Bandi Sanjay: కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయాభివ్రుద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) హామీ ఇచ్చారు. యన హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండకు విచ్చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కు స్థానిక బీజేపీ నేతలు కోలాటాలు, డప్పులతో ఘన స్వాగతం పలికారు. వారితో కలిసి శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకునేందుకు ఆలయం వద్దకు రాగానే టెంపుల్ నిర్వాహకులు, పూజారులు ఘన స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసిన బండి సంజయ్ అనంతరం వీరభద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకృతితో ముడిపడి ఉన్న సంక్రాంతి పండుగను తెలుగు ప్రజలందరూ సంతోషంగా, సంబురంగా జరుపుకుంటారని వివరించారు.
మన సంస్క్రతిని మర్చిపోతున్న ఈ తరుణం
విదేశీ సంస్క్రుతికి అలవాటుపడి మన సంస్క్రతిని మర్చిపోతున్న ఈ తరుణంలో ముగ్గుల పోటీలు, సంక్రాంతి పోటీలు నిర్వహిస్తూ తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను గుర్తు చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. కొత్త కొండ వీరభద్రస్వామి స్వామి బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా రావడం ఆనవాయితీ అని ఆయన వెల్లడించారు. అందులో భాగంగా ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకుని, కోరిన కోర్కెలు తీర్చే కోరమీసాల స్వామి వీరభద్రుడని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. చాలా సందర్భాల్లో తన విషయంలో ఇది నిజమైందని కూడా స్పష్టం చేశారు. కోర మీసాల స్వామి సమాజాన్ని నాశనం చేయాలనుకునేవాళ్లకు, చెడు ఆలోచనలు ఉన్న వాళ్లలో మార్పు తీసుకొచ్చే స్వామి వీరభద్రుడని వ్యాఖ్యానించారు.
Also Read: Bandi Sanjay: ఒవైసీ ఆ దమ్ముందా?.. అక్బరుద్దీన్ ఒవైసీకి బండి సంజయ్ సవాల్..!
అందరూ సుఖసంతోషాలతో ఉండాలి
ఈ జిల్లా, రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నానని తెలిపారు. అందరం కలిసి నరేంద్రమోదీ సంకల్పంతో భారత్ ను విశ్వగురువుగా తీర్చిదిద్దేందుకు వికసిత్ భారత్ పేరిట శక్తివంచన లేకుండా కష్టపడుతున్నామని వెల్లడించారు. ఈ తరుణంలో ప్రతి ఒక్కరూ మోడీకి అండగా నిలవాలని కేంద్ర మంత్రి సంజయ్ కోరారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలకు వస్తుంటారని, ఏటేటా పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుకూలంగా ఆలయాభివ్రుద్ధికి సహకరిస్తూనే ఉంటానని భవిష్యత్తులో దేవాలయ అభివ్రుద్ధికి నా వంతు సహకారాన్ని అందిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
Also Read: Bandi Sanjay: అబద్ధాల పోటీ పెడితే కాంగ్రెస్, బీఆర్ఎస్‌కే అవార్డులు.. బండి సంజయ్ సంచలన కామెంట్స్!

