Municipal Elections: ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్సిపల్ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసింది. ఖమ్మం కార్పొరేషన్ ఎస్టి 1, ఎస్సీ 7, బీసీ 20, అండ్ రిజర్వుడ్ 30. ఖమ్మం కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ 11, ఎస్సీ 12, బీసీ 7, అండ్ రిజర్వ్డ్ 30. ఎదులాపురం మున్సిపాలిటీ ఎస్టీ 3, ఎస్సీ 7, బిసి 6, అండ్ రిజర్వ్డ్ 16. కల్లూరు మున్సిపాలిటీ 3, ఎస్సీ 5, బిసి 2, అన్ రిజర్వుడ్ 10. మధిర మున్సిపాలిటీ 1, ఎస్సీ 6, బిసి 4, అన్ రిజర్వుడ్ 11, సత్తుపల్లి మున్సిపాలిటీ ఎస్టి 1, ఎస్సీ 3, బీసీ 7, అండ్ రిజర్వుడ్ 12, వైరా మున్సిపాలిటీ ఎస్టీ 1, ఎస్సీ 5, బిసి 4, అండ్ రిజర్వ్డ్ 10, అశ్వరావుపేట మున్సిపాలిటీ ఎస్టి 3, ఎస్సీ4, బిసి 4, అండ్ రిజర్వ్డ్ 11, ఇల్లందు మున్సిపాలిటీ ఎస్టీ 2, ఎస్సీ 4, బిసి 6, అన్ రిజర్వ్డ్ 12 స్థానాలను వార్డు కౌన్సిలర్ల రిజర్వేషన్లను రాష్ట్ర అధికారి నోటిఫికేషన్ జారీ చేశారు.
Also Read: Municipal Elections: మునిసిపల్ ఎన్నికలపై బీజేపీ కీలక నిర్ణయం!.. జనసేనతో పొత్తుపై క్లారిటీ!
రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో హోరాహోరి
రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశం కనిపిస్తోంది. వార్డు కౌన్సిలర్లకు సంబంధించిన రిజర్వేషన్లు వెళ్లడయ్యాయి. ఇక మున్సిపల్ చైర్మన్ కు సంబంధించిన నోటిఫికేషన్ ద్వారా వెల్లడి కావలసి ఉంది. మున్సిపల్ చైర్మన్, మేయర్ లకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు అయితే ఇక తెలంగాణలో మునిసిపాలిటీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష, బీజెపి తమ సర్వశక్తులను ఒడ్డే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అత్యధిక మున్సిపల్ పీఠాలను కాంగ్రెస్ పార్టీ దక్కించుకునేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నాయకులతో విస్తృతస్థాయి సమీక్ష సమావేశాలను నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు సర్వం సిద్ధం
అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ, కేంద్రంలో ఉన్న బీజెపి పార్టీ కూడా తమ అభ్యర్థులను బరిలో నిలిపి గెలిపించుకున్నందుకు విశేషంగా కృషి చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఏదేమైనా గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచులు కాంగ్రెస్ పార్టీ తరఫున అత్యధికంగా గెలుపొందడంతో అత్యంత విశ్వాసంతో మున్సిపల్ వార్డులను, మున్సిపల్ చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో 25 శాతం పైగా సీట్లు సాధించిన టిఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ తమ సర్వ శక్తులను ఒడ్డి సర్పంచ్ స్థానాల కంటే మునిసిపాలిటీ వార్డు స్థానాలను, చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు విశేషంగా కృషి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక థర్డ్ ప్లేసులో ఉన్న బీజెపిపార్టీ కూడా తమ అభ్యర్థులను అన్ని స్థానాల్లో నిలబెట్టి గెలిపించుకునేందుకు ప్రణాళికలు రచించుకుంటున్నారు.

