Maoist Surrender: బీజాపూర్ జిల్లాలో 52 మంది మావోయిస్టులు జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, సిఆర్పిఎఫ్ అధికారుల ఎదుట సరెండర్ అయ్యారు. చత్తీస్గడ్ రాష్ట్రంలో లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాస పథకాల ఆకర్షణతో హింసా మార్గాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసి తమ కుటుంబాలతో జీవించాలని 52 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ గురువారం వెల్లడించారు. రోజురోజుకు మావోయిస్టు పార్టీ ఉద్యమం బలహీన పడుతున్న నేపథ్యంలో వివిధ క్యాడర్లలో ఉన్న మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు వరుస కడుతున్నారు.
రూ.1.41 కోట్ల రివార్డు..
బీజాపూర్ లో పెద్ద సంఖ్యలో 52 మంది ఒక్కసారి పోలీసుల ఎదుట లొంగిపోవడంతో మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ తగిలినట్లుగానే మేధావి వర్గాలు భావిస్తున్నారు. తెలంగాణ సరిహద్దుల్లో భద్రతా బలగాలు చేస్తున్న విస్తృత కూంబింగ్లకు తాళలేక మావోయిస్టులకు మనుగడ లేదని విషయాన్ని గుర్తించిన మావోయిస్టు చిన్న చిన్న క్యాడర్లలో పనిచేసే వారంతా పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు క్యూ కడుతున్నారు. లొంగిపోయిన 52 మంది మావోయిస్టుల్లో 21 మంది మహిళలు ఉన్నట్లు ఎస్పి జితేంద్ర కుమార్ యాదవ్ వెల్లడించారు. మొత్తంగా లొంగిపోయిన మావోయిస్టులపై రూ.1.41 కోట్ల రివార్డు ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. లొంగిపోయిన వారిలో డివిజనల్ కమిటీ సభ్యుడు లక్కు కరం అలియాస్ అనిల్, ఫ్లాటున్ పార్టీ కమిటీ సభ్యులు లక్ష్మి మద్వి అలియాస్ రత్న, చిన్ని సోది వంటి కీలక నేతలు ఉన్నారని అధికారులు చెబుతున్నారు.
మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ..
ఇందులో ఎనిమిది మందిపై ఒక్కొక్కరిపై రూ. 8 లక్షల రివార్డు ఉన్నట్లుగా చెబుతున్నారు. గత కొద్ది రోజుల్లో చత్తీస్గడ్లో జనవరి 14న సుకుమా జిల్లాలో 29 మంది, దంతే వాడ వాడ జిల్లాలో 63 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లుగా అధికారులు వెల్లడిస్తున్నారు. జనవరి 14, 15 తేదీల్లోనే 144 మంది లొంగిపోవడం మావోయిస్టు పార్టీకి పెద్ద దెబ్బ అని పోలీసులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అనుకున్న లక్ష్యం ప్రకారం ముందుకు భద్రతా బలగాలు సాగుతున్నాయి. టార్గెట్ కంటే ముందే మావోయిస్టు పార్టీని అంతం చేసేందుకు కేంద్ర చత్తీస్గడ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రచిస్తూ భద్రతా బలగాలను రంగలోకి దింపి మావోయిస్టులపై విస్తృతమైన కూంబింగ్ లను నిర్వహిస్తూ… లొంగిపోయిన వారిని అక్కున చేర్చుకొని వారికి పునరావాసం కల్పిస్తున్నారు.
Also Read: Maoists Surrender: ఏటూరునాగారంలో.. లొంగిపోయిన మావోయిస్టులు.. వనం నుంచి జనంలోకి!

