Collector Rahul Sharma: సరస్వతి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు
Collector Rahul Sharma ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Collector Rahul Sharma: సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి.. అధికారులకు కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలు!

Collector Rahul Sharma మే 21 నుండి జూన్ 1వ తేదీ వరకు మహదేవ్‌పూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి అంత్యపుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ (Collector Rahul Sharma) అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం దేవాలయ ఈఓ కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, దేవాదాయ, ఆర్కిటెక్చర్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖల అధికారులతో జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తో కలిసి సరస్వతి అంత్యపుష్కరాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలి 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గత సంవత్సరం నిర్వహించిన సరస్వతి ఆది పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని, అంత్య పుష్కరాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. గత పుష్కరాలలో ఎదురైన సమస్యలు పునరావృతం కాకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. సరస్వతి అంత్యపుష్కరాల నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. 30.16 కోట్ల నిధులను మంజూరు చేసిందని, ఇందులో రూ. 16 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు అంచనాలు తయారుచేసి ప్రతిపాదనలు పంపించాలని, ఫిబ్రవరి మొదటి వారంలోపే టెండర్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా శాశ్వత పనులు చేపట్టాలని, పుష్కరాల సమయంలో భక్తుల రాకపోకలు, భద్రత, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, విద్యుత్ సరఫరా వంటి అంశాల్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.

Also Read: Collector Rahul Raj: బాల్యవివాహాలపై మెదక్ జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

బాధ్యతాయుతంగా పనిచేయాలి

కాళేశ్వరానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన ఆధ్యాత్మిక వాతావరణం కల్పించడమే లక్ష్యంగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ మాట్లాడుతూ.. సరస్వతి అంత్యపుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ తరపున పటిష్టమైన బందోబస్తు చేస్తామని తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణ, వాహనాల పార్కింగ్, భక్తుల భద్రత వంటి అంశాలపై ముందుగానే ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక రహదారి మార్గాలను పరిశీలిస్తున్నామని, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాహనాల పార్కింగ్ సమస్యలు నివారించేందుకు మల్టీ లెవల్ పార్కింగ్ స్థలాలను గుర్తించామని, ప్రైవేట్ వాహనాల నియంత్రణకు డ్రాప్ గేట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

అత్యంత వైభవంగా నిర్వహించాలి 

రాష్ట్ర ధార్మిక సలహాదారు గోవింద హరి మాట్లాడుతూ.. సరస్వతి అంత్య పుష్కరాలను ఆది పుష్కరాల మాదిరిగానే అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. అంత్యపుష్కరాలపై విస్తృత ప్రచారం చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న దేవాదాయ శాఖ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం క్షేత్రానికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసేలా త్వరలోనే “కాళేశ్వర ఖండం” అనే పుస్తకాన్ని విడుదల చేస్తామని తెలిపారు. పీఠాధిపతులు, హారతి, ఇతర తాత్కాలిక ఏర్పాట్ల కోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. అంత్యపుష్కరాలకు వచ్చే భక్తులకు గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ మాయం సింగ్, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 Also Read: Collector BM Santosh: పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో తేడా రావద్దు: కలెక్టర్ బి.ఎం.సంతోష్

Just In

01

Methuku Anand: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపుతాం : మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్!

CP Sajjanar: ముగ్గురు జర్నలిస్టులను అదుపులోకి తీసుకున్న సిట్.. తప్పు చేయకపోతే భయమెందుకు? : సీపీ సజ్జనార్​!

Anaganaga Oka Raju: హిట్టు కొట్టేశామంటోన్న టీమ్.. సంబరాల్లో రాజు!

Harish Rao: రాజకీయ వికృత క్రీడల్లో ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా? ప్రభుత్వంపై హరీష్ రావు ఫైర్!

Jogipet Municipality: జోగిపేట మున్సిపాలిటీలో చిత్ర విచిత్రాలు.. ఓటరు జాబితాలో మరణించిన వారి పేర్లు!