Government Hospital: ఆదర్శంగా నిలిచిన కమిషనర్ దంపతులు
Government Hospital (imagecredit:swetcha)
Telangana News, కరీంనగర్

Government Hospital: ప్రభుత్వ ఆస్పత్రిలో కమిషనర్ సతీమణి ప్రసవం.. ఆదర్శంగా నిలిచిన దంపతులు

Government Hospital: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వాసుపత్రులపై నమ్మకం రోజురోజుకు పెరుగుతున్నది. ఐఏఎస్(IAS) అధికారులు వారి కుటుంబ సభ్యులు సాధారణ ప్రజలు అత్యుత్తమ సేవలను ప్రభుత్వాసుపత్రిలో పొందుతున్నారు. ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో సేవలందించడంతో రోజురోజుకు ప్రభుత్వ ఆస్పత్రి సేవలపై పాజిటివ్ దృక్పథం పెరిగిపోతున్నది. ప్రైవేట్ ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రులకే ప్రాధాన్యమి స్తున్నారు. ఇందుకు విశేషం ఏమిటంటే కరీంనగర్ నగర పాలక సంస్థ కమిషనర్ ఐఏఎస్ అధికారి ప్రఫుల్ దేశాయ్(Praful Desai) సతీమణి ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి మాత శిశు కేంద్రంలో పండంటి పాపకు జన్మనిచ్చింది. మున్సిపల్ కమిషనర్ దంపతులు ఆదర్శంగా నిలిచారు. వారిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి(Collector Pamela Satpathy) ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి వైద్యాధికారులు సిబ్బంది అభినందించారు.

నర్సింగ్ సిబ్బంది సమన్వయం

గర్భవతి అయిన మున్సిపల్ కమిషనర్ సతీమణినీ కమిషనర్ ప్రఫులు దేశాయ్ ఆదివారం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయించారు. ఉమ్మనీరు తగ్గడంతో ప్రభుత్వ ప్రధానాస్పత్రి మాత శిశు కేంద్రంలో చేర్పించారు. సోమవారం గైనకాలజిస్టుల పర్యవేక్షణలో ఆమెకు ఆపరేషన్ చేశారు. అనుభవజ్ఞులైన గైనకాలజిస్ట్లు నిపుణులైన వైద్య బృందం నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో డెలివరీని విజయవంతంగా నిర్వహించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ సతీమణి పండంటి పాపకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. హెచ్ ఓ డి గైనకాలజిస్ట్ డాక్టర్ పద్మజ(Dr. Padmaja) గైనకాలజిస్టులు డాక్టర్ దీప సంగీత సుహాసిని పిల్లల వైద్య నిపుణులు వేణు మల్లికార్జున్ అనస్థీసియా హెచ్ ఓ డి డాక్టర్ శంతన్, సంగీత నర్సింగ్ సూపరిండెంట్ సరిత పద్మశ్రీ రమ వైద్య సేవలు అందించారు.

Also Read: Swetcha Effect: స్వేచ్ఛ కథనానికి అదిరిపోయే రెస్పాన్స్.. పల్లె ప్రకృతి వనంలో మృత్యుపాశాలు తొలగింపు!

ఇది మరో సానుకూల సంకేతం

కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయి మాత్రం గర్భవతి అయిన తన సతీమణినీ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం విశేషం. ఈ పరిణామం తెలంగాణ ప్రభుత్వ వైద్య వ్యవస్థపై ప్రజల్లోనే కాకుండా, ఉన్నతాధికారుల్లోనూ విశ్వాసం పెరుగుతోంది. ప్రభుత్వ వైద్య వ్యవస్థ బలోపేతానికి ఇది మరో సానుకూల సంకేతంగా నిలుస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పై ఉన్న అపోహలు తొలగి సామాన్య ప్రజలు మరింత ధైర్యంగా వైద్య సేవలను వినియోగించుకునే అవకాశం ఉందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మున్సిపల్ కమిషనర్ దంపతులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆస్పత్రి సూపరిండెంట్ వీరారెడ్డి ఆర్ఎంఓ నవీనా వైద్య అధికారులు తదితరులు అభినందనలు తెలిపారు.

Also Read: Godavari River: వృధాగా పోయే నీటిని వాడుకుంటే తప్పేముంది: సీఎం చంద్రబాబు

Just In

01

SBI ATM charges: పెరిగిన ఎస్‌బీఐ ఏటీఎం ఛార్జీలు.. ఎంత పెరిగాయంటే?, పూర్తివివరాలివే

Vegetable Farming: మహబూబాబాద్ జిల్లాలో పెరుగుతున్న కూరగాయల సాగు విస్తీర్ణం.. అధికంగా పండించే పంట ఇదే..?

Samyuktha Menon: బీటెక్ చేయకపోవడం అదృష్టం అంటున్న సంయుక్తా మీనన్.. ఎందుకంటే?

Macha Bollaram: రైల్వే బ్రిడ్జ్ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో రసాభాస.. స్టేజ్‌పైనే ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే వర్గాలమధ్య ఘర్షణ..!

Mahesh Kumar Goud: శ్రీరాముడు బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారా?: టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్