GHMC: గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో పౌర, అత్యవసర సేవల నిర్వహణ, అభివృద్దికి సంబంధించి క్రేత్ర స్థాయి కార్యక్రమాలను ముమ్మరం చేయటంతో పాటు ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్న జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్(RV Karnan) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. గ్రేటర్ పరిధిలో సోమవారం నుంచి మొదలైన ఈ వేస్ట్ శానిటేషన్ డ్రైవ్(waste sanitation drive) మొదటి రోజైన సోమవారం మంచి ఫలితాలనివ్వటం, ఒక్క రోజే 47 మెట్రిట్ టన్నుల ఈ వేస్ట్ ను సేకరించటం పట్ల ఈ డ్రైవ్ ను ప్రతి నెల నిర్వహించాలని కమిషనర్ నిర్ణయించినట్లు తెలిసింది. మయ్యాయి. పారిశుద్ధ్యం, రోడ్ సేఫ్టీలతో పాటు ఈ-వేస్ట్ సేకరణ, తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించిన కమిషనర్ నెలలో రెండు రోజుల పాటు ఈ వేస్ట్ డ్రైవ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సోమవారం మొదలైన ఈ వేస్ట్ శానిటేషన్ డ్రైవ్ మంగళవారం ముగిసింది.
ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ
ఈ డ్రైవ్ మొదటి రోజైన సోమవారం ఈ డ్రైవ్ జరుగుతున్న తీరును కమిషనర్ కర్ణన్ నేరుగా పరిశీలించిన సమయంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ వేస్ట్ ను అందించటం పట్ల స్పందనను గమనించిన కమిషనర్ ప్రతి నెల రెండు రోజుల పాటు ఈ వేస్ట్ పై డ్రైవ్ నిర్వహిస్తే ఏడాది, ఏడాదిన్నర లోపు గ్రేటర్ హైదరాబాద్ నగరం ఈ వేస్ట్ ఫ్రీ సిటీగా మారుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. ప్రజలు తమ వద్దనున్న ఈ – వేస్ట్ ను స్వచ్ఛందంగా జీహెచ్ఎంసీ సిబ్బందికి అప్పగించాలని సూచించారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ, శాస్త్రీయంగా నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను సమీక్షించిన కమిషనర్ ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని కూడా ఆదేశించినట్లు తెలిసింది. ఈ వేస్ట్ ను సేకరించేందుకు ఏర్పాటు చేసిన స్పెషల్ కౌంటర్లు, వాహానాలను కూడా మున్ముందు పెంచాలని కూడా ఆయన అధికారులకు సూచించినట్లు తెలిసింది.
Also Read: Seethakka: మేడారం జాతరను కుంభమేళాకు మించి ఘనంగా నిర్వహించాలి.. అధికారులకు సీతక్క కీలక సూచనలు!
ఐటీ సంస్థలపై స్పెషల్ ఫోకస్
గ్రేటర్ హైదరాబాద్ సిటీని ఈ వేస్ట్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీ ఈ వేస్ట్ పై దృష్టి సారించిన సంగతి తెల్సిందే. ప్రతి నెల ఇందుకోసం రెండు రోజుల స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఐటీ(IT) సంస్థలున్న ప్రాంతాలపై స్పెషల్ గా ఫోకస్ పెట్టనున్నట్లు తెలిసింది. సిటీలోని మాదాపూర్(Madhapur), గచ్చిబౌలీ(Gachibowli)లోని ఐటీ సంస్థల్లో చాలా వరకు ఈ వేస్ట్ వ్యర్థాలను సకాలంలో తరలించే అవకాశాలున్నా, కొన్నిసంస్థల్లో ఈ వేస్ట్ పేరుకుపోయే అవకాశమున్నందున, స్థానిక జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది నెలలో రెండు రోజుల పాటు అక్కడి ఈ వేస్ట్‌ను సేకరించి, ప్లాంటుకు తరలించేందుకు ఈ డ్రైవ్ ను వన్ పాయింట్ ప్రొగ్రామ్ గా నిర్వహించనున్నట్లు తెలిసింది. ఇందుకు ఫీల్డ్ స్థాయి సిబ్బందితో పాటు ప్రత్యేక వాహనాలు, ప్రత్యేక కౌంటర్ల ను కూడా పెంచనున్నట్లు సమాచారం. అశాస్త్రీయంగా ఈ-వేస్ట్‌ను పారవేయడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడటమే కాకుండా, ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందనన్న విషయంపై ప్రజల్లో ప్రత్యేకంగా అవగాహన కూడా కల్పించాలని కమిషనర్ సూచించారు. ఈ- వేస్ట్ సేకరణ డ్రైవ్ తొలి రోజైన సోమవారం, చివరి రోజైన మంగళవారం రెండు రోజుల్లో మొదటి రోజున జీహెచ్ఎంసీ పరిధి వ్యాప్తంగా 271 ప్రాంతాలలో డ్రైవ్ నిర్వహించి 94 వాహనాలను వినియోగించి సుమారు 47 మెడ్రిక్ టన్నులను సేకరించగా, రెండోరోజైన మంగళవారం కూడా అదే 286 ప్రాంతాల్లో అదే 94 వాహానాలను వినియోగించి మరో 52 మెట్రిక్ టన్నుల ఈ వేస్ట్ ను సేకరించి ప్రాసెసింగ్ యూనిట్ల కు తరలించినట్లు సమాచారం.
Also Read: Telangana Police: రాష్ట్రంలో కలకలం సృష్టించిన ఆ రెండు కేసులపై సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.?

