Bandi Sanjay: అక్బరుద్దీన్‌కి ఒవైసీకి బండి సంజయ్ సవాల్..!
Bandi Sanjay (imagecredit:twitter)
Political News, Telangana News

Bandi Sanjay: ఒవైసీ ఆ దమ్ముందా?.. అక్బరుద్దీన్ ఒవైసీకి బండి సంజయ్ సవాల్..!

Bandi Sanjay: భారతదేశానికి బురఖా ధరించిన మహిళా ప్రధాని కావాలని ఎంఐఎం(MIM) కలలు కంటున్నదని, దమ్ముంటే ఒక మహిళను ఎంఐఎం పార్టీ అధ్యక్షురాలిని చేసే ధైర్యం ఉందా అని కేంద్ర మంత్రి బండి సంజయ్(Minister Bandi Sanjay) సవాల్ చేశారు. మజ్లిస్ ఇప్పటివరకు ఎంతమంది ముస్లిం మహిళలకు ఎమ్మెల్యే(MLA), ఎంపీ(MP) టికెట్లు ఇచ్చిందని ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే పదవుల్లో ఎంతమంది ముస్లిం మహిళలు ఉన్నారని నిలదీశారు. 2018లో పాతబస్తీలో అక్బరుద్దీన్ ఒవైసీ(Akbaruddin Owaisi)పై బీజేపీ షెహజాదీ సయ్యద్‌(Shehzadi Syed)ను పోటీకి నిలిపిందని, అప్పట్లో ఆమెను బెదిరించి ఓడించారన్నారు. ఒవైసీ బ్రదర్స్ అసలు స్వరూపం ఇదేనని బండి సంజయ్ విమర్శించారు. కానీ, ఆమెకు బీజేపీ జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలిగా నియమించిందని, ప్రస్తుతం ఆమె అక్కడే సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.

Also Read: Murder Case: భర్త హత్యను కళ్లారా చూసింది.. ఆ కేసుపై విచారణ జరుగుతుండగా ఊహించని ఘోరం

మహిళలకు ధన్యవాదాలు

బీజేపీకి మైనారిటీ మోర్చా ఉన్నదని, అది మహిళా నాయకులను తీర్చిదిద్దుతున్నదని స్పష్టం చేశారు. ఎంఐఎం వద్ద ఉత్తుత్తి మాటలు తప్ప ఏమీ లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముస్లిం మహిళా కార్యకర్తలు గళమెత్తి మజ్లిస్‌ను ప్రశ్నిస్తే, వారు వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తున్నదని వివరించారు. ఒక జర్నలిస్ట్ ఒవైసీ ఇంటికి వెళ్తే, అక్కడ వడ్డించిన భోజనానికి మహిళలకు ధన్యవాదాలు కూడా చెప్పకూడదని, అది తమ సిస్టమ్‌కు విరుద్ధమని చెప్పారని గుర్తుచేశారు. ముస్లిం మహిళలు ఒవైసీల కపటత్వాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నారని ఎద్దేవా చేశారు. చాలామంది ముస్లిం మహిళలు ప్రధాని మోదీని పెద్దన్నలా భావిస్తున్నారని తెలిపారు. మతం ఏదైనా బీజేపీ మహిళలను సాధికారత వైపు నడిపిస్తుందని, కానీ అసదుద్దీన్ ఒవైసీ మాత్రం బయట సాధికారత గురించి మాట్లాడుతూనే పార్టీలో, ఆఖరికి తన ఇంట్లో కూడా ఆంక్షలు విధిస్తున్నారంటూ బండి సంజయ్ విమర్శించారు.

Also Read: MPTC Elections: సార్ మాకు ఇంకోక అవకాశం ఇవ్వండి.. పీసీసీ చీఫ్‌కు వెల్లువెత్తుతున్న వినతులు..?

Just In

01

Telangana Power: మీ ఇంట్లో కరెంటు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే మీకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..?

Aadi Srinivas: ముందు మీ ఇంట్లో సినిమా గురించి ఆలోచించు.. లేకుంటే నీ కథ క్లైమాక్స్‌కు చేరుతుంది..?

Kesamudram Municipality: కేసముద్రం మున్సిపాలిటీ తొలి ఎన్నికల్లో.. మొట్టమొదటి పట్టం ఎవరికో..?

Bandi Sanjay: ఒవైసీ ఆ దమ్ముందా?.. అక్బరుద్దీన్ ఒవైసీకి బండి సంజయ్ సవాల్..!

Azharuddin: త్రిశంకు స్వర్గంలో అజారుద్దీన్.. రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన అంశం