Swetcha Effect: అధికారుల నిద్ర మత్తు వదలాలంటే స్వేచ్ఛ కలం పదును చూపాల్సిందేనని మరోసారి నిరూపితమైంది. హుజూరాబాద్ (Huzurabad) నియోజకవర్గం జూపాక గ్రామ ‘పల్లె ప్రకృతి వనం’లో పొంచి ఉన్న విద్యుత్ మృత్యుపాశాలపై ‘స్వేచ్ఛ వెబ్ న్యూస్ ప్రచురించిన కథనం జిల్లా యంత్రాంగంలో ప్రకంపనలు సృష్టించింది.
యుద్ధ ప్రాతిపదికన క్లీన్ స్వీప్
ప్రకృతి వనంలో ఆహ్లాదం పక్కన పెట్టి, ప్రజలు ప్రాణభయంతో గడుపుతున్నారన్న వాస్తవాన్ని ఆధారాలతో సహా బయటపెట్టడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. వార్త ప్రచురితమైన కొద్ది గంటల్లోనే విద్యుత్ శాఖ, పంచాయతీ సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. మృత్యు కొమ్మల తొలగింపు హైటెన్షన్ వైర్లను చుట్టేసి, ఏ క్షణమైనా ప్రాణాలు తీసేలా ఉన్న చెట్ల కొమ్మలను విద్యుత్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన నరికివేశారు. ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ ప్రక్షాళన అడవిని తలపిస్తూ ప్రమాదకరంగా మారిన ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాల్లోని పిచ్చిమొక్కలను పంచాయతీ సిబ్బంది పూర్తిగా తొలగించారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. అర్బన్ పార్క్ దుప్పుల వేట కేసులో లొంగిపోయిన నిందితుడు
నిర్లక్ష్యంపై ఘాటైన విమర్శలు
ప్రమాదం జరిగి ప్రాణాలు పోయే వరకు ఎదురుచూడటం అధికారులకు అలవాటుగా మారింది. స్వేచ్ఛ’ పత్రిక వేలెత్తి చూపే వరకు కదలని ఈ మొద్దు నిద్ర వ్యవస్థ మారాలి. ఇప్పటికైనా స్పందించడం సంతోషకరం, కానీ ఇలాంటి పనులు నిరంతరం పర్యవేక్షణలో ఉండాలి.”
స్థానిక గ్రామస్తుల ఆగ్రహం
స్వేచ్ఛ’కు కృతజ్ఞతల జల్లే గ్రామస్తుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పెను ప్రమాదాన్ని తప్పించిన స్వేచ్ఛ’ పత్రికకు జూపాక ప్రజలు నీరాజనాలు పట్టారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తమ గొంతుకగా నిలుస్తున్న పత్రికా యాజమాన్యానికి, తక్షణమే స్పందించిన అధికారులకు గ్రామస్తులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Swetcha Effect: స్వేచ్ఛ ఎఫెక్ట్.. అర్బన్ పార్క్ దుప్పుల వేట కేసులో లొంగిపోయిన నిందితుడు

