Venezuela - Trump: వెనిజువెలా అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ ప్రకటన
Donald-Trump (Image source Twitter)
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

Venezuela – Trump: వెనిజువెలా అధ్యక్షుడిని నేనే.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!

Venezuela – Trump: తమ దేశంలోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ అక్రమ రవాణా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారంటూ వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను యూఎస్ ప్రత్యేక బలగాలు ఇటీవల అరెస్ట్ చేసి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. వెనిజువెలాకు తదుపరి అధ్యక్షుడు ఎవరనే దానిపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో, యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచలనానికి తెరదీశారు. వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షుడిని తానేనంటూ (Venezuela – Trump) ప్రకటించుకున్నారు. జనవరి 2026 నాటికి పదవిలో ఉన్న వ్యక్తిని తానేనని పేర్కొంటూ ‘ట్రూత్ సోషల్’లో ఆయన పోస్ట్ పెట్టారు. ఒక ఆసక్తికరమైన ఫొటోని కూడా ఆయన జోడించారు.

ఎడిట్ చేసిన వికీపీడియా పేజీని పోలిన ఫొటోని షేర్ చేశారు. అమెరికాకు 45వ, 47వ అధ్యక్షుడిగా, ప్రస్తుతం పదవిలో ఉన్నట్టుగా పేర్కొన్నారు. ఈ పోస్ట్ చర్చకు దారితీసింది. అయితే, అసలైన వికీపీడియా పేజీలో మాత్రం వెనిజువెలా తాత్కాలిక అధ్యక్షుడిగా ట్రంప్ పేరు కనబడలేదు. ట్రంప్ చెబుతున్నట్టుగా ఏ అంతర్జాతీయ సంస్థ కూడా గుర్తించినట్టుగా లేదు. దీంతో, ట్రంప్ ఈ పోస్టు ఎందుకు పెట్టారన్నది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

వెనిజువెలా తాత్కాలిక ప్రెసిడెంట్‌కి ట్రంప్ హెచ్చరిక

మదురో స్థానంలో డెల్సీ రోడ్రిగ్జ్ తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయినప్పటికీ తాను తాత్కాలిక అధ్యక్షుడినంటూ ట్రంప్ ప్రకటించడం వెనుక ఉద్దేశం ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా ప్రకటనలు, వాదనలను డెల్సీ రోడ్రిగ్జ్ తీవ్రంగా ఖండిస్తున్నారు. అంతేకాదు, మదురోను రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. వెనిజువెలాకు తగిన నాయకుడకు మదురో అని మీడియా ముఖంగా ప్రకటించారు. అయితే, రివర్స్‌లో డెల్సీ రోడ్రిగ్జ్‌ను కూడా ట్రంప్ బెదిరిస్తున్నారు. అమెరికాకు సహకరించకపోతే ఆమె భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చారు. నార్కోటెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్ వంటి ఆరోపణలు ఎదుర్కోంటూ అమెరికాలో బందీగా ఉన్న మదురో కంటే మరింత తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది.

Read Also- Private Hospitals: నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులు.. పర్మిషన్ ఒక చోట.. నిర్వహణ మరో చోట..!

కాగా, వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య ఇద్దరూ డ్రగ్ అక్రమ రవాణా ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. దీంతో, వీరిద్దరినీ అమెరికా ప్రత్యేక బలగాలు అరెస్ట్ చేసి న్యూయార్క్‌కు తరలించాయి. అప్పటికే కొన్ని నెలలుగా హెచ్చరిస్తూ వచ్చిన అమెరికా అనూహ్య రీతిలో సైనిక ఆపరేషన్ చేపట్టి సంచలనం రేపింది. అమెరికా చర్యను భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. చైనా, రష్యా, కొలంబియా, స్పెయిన్‌తో పాటు మరికొన్ని దేశాలు కూడా మండిపడ్డాయి. ఈ అరెస్ట్ జరిగిన కొన్ని గంటల్లోనే వెనిజువెలాను తాత్కాలికంగా అమెరికా నడుపుతుందని ట్రంప్ ప్రెస్‌మీట్‌లో ప్రకటించారు. వెనిజువెలా చమురును అంతర్జాతీయ మార్కెట్లకు తరలించే విషయాలను తాము తీసుకుంటామని, తామే విక్రయిస్తామని పేర్కొన్నారు.

కాగా, వెనిజువెలాలో ఉన్న చమురు ఉత్పత్తి చేసి పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలన్నది అమెరికా లక్ష్యంగా కనిపిస్తోందని అంతర్జాతీయ రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అక్కడ చమురు ఉత్పత్తి, నిర్వహణ కోసం ఏకంగా 100 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాలని ట్రంప్ భావిస్తున్నారని, ఈ మేరకు ప్రధాన చమురు సంస్థలను కూడా ఆయన కోరినట్టుగా కథనాలు వెలువడుతున్నాయి.

Read Also- Bandi Sanjay: ఒవైసీ ఆ దమ్ముందా?.. అక్బరుద్దీన్ ఒవైసీకి బండి సంజయ్ సవాల్..!

Just In

01

KTR fires on BRS: జిల్లాల పునర్విభజనపై మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

BRS Protest: ఘనపూర్ ప్రాజక్టుకుసాగు నీటిని వదలాలి.. మెదక్ కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ నేతల ధర్నా!

Miracle: సునీల్ ప్లేస్‌లో ఆ హీరో.. కారణమేంటంటే?

Bangladesh-ICC: వరల్డ్ కప్ వేదికలు మార్చాలంటున్న బంగ్లాదేశ్‌కు షాకివ్వబోతున్న ఐసీసీ!

Manchu Manoj: రాకింగ్ స్టార్ ప్రారంభించిన సంక్రాంతి పండుగ సంబ‌రాల క్యాంపెయిన్‌ వివరాలివే..