Shaksgam Valley Dispute: భారత్ (India), చైనా (China) సైనికుల మధ్య 2020లో మే నెలలో లడఖ్‌లోని గాల్వాన్ లోయలో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘర్షణ కారణంగా ఏర్పడిన సైనిక ప్రతిష్ఠంభన సుదీర్ఘకాలం కొనసాగి, ఏడాదిక్రితమే ముగింపు పడింది. ఇప్పుడిప్పుడు ప్రశాంతం వాతావరణం నెలకొంటున్న తరుణంలో భారత్, చైనా మధ్య మరో కొత్త వివాదం రాజుకుంది. జమ్మూ కశ్మీర్‌లోని ‘షాక్స్‌గామ్ వ్యాలీ’ (Shaksgam Valley Dispute) విషయంలో మరో సరిహద్దు వివాదం మొదలైనట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుమారుగా 5 వేల చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం ఉండే షాక్స్‌గామ్ వ్యాలీ ప్రాంతం భారత్‌లో అంతర్భాగంగా ఉంది. అయితే, ఈ వ్యాలీ తమ దేశంలో అంతర్భాగమని చెబుతోంది. 1963లో పాకిస్థాన్ (Pakistan) ఈ ప్రాంతాన్ని తమకు అప్పగించిందని చైనా చెబుతోంది.
నిజానికి 1947 అక్టోబర్‌లో జమ్మూ కశ్మీర్‌ను భారత్ స్వాధీనం చేసుకున్న షాక్స్‌గామ్ వ్యాలీ చట్టబద్ధంగా భారత్ సొంతమైంది. కానీ, పాకిస్థాన్ అక్రమ ఒప్పందం కారణంగా ఈ ప్రాంతం చైనా ఆధీనంలోనే కొనసాగుతూ వస్తోంది. పాక్-చైనా అక్రమ ఒప్పందాన్ని భారత్ వ్యతిరేకిస్తూ వచ్చింది. కానీ, ఎప్పుడు భౌతికంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేయలేదు. అందుకే, సమస్య ఇప్పుడు జఠిలంగా కనిపిస్తోంది.
Read Also- Germany Good News: భారతీయులకు జర్మనీ గుడ్‌న్యూస్.. ఇకపై వీసా లేకుండానే కీలక సర్వీసు
పాక్-చైనా ఒప్పందాన్ని గుర్తించబోం..
షాక్స్‌గామ్ వ్యాలీ భారత భూభాగంలో అంతర్భాగమని, తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని భారత్ ప్రకటించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. 1963లో పాకిస్థాన్ అక్రమంగా చైనాకు అప్పగించిన 5,180 చదరపు కిలోమీటర్ల ఒప్పందాన్ని భారత్ ఎప్పుడూ గుర్తించలేదని, గుర్తించబోమని క్లారిటీ ఇచ్చింది. అయితే, భారత అభ్యంతరాలను చైనా తోసిపుచ్చింది. తమ నిర్మాణ కార్యకలాపాలు నిందలు సరికాదంటూ ప్రకటన విడుదల చేసింది.
భారత్ వాదన ఇదే
1963లో పాకిస్థాన్ అక్రమంగా వ్యవహరించిందని, పాక్-చైనా మధ్య షాక్స్‌గామ్ వ్యాలీ విషయంలో జరిగిన ఒప్పందాన్ని తాము గుర్తించలేదని, గుర్తించబోమని భారత్ వాదిస్తోంది. ఈ లోయ భారత్‌ను రెండు వైపుల నుంచి చుట్టుముట్టే ప్రమాదం ఉంటుందనే భారతదేశం ఆందోళనగా ఉంది. అయితే, ఇవేమీ పట్టించుకోకుండా, లోయ ప్రాంతంలో కీలకమైన మౌలిక సదుపాయాలను చైనా వేగంగా నిర్మించుకుంటోంది. ఈ ప్రాంతం చైనా – పాకిస్తాన్ ఆర్థిక కారిడార్‌లో భాగంగా ఉండడంతో వేగంగా పనులు చేపడుతోంది.
Read Also- 10 Minute Delivery: 10 మినిట్స్ డెలివరీపై రంగంలోకి కేంద్రం.. బ్లింకిట్ కీలక నిర్ణయం
భౌగోళికంగా ఎక్కడ ఉంటుంది?
షాక్స్‌గామ్ వ్యాలీకి భౌగోళికంగా చాలా ప్రాముఖ్యత ఉంది. తూర్పు కారకోరం శ్రేణిలో ఉన్న సియాచిన్ గ్లేసియర్‌కు సమీపంలోనే షాక్స్‌గామ్ వ్యాలీ ఉంటుంది. దీనినే ట్రాన్స్ కారకోరం ట్రాక్ అని కూడా పిలుస్తారు. దీనికి ఉత్తరాన చైనాలోని జింజియాంగ్ ప్రాంతం, దక్షిణ, పశ్చిమ వైపుల పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో సరిహద్దులు ఉంటాయి. భారత్‌కు అత్యంత కీలకమైన స్థానంలో ఉన్న ఈ ప్రాంతంలో అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే రోడ్డును, ఏకంగా 10 మీటర్ల వెడల్పుతో చైనా నిర్మిస్తుండడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే 75 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం పూర్తయినట్టు కథనాలు వెలువడుతున్నాయి.

