Khammam Municipal Elections: మరికొద్ది రోజుల్లో మున్సిపాలిటీ నోటిఫికేషన్ వెలువనున్న నేపథ్యంలో 10 సంవత్సరాలుగా ప్రత్యేక అధికారులు పాలనను కొనసాగిన 12 గ్రామపంచాయతీలు నూతనంగా ఎదులాపురం మున్సిపాలిటీ అవతరించి ఎన్నికలకు ఎదురు చూస్తున్నాయి ఖమ్మం రూరల్ మండలంలో 12 గ్రామపంచాయతీలు నగరానికి శివారులో మున్నేరు వాగు వేరు చేసినట్టుగా 12 గ్రామపంచాయతీలు తో పాటు నూతనంగా ఏర్పడిన కాలనీలతో చిన్న పట్టణంగా విస్తరించాయి ఈ క్రమంలో పది సంవత్సరాల క్రితం అప్పటి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఈ 10 గ్రామపంచాయతీలను ఖమ్మం కార్పొరేషన్ లో విలీనం చేశారు. సాంకేతికంగా గ్రామపంచాయతీలను ఖమ్మం కార్పొరేషన్ లో విలీనం చేసినప్పటికీ ఈ 10 గ్రామపంచాయతీలు పాలేరు నియోజకవర్గంలో ఉండడం కారణంగా అప్పటి స్థానిక ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తన నియోజకవర్గంలో ఉన్న ప్రాంతం ఖమ్మం కార్పొరేషన్ ఉండడం కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితిలో ఎదుర్కొంటున్నారని చెప్పారు.
Also Read: Mahabubabad Police: మహబూబాబాద్‌లో.. డ్రంక్ అండ్ డ్రైవ్ పై స్పెషల్ ఫోకస్..!
10 సంవత్సరాలుగా ప్రత్యేక అధికారి
మళ్లీ ఈ 10 గ్రామపంచాయతీలైన పెద్ద తండా, ఎదులాపురం, ముత్తగూడెం గొల్లగూడెం బారుగూడెం ,గుర్రాలపాడు, మద్దులపల్లి ,తెల్లారిపల్లి ,చిన్న వెంకటగిరి, పాటుగా మరో రెండు గ్రామపంచాయతీలైన పోలేపల్లి పల్లెగూడెం పాక్షికంగా కలుపుతూ ఎదులాపురం మున్సిపాలిటీగా నూతనంగా ఏర్పరిచారు. గత పది సంవత్సరాలుగా ఈ ప్రాంతం ఖమ్మం రూరల్ మండలంలో ఉన్నప్పటికీ ఎన్నికల నిర్వహణ అటు విలీనమైనప్పుడు కార్పొరేషన్ లో జరగక గ్రామపంచాయతీలు ముందు కార్పొరేషన్ ను విలీనమై 10 సంవత్సరాలుగా ప్రత్యేక అధికారి పాలనలో ముందుకు పోతున్నవి. ఈ క్రమంలో ఎదులాపురం మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి ఎన్నికలు సమీపిస్తున్న వేళ 32 వార్లుగా అధికారులు ఈ 10 గ్రామ పంచాయతీలను విభజించారు.
మహిళా ఓటర్లు 23,511 మంది
ఈ మున్సిపాలిటీలో 45,250 ఓటర్లు ఉండగా ఇందులో పురుష ఓటర్లు 21 742 మంది ఉన్నారు అలాగే మహిళా ఓటర్లు 23,511 మంది ఉన్నారు. ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఎదులాపురం మున్సిపాలిటీ అధికారులు పండుగ అనంతరం ఫోటోలతో కూడిన తుది ఓటరు జాబితాను ప్రచురించుటకు సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈ మున్సిపాలిటీ పరిధిలోని సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలను 30 పైగా గుర్తించారు అలాగే 16 పోలింగ్ స్టేషన్లకు అనువైన ప్రాంతాలను గుర్తించారు. నూతనంగా రూపాంతరం చెందిన ఈ 12 గ్రామపంచాయతీలు డాటా సేకరణ అధికారులకు కత్తి మీద సాముగా మారింది. వార్డుల విభజన మొదలుకొని సమస్యాత్మక ప్రాంతాన్ని గుర్తించడం పోలింగ్ స్టేషన్ నిర్వహణ అంతా నూతనంగా కావడంతో కమిషనర్, టౌన్ ప్లానింగ్, అధికారులు పగలనక ఉన్నతాధికారుల సూచనల మేరకు పూర్తిచేసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమే అన్నట్టుగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Municipal Elections: నోటిఫికేషన్ కోసం అధికారుల ఎదురుచూపులు.. మున్సిపాలిటీలలో ఉత్కంఠ

