Municipal Elections: మున్సీపాలిటీ వార్డుల రిజర్వేషన్‌పై ఉత్కంఠ
Municipal Elections (imagecredit:swetcha)
మెదక్

Municipal Elections: మున్సీపాలిటీ వార్డుల రిజర్వేషన్‌పై ఉత్కంఠ.. నేడో రేపో రిజర్వేషన్ల ఖరారు

Municipal Elections: మున్సిపాలిటీల వార్డుల రిజర్వేషన్‌లను ప్రభుత్వం కేటగిరిల వారిగా ప్రకటించగా ఏ వార్డుకు ఏ కేటగిరి కింద రిజర్వేషన్లు కెటాయిస్తారనే దానిపై ఆశావాహులపై ఉత్కంఠ నెలకొంది. అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులుండగా ఎస్టీ జనరల్‌ 1, ఎస్సీలకు 3 వార్డులు కెటాయించగా అందులో జనరల్‌ 2, మహిళ 1ని కెటాయించారు. బీసీలకు 6 వార్డులను కెటాయించగా మూడు జనరల్, 3 మహిళలకు కెటాయించారు. జనరల్‌ మహిళలకు 6, జనరల్‌ 4 స్థానాలను కెటాయించారు. దీంతో ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న నాయకుల్లో టెన్షన్‌ నెలకొంది. అందోలు(Andole), జోగిపేట(Jogipet)లు కలిసి మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత అందోలు గ్రామానికి 5 వార్డులు అందులో రెండు వార్డులు ఎస్‌సీలకు మిగతా బీసీ, జనరల్‌లకు కెటాయించారు. జోగిపేటలోని 15 వార్డుల్లో ఒక్కొక్కటి ఎస్‌సీ, ఎస్‌టీలకు కెటాయించారు. మిగతా 13 స్థానాల్లో ఓసీ(OC), బీసీ(BC), బీసీ మహిళలకు కెటాయించారు. బుధవారం ప్రకటించిన రిజర్వేషన్లతో గతంలో ఉన్న రిజర్వేషన్లన్నీ తారు మారు అయ్యే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.

లక్షలు ఖర్చుపెట్టుకున్న నాయకులు

ఈ సారి బీసీలకు 33శాతం రిజర్వేషన్లు కెటాయించినట్లుగా సమాచారం. జనాభ ప్రతిపాతిపదికన, కులాల వారి ఓటర్ల శాతంను బట్టి రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది. జోగిపేటలోని మాజీ మున్సిపల్‌ చైర్మన్‌లుగా పనిచేసిన వార్డులు ఎస్‌సీ, ఎస్‌టీలకు రిజర్వు కానున్నాయని ఆయా వార్డుల నాయకులు చెబుతున్నారు. ఈ వార్డుల్లో ఎస్‌సీ, ఎస్‌టీ ఓటర్లు ఎక్కువగా ఉండడమే కారణమని అంటున్నారు. ఏది ఏమైనప్పటికిని ముందుగా ఊహంచుకొని లక్షలు ఖర్చుపెట్టుకున్న నాయకులు రిజర్వేషన్లు ఏ విధంగా ఉంటాయోనన్న టెన్షన్‌లో ఉన్నారు. బీసీలకు 6, జనరల్‌ మహిళ 6 జనరల్‌ 4 మొత్తం కలిపి 16 వార్డులను కెటాయించారు. ఈ స్థానాల్లో అశావాహులు తమ అదృష్టం పరీక్షించుకోవాల్సి ఉంది. జనరల్‌ కెటగిరీల్లో అందోలు, జోగిపేటలోని రెండు కుటుంబాలకు చెందిన నాయకులు మాత్రమే పోటీ చేసే అవకాశం ఉంది. వీరిలో ఎవరు పోటీ చేసినా చైర్మన్‌ పదవి కోసమేనని తెలుసుకోవచ్చు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహ స్వంత నియోజకవర్గం కావడంతో జిల్లాలో అందోలు–జోగిపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా చూస్తున్నారు.

Also Read: Municipal Elections: ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్.. రిజర్వేషన్ల పూర్తి వివరాలు ఇవే!

అందరి దృష్టి చైర్మన్‌ రిజర్వేషన్‌పైనే..

జోగిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రిజర్వేషన్‌పైనే అందరి దృష్టి ఉంది. గత ఎన్నికల్లో బీసీ జనరల్‌గా కెటాయించారు. ఈసారి జనరల్‌ కెటగిరీ కింద కెటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. బీసీకి చెందిన నాయకులు ఎ.చిట్టిబాబు, ఎస్‌. సురేందర్‌గౌడ్‌లు చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నారు. ఒకవేళ జనరల్‌ కేటగిరిలో మహిళకు కెటాయించినట్లయితే మార్క్‌ఫెడ్‌ రాష్ట్ర డైరెక్టర్‌ జగన్మొహన్‌రెడ్డి కుటుంబానికి, జనరల్‌ కెటగిరికి కెటాయించినట్లయితే మాజీ సర్పంచ్, న్యాయవాదికి అవకాశం కల్పించవచ్చునని ప్రచారం జోరుగా సాగుతుంది.

Also Read: Sankranti Exodus: అయ్యయ్యో.. వెలవెలబోయిన పర్యాటక ప్రాంతాలు.. ఇప్పుడు ఎలా..?

Just In

01

Collector Rahul Sharma: మినీ మేడారం జాతరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.. కలెక్టర్ రాహుల్ శర్మ!

Hyderabad Crime: క్షణికావేశం..బంధాన్ని తుంచేసింది..పెగ్గు కొసం అన్నను చంపిన తమ్ముడు.. నాచారంలో దారుణ ఘటన!

The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ మొదటి వారం వసూళ్లు ఎంతంటే?.. కింగ్ సైజ్ బ్లాక్‌బాస్టర్..

Dragon Movie: ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్.. వరుసగా రెండోసారి..

Bapatla SP: సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆ జిల్లా ఎస్పీ కీలక సూచనలు!