Transport Department: చక్రం తిప్పుతున్న మినిస్టీరియల్ ఉద్యోగులు
Transport Department (imagecredit:twitter)
Telangana News, హైదరాబాద్

Transport Department: ఖైరతాబాద్‌ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కార్యాలయంలో.. చక్రం తిప్పుతున్న మినిస్టీరియల్ ఉద్యోగులు

Transport Department: రవాణా శాఖలో పాతుకు పోయిన మినిస్టీరియల్ స్టాఫ్
= దశాబ్ద కాలానికి పైగా ఒకే చోట వర్క్
= ఎస్టీఏ కార్యాలయంలోనూ ఇదే తీరు
= రెండేళ్లకోసారి బదిలీ చేయాల్సి ఉన్న తిలోదకాలు
= మ్యూచువల్ పద్ధతిలోనే బదిలీలు?
= ఉన్నతాధికారి చెప్పినా.. పనిచేయని సీనియర్ అసిస్టెంట్?
= చేయి తడిపితేనే కదులుతున్న ఫైల్
రవాణా శాఖలో మినిస్టీరియల్ స్టాఫ్‌కు బదిలీలు లేవు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్‌మెంట్ వరకు ఓకే ఆఫీసులో పనిచేస్తున్నారు. దీంతో వారు ఆడింది ఆట.. పాడిందే పాటగా మారుతుంది. శాఖ మంత్రి చెప్పారని.. ఫైల్ త్వరగా కంప్లీట్ చేయాలని శాఖ ఉన్నతాధికారులు చెప్పినా పక్కకు పెడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి వాళ్లు దశాబ్దాలుగా ఒకే దగ్గర పని పనిచేస్తుండడమే కారణం. వారిని బదిలీ చేస్తే తప్ప రవాణా శాఖలో అవినీతి ఆరోపణలకు చెక్ పడదని ఆ శాఖలోని అధికారులే అభిప్రాయపడుతున్నారు. మరి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా? అనేది చూడాలి.

అవినీతికి అడ్డాగా కార్యాలయాలు

రవాణా శాఖ ప్రభుత్వానికి ఆదాయం వచ్చే శాఖల్లో ఒకటి. అంతేకాదు ప్రజలతో నిత్యం సత్సంబంధాలు కలిగి ఉంటుంది. అయితే ఈ శాఖలో పనిచేసే మినిస్టీరియల్ సిబ్బంది (ఏవో, జూనియర్ అసిస్టెంట్, కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్లు) కార్యాలయాల్లో పాతుకు పోయారు. దశాబ్దాల తరబడి ఓకే దగ్గర పనిచేస్తున్నారు. దీంతో అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆ కార్యాలయంలో వారికి పూర్తి అవగాహన ఉండడం.. పై అధికారులు వచ్చిన వారు తక్కువ కాలంలోనే మళ్లీ బదిలీ అవుతుండడం.. మీరు మాత్రం అక్కడే తిష్ట వేయడం అవినీతికి అడ్డగా కార్యాలయాలు మారాయని ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు బీరు అధికారులను సైతం శాసిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

రెండేళ్లకోసారి బదిలీ చేయాలి

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రవాణా శాఖలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మినిస్టీరియల్ సిబ్బందిని బదిలీ చేయాల్సి ఉంది. కానీ, దశాబ్దాలు గడిచిన బదిలీ చేయడం లేదు. దీంతో ఏవోలు, జూనియర్ అసిస్టెంట్‌లు, కానిస్టేబుళ్లు సైతం ఓకే కార్యాలయంలో పని చేస్తుండడం.. కొంతమంది ఏజెంట్లకు దగ్గర కార్యకలాపాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు ప్రతి ఫైల్‌కు చెయ్యి తడిపితేనే ముందుకు కదులుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వారిని బదిలీ చేస్తారా అనేది చూడాలి.

Also Read: Azharuddin: త్రిశంకు స్వర్గంలో అజారుద్దీన్.. రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన అంశం

మ్యూచువల్ బదిలీలే..

ప్రస్తుతం శాఖలో మ్యూచువల్ బదిలీలే జరుగుతున్నట్లు సమాచారం. మినిస్టీరియల్ సిబ్బంది వారికి అవసరం మేరకు బదిలీలు చేయించుకుంటున్నట్లు సమాచారం. అంతేగాని శాఖ పరంగా దశాబ్దాలుగా బదిలీలు లేవని ఆ శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉన్నతాధికారులు ఏదైనా కార్యాలయానికి బదిలీపై వెళ్లిన ఈ మినిస్టీరియల్ ఉద్యోగులే చక్రం తిప్పుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

ఎస్టీఏ కార్యాలయంలో రివర్స్

ఖైరతాబాద్‌లోని స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కార్యాలయంలో మినిస్టీరియల్ ఉద్యోగులే చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పరిపాలన అంతా కేంద్రం ఈ కార్యాలయంలో మినిస్టీరియల్ ఉద్యోగులకు బదిలీలు లేవని సమాచారం. దీంతో సీనియర్ అసిస్టెంట్‌కు వాహన రిజిస్ట్రేషన్ సంబంధించి ఓ ఫైల్ వెళ్లింది. ఆ ఫైల్ శాఖ మంత్రి చెప్పారని, దానిని త్వరగా చేయాలని ఓ ఉన్నత అధికారి చెప్పిన చేయలేదని సమాచారం. అంటే ఆ ఉద్యోగి దీర్ఘకాలంగా ఒకే దగ్గర పని చేయడమే కారణమని స్పష్టమవుతుంది. పై స్థాయి అధికారులు చెప్పిన వినడం లేదంటే రవాణా శాఖ కార్యాలయంలో ఏ మేరకు మినిస్టీరియల్ సిబ్బంది తిష్ట వేశారనేది స్పష్టమవుతుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇప్పటికైనా ప్రభుత్వం ఏళ్ల తరబడి ఒకే దగ్గర పని చేస్తున్న సిబ్బందిని బదిలీలు చేస్తారా లేదా అనేది చూడాలి.

Also Read: Huzurabad: ఆ జిల్లా కార్మిక శాఖలో ప్రైవేట్ రాజ్యం.. ప్రభుత్వ కార్యాలయమా? లేక ప్రైవేట్ వ్యక్తుల దందా కేంద్రమా?

Just In

01

Kite Festival: నేడు పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్.. నోరూరించే మిఠాయిలతో పాటు..!

DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ సంక్రాంతి కానుక.. 3.64 డీఏ శాతం పెంపు

Water Sharing Issue: ఏళ్లపాటు ప్రాజెక్టుపై కొనసాగుతున్న విచారణలు.. ఇప్పుడు ఏం చేద్దాం..?

Minister Ponguleti: రాష్ట్రంలో అక్రమార్కుల భరతం పడతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Transport Department: ఖైరతాబాద్‌ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ కార్యాలయంలో.. చక్రం తిప్పుతున్న మినిస్టీరియల్ ఉద్యోగులు