Palwancha Municipality: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మునిసిపాలిటీలో ఈసారైనా పోరు జరుగుతుందా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 1987 సంవత్సరం నుంచి 2000 సంవత్సరం వరకు రెండు పర్యాయాలు మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత నుంచి ఏజెన్సీ, నాన్ ఏజెన్సీ పేరుతో ఎన్నికలకు అభ్యంతరాలు, అవంతరాలు ఎదురయ్యాయి. ఈ కారణంగా 25 ఏళ్లుగా పాల్వంచ మునిసిపాలిటీ(Palvancha Municipality)లో మునిసిపల్ ఎన్నికలు జరగకుండా ఆగిపోయాయి. పారిశ్రామిక కేంద్రంగా వెలువడుతున్న పాల్వంచ పట్టణానికి ఎన్నికల గండం ఈసారైనా తప్పుతుందా..? అని అక్కడి ప్రజలు విస్తృతంగా చర్చించుకుంటున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పర్యాయాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పర్యాయాలు జరిగిన మున్సిపల్ ఎన్నికలు గత 25 ఏళ్లుగా తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు ఇప్పటివరకు జరగలేదు. అభివృద్ధి పూర్తిస్థాయిలో జరగాలంటే పాల్వంచ మునిసిపాలిటీ ఎన్నికలు నిర్వహించాలని అక్కడి రాజకీయ నాయకులు, ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పాల్వంచ మునిసిపాలిటీ ఎన్నికల నిర్వహణపై స్వేచ్ఛ ప్రత్యేక కథనం
దశాబ్దాలుగా కోర్టు కేసులు
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కొత్తగూడెం జిల్లా(Kothagudem district) ఏర్పడడంతోపాటు మునిసిపల్ కార్పొరేషన్‌గా అప్ గ్రేడ్ అయ్యింది. గతంలో కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీలో సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను విలీనం చేసి 60 డివిజన్లతో ప్రభుత్వం కార్పొరేషన్ను ఏర్పాటు చేసింది. దీంతో గతంలో ఉన్న వార్డుల భౌగోళిక స్వరూపం పూర్తిగా మారిపోయింది. దశాబ్దాలుగా కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగని పాల్వంచ ప్రాంతం ఇప్పుడు కార్పోరేషన్ లో భాగం కావడంతో అక్కడి రాజకీయ సమీకరణాలు ఆసక్తిగా మారాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో త్వరలో జరగనున్న మునిసిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలపై ఆశావహుల్లో తీవ్ర టెన్షన్ ఏర్పడింది. పంచాయతీ ఎన్నికలు ముగిసిన వెంటనే మునిసిపల్ పోరు పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
Also Read: AI Voice Clone Scam: ఏఐ వాడుకొని కజిన్ వాయిస్ క్లోన్ చేసి.. కేటగాళ్లు చేసిన లేటెస్ట్ స్కామ్ ఇదే!
సరైన వసతులు లేని బస్టాండ్..
రాజకీయ పార్టీలు, రిజర్వేషన్లు, పొత్తుల లెక్కల్లో మునిగిపోయాయి. ముఖ్యంగా పాల్వంచ భవిష్యత్తు రాజకీయాలు ఎటువైపు దారితీస్తాయోననే ఆసక్తి సర్వత్ర నెలకొంది. కొత్తగూడెం నియోజకవర్గం పారిశ్రామిక అభివృద్ధిలో అత్యధిక పాత్ర పాల్వంచదే. ఇక్కడ లక్షకు పైగా జనాభా ఉండగా, 61 వేల 774 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో జరిగే ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ఓటు భాగస్వామ్యం పాల్వంచ నుంచి నమోదవుతూ వస్తోంది. కానీ 25 ఏళ్లుగా స్థానిక పాలనకు నోచుకోని ధైన్య పరిస్థితి ఇక్కడ నెలకొంది. జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిగా పర్యవేక్షణలో ఉంటూ మునిసిపల్ కమిషనర్ ఏలుబడిలో పరిపాలన కొనసాగింది. పాల్వంచ పట్టణంలో సరైన వసతులు లేని బస్టాండ్ సైతం ఉంది. అయితే కొత్త బస్టాండ్ కట్టాలని ప్రతిపాదనలు పెట్టిన అది కార్యరూపం దాల్చిన పరిస్థితి ఏర్పడలేదు. పాల్వంచకు అతి సమీపంలోనే కిన్నెరసాని జలాశయం ఉన్న ఎండాకాలం వస్తే పాల్వంచ పట్టణ వాసులకు తాగునీటి ఇబ్బంది ఏర్పడే పరిస్థితిలో దాపురించాయి. అంతేకాకుండా అంతర్గత రోడ్లు డ్రైనేజీల సమస్యల పరిష్కారం కోసం పలు దఫాలుగా ప్రజలు అధికారుల వద్దకు వెళ్లి మొరపెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
మళ్ళీ ఎన్నికల ఆశలు
తాజాగా 2025 మే 30న రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెం నగరపాలకంలో విలీనం చేసింది. దీంతో సుదీర్ఘకాలం నాటి ఎన్నికల నిరీక్షణకు స్థిరపడింది. ప్రస్తుతం కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికలపై జోరుగా చర్చ సాగుతోంది. పాల్వంచన పట్టణాన్ని 47 వార్డులను 27 డివిజన్లుగా మార్పు చేశారు. ఇప్పటికే పాల్వంచ పట్టణాన్ని 24 వార్డులను 27 డివిజన్లుగా విభజించారు. ప్రస్తుతం బల్దియాకుకు మళ్ళీ ఎన్నికల ఆశలు చిగురిస్తున్నాయి. ప్రస్తుతం ఓటర్ల జాబితా మార్పులు చేర్పులు తప్పులను సవరించడానికి అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతోంది. ఆయా అంశాలను పరిగణలోకి తీసుకొని ఓటర్ల జాబితా వెల్లడించడానికి సంబంధిత అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఆయా అంశాలను పరిగణలోకి తీసుకొని ఓటర్ల జాబితా వెల్లడించడానికి సంబంధిత అధికారులు విస్తృతస్థాయిలో పనిచేస్తున్నారు. కార్పొరేషన్ ఎన్నికల హడావుడి నేపథ్యంలో స్థానిక రాజకీయ నాయకులు, పోటీదారులు తమ డివిజన్లలో పాగా వేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
Also Read: Medaram Jatara 2026: మేడారం జాతరపై ఆరోగ్య శాఖ స్పెషల్ ఫోకస్.. 30 మెడికల్ క్యాంపుల ఎర్పాటుతో పాటు..?

