Gadwal District: భార్య కాపురానికి రావటం లేదని ఆత్మహత్యాయత్నం
Gadwal District ( image credit: twitter)
క్రైమ్, నార్త్ తెలంగాణ

Gadwal District: భార్య కాపురానికి రావటం లేదని.. బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం!

Gadwal District: భార్య కాపురానికి రావటం లేదని మనస్తాపం చెందిన భర్త బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో (Gadwal District) చోటుచేసుకుంది. గద్వాల టౌన్ పోలీస్ స్టేషన్ రెండవ ఎస్సై సతీష్ రెడ్డి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల పట్టణం వడ్డేవీదికి చెందిన రాధ వివాహం రాయచూర్ జిల్లాకు చెందిన వడ్డే రాజుతో అయిదేండ్ల క్రితం జరిగింది.

Also Read: Gadwal District: డేంజర్ బెల్స్.. గద్వాల జిల్లాలో పెరిగిన రోడ్డు ప్రమాదాలు.. ఇవిగో లెక్కలు..?

భార్యభర్తల మధ్య మనస్పర్థలు

వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొంతకాలంగా వడ్డే రాజు మద్యానికి బానిసకవడంతో భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. 6 నెలల కిందట భార్య రాధ భర్తతో గొడవ పడి పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వచ్చింది. మద్యానికి బానిసైన వడ్డే రాజు తరుచు గద్వాలలోని భార్య ఇంటికి వెళ్లి కొట్లాడేవాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం గద్వాలలోని భార్య ఇంటి ముందు వడ్డేరాజు బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడాడు.

కేసు నమోదు చేసి దర్యాప్తు

దాంతో తీవ్ర రక్తస్రావం కాగా స్థానికులు గాయపడిన వడ్డే రాజును గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వడ్డే రాజుకు వైద్యులు చికిత్స అందించారు. ప్రస్తుతం వడ్డేరాజు పరిస్థితి నిలకడగా ఉందని, మెరుగైన వైద్యం కోసం కర్నూల్ కు తరలిస్తున్నట్లు‌ ఆర్ఎంఓ మాలకొండయ్య, డాక్టర్ భావన తెలిపారు. ఈ సంఘటనపై గద్వాల టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Gadwal District: ఆ జిల్లాల్లో 11శాతం తగ్గిన క్రైమ్ రేట్.. సైబర్ నేరాల నియంత్రణపై పోలీస్‌ల ప్రత్యేక దృష్టి!

Just In

01

Nari Nari Naduma Murari: పండుగ ఆఫర్.. ఎంఆర్‌పీ ధరలకే మా సినిమా టికెట్లు!

Director Maruthi: మెగాస్టార్‌తో ఛాన్స్ వస్తే.. నా లైఫ్ సర్కిల్ ఫిల్ అయినట్లే!

Ram Charan: చిరు, పవన్ ఫామ్‌లోకి వచ్చేశారు.. చరణ్ పిక్చర్ అభి బాకీ హై!

Damodar Raja Narasimha: ఉగాది నాటికి టిమ్స్ హాస్పిటల్‌ను ప్రారంభిస్తాం.. మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం!

Bandi Sanjay: కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయాభివ్రుద్ధికి కృషి చేస్తా.. బండి సంజయ్ కుమార్ హామీ!