Collector BM Santosh; గ్రామ పంచాయితీ ఎన్నికలను విజయవంతం చేసేందుకు వివిధ విధులు నిర్వహించే అధికారులు పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్(Collector B. M. Santosh) అన్నారు. మంగళవారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని పదవ బెటాలియన్ లో ఉన్న జడ్పీహెచ్ఎస్ ఆవరణలో గ్రామ పంచాయితీ మూడవ విడత ఎన్నికల సందర్భంగా ఎర్రవల్లి మండలానికి సంబంధించిన పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది తమకు ఇచ్చే పోలింగ్ సామాగ్రిని చెక్ లిస్ట్ లో సరిచూసుకోవాలని, ఏమైనా సామాగ్రి లేకుంటే వెంటనే రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకొస్తే ఇవ్వడం జరుగుతుందన్నారు.
స్పెషల్ కౌంటర్లో బ్యాలెట్ పేపర్స్
ఆయా గ్రామ పంచాయతీలలోని పోలింగ్ స్టేషన్లకు వెళ్లాక ఇబ్బంది పడకుండా పోలింగ్ నిర్వహణకు అవసరమైన ప్రతి ఒక్క వస్తువును ప్రీసైడింగ్ అధికారులు తమ వద్ద ఉంచుకోవాలన్నారు. రిజర్వ్డ్ కౌంటర్లో ఎంతమంది అధికారులు రిపోర్టు చేసారో పరిశీలించి, అవసరమైన గ్రామ పంచాయితీలలో వారు విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. స్పెషల్ కౌంటర్లో బ్యాలెట్ పేపర్స్ తో పాటు పోలింగ్ కు అవసరమైన వివిధ ఫారాలను, కవర్లను, ఇతర సామాగ్రిని పరిశీలించారు. పలు గ్రామ పంచాయతీల ఓటర్ లిస్టును వార్డుల వారీగా పరిశీలించి తగు సూచనలు చేశారు. పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారులు డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో రిపోర్టింగ్ చేశాక రూట్ వారీగా సంబంధిత గ్రామ పంచాయతీలకు పోలింగ్ మెటీరియల్ తో వెళ్లేందుకు జోనల్ అధికారులు సహకరిస్తారన్నారు.
Also Read: Akhanda 2 OTT: ‘అఖండ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా? ఇంత త్వరగానా!
ఏడు గంటలకు పోలింగ్
పోలింగ్ నిర్వహణకు ఇదివరకే శిక్షణ పూర్తి చేసుకున్న ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్, ఇతర పోలింగ్ అధికారులకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలోనే సంబంధిత రిటర్నింగ్ అధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవాలన్నారు. ప్రీసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది సాయంత్రంలోగా తమకు కేటాయించిన ఆయా గ్రామ పంచాయతీల పోలింగ్ కేంద్రాలకు చేరుకొని బుధవారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. పోలింగ్ విధులు నిర్వహించే అధికారులు తమకు కేటాయించిన గ్రామ పంచాయతీలకు వాహనాల్లో తరలి వెళ్లే సమయం నుంచి కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసి తిరిగి రిసెప్షన్ కేంద్రానికి వచ్చేవరకు అవసరమైన పోలీస్ బందోబస్తు నియమించినట్లు చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు నుషిత, నరేష్, ఇతర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Also Read: Mynampally Hanumanth Rao: కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

