్టు అక్కడి స్ధానికులు తెలిపారు. దీంతో స్ధానికుల పోలీసులకు సమాచారం అందించారు. చెంగిచెర్ల పరిసరప్రాంతాల్లో దొంగలు ఓ ముఠాగా ఎర్పడి 12 ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. అనంతరం పలు ఇళ్లలో చోరీకి ప్రయత్నించగా సాద్యపడకపోవడంతో అక్కడి నుండి ఎస్కేప్ అయ్యారని స్ధానికులు తెలిపారు. దీంతో అప్రమత్తమైన బాధితులు మేడిపల్లి పోలీసులు ఫిర్యాదు చేసారు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకిని క్లూస్ టీమ్ సహయంతో దొంగలను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Also Read: Labour Card: లేబర్ కార్డు అంటే ఏమిటి..? ఈ కార్డుతో కలిగే లాభాలేంటో తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం..?
సంక్రాంతి పండుగ వేళ దొంగల హల్చల్
మేడిపల్లిలోని చెంగిచెర్లలో వరుస చోరీలు
12 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డ దొంగల ముఠా
చేతిలో కత్తులతో చెంగిచెర్ల కాలనీలో దొంగల సంచారం
మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్న పోలీసులు, క్లూస్ టీమ్ pic.twitter.com/QtpWlKnNKz
— BIG TV Breaking News (@bigtvtelugu) January 16, 2026
Also Read: Maoist Surrender: మావోయిస్టులకు బిగ్ షాక్.. 52 మంది మావోయిస్టులు సరెండర్..!

