Azharuddin: రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన అజారుద్దీన్ అంశం
Azharuddin (imagecredit:twitter)
Political News, Telangana News

Azharuddin: త్రిశంకు స్వర్గంలో అజారుద్దీన్.. రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన అంశం

Azharuddin: అజారుద్దీన్ పరిస్థితి త్రిశంకు స్వర్గంలా మారిందని రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీ ఈయనను మంత్రిని చేసింది. గవర్నర్ కోటాలో ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఆరు నెలల్లో ఎమ్మెల్సీగా అధికారికంగా ఎన్నిక కావాల్సి ఉండగా, గవర్నర్ కోటా నుంచి ఎంపిక ఫైనల్ అవుతుందా? లేదా ఖాళీగా ఉన్న నిజామాబాద్ స్థానిక సంస్థల నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆరు నెలల్లోగా..

జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఎలాగైనా దగ్గించుకోవాలని ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ పార్టీ అనేక వ్యూహాలు రచించింది. విజయమే లక్ష్యంగా ముందుకు సాగింది. నియోజకవర్గంలో మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండడంతో అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చింది. మైనార్టీ కోటాలో ఇస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 30న ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నిబంధనల ప్రకారం అజారుద్దీన్ ఆరు నెలల్లోగా ఎమ్మెల్సీగా నియామకం కావాలి. ఏప్రిల్ 30తో ఆ గడువు ముగుస్తుంది.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పెండింగ్

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నది. దాంతో గతంలో కాంగ్రెస్ ఎంపిక చేసిన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకం ఆగిపోయింది. గవర్నర్ పచ్చజెండా ఊపినా బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇద్దరి నియామకాన్ని సవాల్ చేయడంతో విచారణ జరుగుతున్నది. తీర్పు ఎప్పుడు వస్తుందో అనేది క్లారిటీ లేదు. అయితే, అజారుద్దీన్‌ను గవర్నర్ కోటాలోనే ఎంపిక చేస్తున్నట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ, సుప్రీంకోర్టులో తీర్పు పెండింగ్ ఉండడంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొన్నది. అయితే, కాంగ్రెస్ పార్టీ స్పోర్ట్స్ కోటాలో అజారుద్దీన్ ఎంపిక అవుతారని ధీమా వ్యక్తం చేస్తున్నది.

Also Read: Akhanda 2: ‘అఖండ 2’కు చినజీయర్ స్వామి ప్రశంసలు.. ధర్మాన్ని రక్షించే సినిమా

కవిత స్థానంపై గురి.. కానీ..

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత ఈ మధ్యే రాజీనామా చేయగా, మండలి చైర్మన్ అందుకు అంగీకరించారు. దీంతో ఆ స్థానం ఖాళీ అయింది. ఈమె 2021 ఎన్నికల్లో విజయం సాధించారు. అజారుద్దీన్ కోసమే కవిత రాజీనామా చేశారని సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ప్రచారం చేస్తున్నది. అయితే, ఈ స్థానం నుంచి పోటీ చేయాలంటే స్థానిక ఎన్నికలు జరగాలి. ఈ ఎమ్మెల్సీ పరిధిలో 832 మంది ఓటర్లు ఉన్నారు. ప్రభుత్వం త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. నిజామాబాద్ కార్పొరేషన్‌లో 67 మంది ఓటర్లు ఉంటారు. భీంగల్, బోధన్, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి, కామారెడ్డి, ఆర్మూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒక కార్పొరేషన్, ఏడు మున్సిపాలిటీలు కలిసి మొత్తం 215 మంది కౌన్సిలర్లు, కార్పొరేటర్లే ఉన్నారు. మొత్తం ఓటర్లలో సగం మంది కూడా ఉండరు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై క్లారిటీ లేదు. దీంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఎప్పుడు నిర్వహిస్తారో అనే సస్పెన్స్ నెలకొన్నది.

గతంలో నందమూరి హరికృష్ణ?

1995లో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ఏర్పడి అధికార మార్పిడి జరిగినప్పుడు తండ్రి ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా చంద్రబాబును సమర్థించి హరికృష్ణ క్రియాశీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో హరికృష్ణ మంత్రి పదవి చేపట్టారు. రవాణా శాఖ కూడా కేటాయించారు. కానీ, ఆరు నెలల్లో ఎక్కడా శాసనసభకు పోటీ చేయకపోవడంతో ఆ పదవి వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అజారుద్దీన్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో మంత్రి పదవి దక్కగా ఏప్రిల్ 30తో గడువు ముగుస్తున్నది. మరో మూడు నెలలు మాత్రమే మిగిలి ఉన్నది. ఈ లోపు ఏదో ఒక స్థానం నుంచి ఎన్నిక కావాల్సి ఉంటుంది. లేకుంటే హరికృష్ణ లాగే మంత్రి పదవి కోల్పోవాల్సి వస్తుంది.

Also Read: Masood Azhar: వేలాది సూసైడ్ బాంబర్లు రెడీ.. ఉగ్ర సంస్థ జైషే చీఫ్ మసూద్ సంచలన ఆడియో లీక్!

Just In

01

Telangana Power: మీ ఇంట్లో కరెంటు సమస్యతో బాధపడుతున్నారా.. అయితే మీకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..?

Aadi Srinivas: ముందు మీ ఇంట్లో సినిమా గురించి ఆలోచించు.. లేకుంటే నీ కథ క్లైమాక్స్‌కు చేరుతుంది..?

Kesamudram Municipality: కేసముద్రం మున్సిపాలిటీ తొలి ఎన్నికల్లో.. మొట్టమొదటి పట్టం ఎవరికో..?

Bandi Sanjay: ఒవైసీ ఆ దమ్ముందా?.. అక్బరుద్దీన్ ఒవైసీకి బండి సంజయ్ సవాల్..!

Azharuddin: త్రిశంకు స్వర్గంలో అజారుద్దీన్.. రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారిన అంశం