Minister Ponguleti Srinivas: పాలేరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
Minister Ponguleti Srinivas (imagecredit:twitter)
ఖమ్మం

Minister Ponguleti Srinivas: 18న పాలేరుకు సీఎం రేవంత్ రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన..!

Minister Ponguleti Srinivas: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18న జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆయన పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం, ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. ప్రారంభోత్సవాలను మద్దులపల్లిలో వర్చువల్‌గా చేయనున్నారు. ఈ పర్యటనను పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే, తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కోరారు.

Also Read:,Ranga Reddy District: రైతుల భూములపై రియల్టర్ల కన్ను.. ఫామ్ ల్యాండ్ వెంచర్లపై నియంత్రణ ఎక్కడ?

అభివృద్ధి పనుల వివరాలు

కూసుమంచి: 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన.

మద్దులపల్లి: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా నిర్మించిన వ్యవసాయ మార్కెట్ మరియు నర్సింగ్ కాలేజీ ప్రారంభోత్సవం.

లింక్ కెనాల్: మున్నేరు – పాలేరు లింక్ కెనాల్ (గ్రావిటీ పథకం) నిర్మాణ పనులకు శంకుస్థాపన.

అనంతరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు.

మంత్రి పొంగులేటి పిలుపు..

ఆదివారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాలకు ఏదులాపురం మున్సిపాలిటీతో పాటు పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సీఎం పర్యటనను విజయవంతం చేయాలని మంత్రి పొంగులేటి కోరారు.

Also Read: GHMC Property Tax: ట్యాక్స్ కలెక్షన్‌పై జీహెచ్‌ఎంసీ ఫోకస్.. పండుగ తర్వాత వసూళ్ల వేట!

Just In

01

Seetha Payanam: సంక్రాంతి స్పెషల్‌గా ‘సీతా పయనం’ నుంచి బసవన్న వచ్చేశాడు..

Madhira Municipality: మధిర మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: భట్టి విక్రమార్క

VT15 Title Glimpse: వరణ్ తేజ్ ‘VT15’ గ్లింప్స్ వచ్చేది ఎప్పుడంటే?..

Champion Movie: ‘ఛాంపియన్’ సూపర్ హిట్ సాంగ్ ‘గిర గిర గింగిరాగిరే’ ఫుల్ వీడియో వచ్చేసింది..

Mega Interview: మెగా సంక్రాంతి బ్లాక్ బాస్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ ఫుల్ వీడియో వచ్చేసింది..