Kidnap Case Twitst: ఇద్దరు స్కూల్ పిల్లల కిడ్నాప్.. ఊహించని ట్విస్ట్
Kidnap-Case (Image source X)
క్రైమ్, లేటెస్ట్ న్యూస్

Kidnap Case Twitst: బైక్‌పై వచ్చి ఇద్దరు స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేశాడు.. పారిపోతుండగా ఊహించని ట్విస్ట్

Kidnap Case Twitst: అదొక గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్. లంచ్ బ్రేక్ సమయంలో ఇద్దరు పిల్లలు ఎలా బయటకెళ్లారో ఏమోకానీ, వారిద్దరినీ ఒక వ్యక్తి కిడ్నాప్ చేశాడు. మాయమాటలు చెప్పి బైక్ ఎక్కించుకున్నాడు. ప్లాన్ ప్రకారం, కిడ్నాపర్ వేగంగా బైక్ నడుపుతూ వెళుతుండగా ఊహించని ట్విస్ట్ (Kidnap Case Twitst) జరిగింది. చాలా కంగారుగా బైక్ నడపడంతో రోడ్ యాక్సిడెంట్ జరిగింది. పిల్లల్లిద్దరికీ పెద్దగా గాయాలు కాలేదు. కానీ, కిడ్నాపర్‌కు మాత్రం గట్టిగానే దెబ్బలు తగిలాయి. పిల్లలు తల్లిదండ్రుల వద్దకు చేరగా, కిడ్నాపర్ హాస్పిటల్‌ పాలయ్యాడు. కర్ణాటకలోని ధర్వాడ్‌లో సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన కొద్దిసేపు తీవ్ర ఆందోళన కలిగించింది.

లంచ్ టైమ్‌లో విద్యార్థుల మిస్సింగ్

ధర్వాడ్‌లో ఉన్న ఓ ప్రభుత్వ స్కూల్‌కు చెందిన తన్వీర్ దొడ్మాని, లక్ష్మి కరియప్పనవార్ అనే విద్యార్థులు మూడవ తరగతి చదువుతున్నారు. సోమవారం మధ్యాహ్నం లంచ్ టైమ్‌లో బయటకు వెళ్లారు. తిరిగి స్కూల్లోకి రాకపోవడంతో మిస్సింగ్ అయినట్టుగా గుర్తించారు. దీంతో, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పిల్లలు ఎక్కడి వెళ్లారా? అని సీసీ కెమెరాల ద్వారా ట్రేస్ చేయగా, ఓ వ్యక్తి బైక్‌పై ఎక్కించుకొని తీసుకెళుతున్నట్టుగా గుర్తించారు. కిడ్నాప్‌కు గురైనట్టు అనుమానించారు. బైక్‌పై వేగంగా తీసుకెళుతుండడంతో తల్లిదండ్రులతో పాటు స్థానికులందరూ బాగా టెన్షన్ పడ్డారు. కానీ, ఈ కిడ్నాప్ వ్యవహారంలో నాటకీయ మలుపు ఎదురైంది.

Read Also- Government Hospital: ప్రభుత్వ ఆస్పత్రిలో కమిషనర్ సతీమణి ప్రసవం.. ఆదర్శంగా నిలిచిన దంపతులు

ఉత్తర కన్నడలోని దండేలి ప్రాంతంలో కిడ్నాపర్ బైక్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. అయితే, అనూహ్యంగా ఆ బైక్ రోడ్డు ప్రమాదానికి గురైంది. సమాచారం మేరకు స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని, సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. బైక్‌పై కిడ్నాపర్ పట్టుతప్పి యాక్సిడెంట్ చేసినట్టు గుర్తించారు. నిందిత వ్యక్తిని కరీం మెస్త్రిగా గుర్తించారు. పిల్లల్ని తానే తీసుకొచ్చానని, ఉలావి చెన్నబసవేశ్వర జాతర కోసం తీసుకెళ్తున్నానంటూ పోలీసులకు కిడ్నాపర్ చెప్పాడు. పిల్లలిద్దరినీ భద్రంగా వారి తల్లిదండ్రుల వద్దకు పోలీసులు చేర్చారు. గాయాలపాలైన నిందితుడిని ట్రీట్‌మెంట్ కోసం హాస్పిటల్‌లో చేర్పించారు. ఆ ఘటనపై తదుపరి దర్యాప్తు జరుగుతుందని పోలీసులు వెల్లడించారు.

Read Also- Minister Ponguleti: రాష్ట్రంలో అక్రమార్కుల భరతం పడతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Just In

01

Medaram Jatara 2026: మేడారంలో ఈ నెల 18న తెలంగాణ కేబినెట్‌ భేటీ.. మంత్రి సీతక్క కీలక ప్రకటన

Naveen Polishetty: ‘అనగనగా ఒక రాజు’కి ఆ నమ్మకంతో టికెట్స్ బుక్ చేసుకోండి

Ponguleti Srinivas Reddy: ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి!

Toxic Controversy: వివాదంలో యష్ ‘టాక్సిక్’ గ్లింప్స్.. సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసిన మహిళా కమిషన్..

Ponguleti Srinivas Reddy: ప్రజా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు.. బీఆర్‌ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ఫైర్!