TG Health Department: ఆరోగ్య శాఖకు రూ.20 వేల కోట్లు?
TG Health Department (image credit: swetcha reporter)
Telangana News

TG Health Department: ఆరోగ్య శాఖకు రూ.20 వేల కోట్లు? బడ్జెట్ ప్రపోజల్ సిద్ధం చేస్తున్న అధికారులు!

TG Health Department: బడ్జెట్ కంటే సుమారు రూ.8 వేల కోట్లు అదనంగా ఇవ్వాలని ప్రతిపాదనలు రెడీ అవుతున్నాయి. సెక్రటేరియట్‌లోని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వైద్య శాఖలోని వివిధ విభాగాల హెచ్‌వోడీలు బడ్జెట్ ప్రిపరేషన్‌లో బిజీ అయ్యారు. కొత్త దవాఖానాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెడిసిన్స్‌కు అత్యధిక ప్రయారిటీ ఇస్తూ బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు సైతం భారీగానే నిధులు ప్రతిపాదించనున్నారు. గత ప్రభుత్వంలో పూర్తి కాని దవాఖానాలు, మెడికల్ కాలేజీలు, నర్సింగ్ కాలేజీలతో పాటు టిమ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ట్రామా, క్యాన్సర్ కేర్ సెంటర్లకు ప్రాధాన్యతా క్రమంలో కేటాయించాలని రాష్ట్ర ఫైనాన్స్ శాఖకు ప్రతిపాదనలు వెళ్లనున్నాయి. ఇక, ఆరోగ్య శ్రీ బిల్లులు, జూనియర్, సీనియర్ డాక్టర్ల స్టైఫండ్, నేషనల్ హెల్త్ మిషన్‌లోని ఎంఎల్‌హెచ్‌పీ, ఇతర కేడర్‌లలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రతి నెలా పక్కాగా జీతాలు ఇచ్చేందుకు గ్రీన్ ఛానల్‌లో భాగంగా అత్యధిక నిధులు ఇవ్వాలని వైద్య శాఖ ప్రభుత్వాన్ని

కీలక విభాగాలకు ఇలా.. ఫైనాన్స్‌లో ఫైనల్ నిర్ణయం

డైరెక్టర్ ఆఫ్​ మెడికల్ ఎడ్యుకేషన్‌కు దాదాపు రూ.9 వేల కోట్లు, కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో అడ్మినిస్ట్రేషన్, స్కీమ్స్ కొరకు సుమారు రూ.4 వేల కోట్లతో ప్రపోజల్ సిద్ధం అవుతున్నది. సెక్రటేరియట్‌లోని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ రూ.3 వేల కోట్లకు పైగా, పబ్లిక్ హెల్త్ అండ్ వెల్ఫేర్‌కు సుమారు రూ.3 వేల కోట్లు, ఆయుష్​‌కు రూ.600 కోట్లు, ఐపీఎంకు రూ.60 కోట్లతో ప్రపోజల్ రెడీ అవుతున్నట్లు తెలిసింది. అయితే, ఆరోగ్యశాఖ ఇచ్చిన ప్రపోజల్‌ను ఫైనాన్స్ శాఖ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత బడ్జెట్‌ను ఫైనల్ చేయనున్నది. గతంతో పోల్చితే ఈ సారి వైద్యారోగ్య శాఖకు భారీగానే బడ్జెట్ వస్తుందనే ఆశతో అధికారులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యం, విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు ఓ ఆఫీసర్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో వైద్యారోగ్య శాఖకు సుమారు రూ.18 వేల కోట్లతో బడ్జెట్ ప్రపోజల్ పెట్టగా, రాష్ట్ర బడ్జెట్‌లో రూ.12,393 కోట్లు కేటాయించారు. ఈ దఫా మరింత ఎక్కువగా నిధులు వస్తాయని అధికారులు ధీమాతో ఉన్నారు.

Also Read: Health Department: మెడికల్ కార్పొరేషన్ లో ఆగని కమిషన్ల పర్వం.. ఆ ఆఫీసర్ చెప్పిందే వేదం!

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఫోకస్.. పాత ప్రాజెక్టుల పూర్తి

గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన మెడికల్ కాలేజీల నిర్మాణాలు, మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, నియోజకవర్గానికి ఓ నర్సింగ్ కాలేజీ, వంద పడకల ఆసుపత్రులకు అప్‌గ్రేడ్, పాత ఆస్పత్రుల అభివృద్ధికి నిధుల ప్రతిపాదనలు భారీగా పొందుపరుస్తున్నారు. వైద్యారోగ్య శాఖను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అన్ని ఆస్పత్రుల్లో స్టాఫ్​, ఇన్‌ఫ్రా‌స్ట్రక్చర్‌ను పెంచాలని ప్లాన్ చేస్తున్నది. పేషెంట్ల లోడ్‌కు అవసరమైన సిబ్బందిని నియమించడమే కాకుండా, చికిత్స వేగంగా పూర్తయ్యేందుకు అన్ని రకాల పరికరాలు, సౌకర్యాలను సమకూర్చాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. 85 శాతం పేషెంట్లను హైదరాబాద్‌కు రాకుండా జిల్లాల్లోనే మెరుగైన వైద్యం అందేలా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చూస్తున్నది.

రాష్ట్రానికి నాలుగు వైపులా ఉన్న హైవేలపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామాకేర్ సెంటర్‌ను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దీంతో పాటు పేషెంట్లను గోల్డెన్ అవర్‌లో చికిత్సను అందించేందుకు కొత్త అంబులెన్స్‌లను కొనుగోలు చేయనున్నది. అందుకే గ్రామీణ ప్రాంతంలో పని చేసే డాక్టర్ల అలవెన్స్‌లు, డయాలసిస్‌ సెంటర్లు పెంపు, నార్త్, సౌత్ తెలంగాణ లోని కీలకమైన జిల్లాల్, ఆరోగ్య మహిళ కార్యక్రమం, ఎంసీహెచ్‌ సర్వీసెస్‌ మెరుగుపరచడం, కో క్లియర్‌ ఇంప్లాంట్‌ సెంటర్లు, డ్రగ్‌ డీ అడిక్షన్‌ సెంటర్లు, టిమ్స్, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో పరికరాలు, కొత్త ఉస్మానియాకు పరికరాలు, ఆరోగ్య కార్డులు, పీఎంయూలు, క్యాన్సర్‌ కేర్‌ సెంటర్ల, ఇంటిగ్రేటెడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్స్, డయాగ్నస్టిక్‌ సర్వీసెస్‌ పెంపు, ఆర్గాన్‌ రిటీవ్రవల్‌ అండ్‌ స్టోరేజ్‌ సెంటర్లు (బర్ల్‌ సెంటర్, స్కిన్, కార్నియా బ్యాంక్‌లతో కలిపి), ఏర్పాటుకు అనుగుణంగా బడ్జెట్‌ను అధికారులు ప్రతిపాదిస్తున్నారు.

Also Read:TG Endowments Department: ఎండోమెంట్ శాఖలో అధికారుల కొరత.. 69 ఈవో పోస్టులు ఖాళీ

Just In

01

Jana Sena: జనసేన ఊహించని నిర్ణయం.. తెలంగాణ మునిసిపల్ ఎన్నికల్లో పోటీకి సై

Ponguleti Srinivas Reddy: జర్నలిస్టులకు గుడ్ న్యూస్.. గతం కంటే ఎక్కువ అక్రిడిటేషన్ కార్డులు

Cyber Fraud: రిటైర్డ్ ఐపీఎస్​ భార్యకు సైబర్ మోసగాళ్ల టోకరా.. ఎంత పని చేశార్రా!

Heavy Traffic: హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై వాహనాల రద్దీ.. డ్రోన్ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షణ

Romeo Juliet Rule: రోమియో జూలియెట్ రూల్.. ‘పోక్సో’ దుర్వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన