US Airstrikes: సిరియాలో ఐసిస్ స్థావరాలపై అమెరికా దాడులు
ISIS (Image source X)
అంతర్జాతీయం, లేటెస్ట్ న్యూస్

US Airstrikes: సిరియాలో ఐసిస్ ఉగ్రసంస్థపై అమెరికా మెరుపుదాడులు

US Airstrikes: అగ్రరాజ్యం అమెరికా మరో దూకుడు చర్యకు దిగింది. గత నెలలో సిరియాలో అమెరికా పౌరులే లక్ష్యంగా ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) జరిపిన దాడిలో తమ ఇద్దరు సైనికులు, ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి ఘటనకు ప్రతీకారంగా యూఎస్ బలగాలు శనివారం పొద్దుపోయాక రెండో దఫా ప్రతీకార దాడులకు దిగాయి. ఐసిస్ లక్ష్యంగా యుద్ధ విమానాల నుంచి బాంబులు జారవిడిచారు. భాగస్వామ్య బలగాలతో కలిసి రాత్రి 12.30 గంటల సమయంలో ఈ దాడులు జరిపినట్టుగా యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. సిరియాలో ఇస్లామిక్ స్టేట్‌కు సంబంధించిన పలు స్థావరాలను టార్గెట్ చేసుకొని ఈ దాడులు జరిపినట్టుగా వివరించింది.

తమ దేశానికి చెందిన సైనికులకు హాని కలిగిస్తే, ఈ ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా వెతికి పట్టుకొని చంపేస్తామని యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ సందర్భంగా హెచ్చరించింది. ఎంత కష్టమైనా సరే, ఎంత రిస్క్ అయినా సరే వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చింది. అమెరికన్లకు హాని జరిగితే ఎలా ఉంటుందనే తమ సందేశం చాలా స్పష్టంగా ఉందని వివరించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం మేరకు చేపడుతున్న భారీ ఆపరేషన్‌లో భాగంగా యూఎస్ బలగాలు ఈ దాడులు నిర్వహించాయి.

Read Also- Romeo Juliet Rule: రోమియో జూలియెట్ రూల్.. ‘పోక్సో’ దుర్వినియోగంపై కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచన

సిరియా ప్రభుత్వంతో కలిసి..

ఏ భాగస్వాములతో కలిసి ఈ దాడులు నిర్వహించారనే విషయాన్ని మాత్రం అమెరికా వెల్లడించలేదు. అయితే, కుర్దిష్ జాతి ప్రజల నాయకత్వంలోని సిరియన్ డెమొక్రాటిక్ ఫోర్సెస్… అమెరికాకు ప్రధాన పార్టనర్‌గా ఉన్నాయి. ఐసిస్ ఎరివేతలో ఈ బలగాలు మద్దతు ఇస్తున్నాయి. అయితే, 2024లో సిరియా మాజీ ప్రెసిడెంట్ బషర్ అస్సద్ చనిపోయిన తర్వాత పరిస్థితులు మారాయి. అమెరికా నేరుగా సిరియా ప్రభుత్వంతో కలిపి పనిచేస్తోంది. ఐసిస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న భాగస్వామ్య దేశాల జాబితాలో సిరియా కూడా చేరింది.

పాల్మీరా దాడికి ప్రతీకారంగా చేపట్టిన చర్యకు ‘ఆపరేషన్‌ హౌకియే స్ట్రైక్’ అని అమెరికా పేరు పెట్టింది. ఈ ఆపరేషన్‌లో భాగంగా డిసెంబర్ 19న అమెరికా బలగాలు తొలి దఫా ప్రతీకార దాడులు జరిపాయి. భారీ స్థాయిలో చేపట్టిన ఆ దాడుల్లో ఏకంగా 70 టార్గెట్లకు గురిపెట్టి ధ్వంసం చేశారు. సిరియాలో ఐసిస్‌ మౌలిక సదుపాయాలు, ఆయుధాలను తుడిచి పెట్టేయడమే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టారు.

గత నెలలో సిరియాలో పాల్మిరాలో ఐసిస్ జరిపిన దాడిలో ఎడ్గర్ బ్రియాన్, విలియన్ నాథనిలియన్ అనే ఇద్దరు సైనికులు, మన్సూర్ సాకత్ అనే మృతి చెందారు. చనిపోయిన సైనికులు ఇద్దరూ లోవా నేషనల్ గార్డ్స్‌లో పనిచేశారు. మరోవైపు, అమెరికా ప్రతీకార దాడికి ముందు సిరియా ప్రభుత్వాధికారులు ఒక ప్రకటన చేశారు. దాడులు నిర్వహించే ఐసిస్ నాయకుడిని తమ భద్రతా బలగాలు అరెస్ట్ చేశాయని వెల్లడించారు.

Read Also- Sankranti Travel Rush: బాబోయ్.. ఎన్ని బస్సులైనా చాలడం లేదు.. హైదరాబాద్‌లో తాజా పరిస్థితి ఎలా ఉందంటే

Just In

01

The Raja Saab: ‘జననాయకుడు’ కూడా అదే రోజు వచ్చి ఉంటే.. ‘రాజా సాబ్’ పరిస్థితి ఏంటి?

Sreeleela: ఇక శ్రీలీలకు మిగిలింది బాలీవుడ్డే.. కోలీవుడ్ కూడా శక్తి ఇవ్వలే!

Samantha: సమంత షాకింగ్ డెసిషన్.. ఇకపై అలాంటి సినిమాలు చేయదట!

Meenakshi Chaudhary: నాకు హీరో ఎవరనేది ముఖ్యం కాదు.. అదే ముఖ్యం!

Traffic Advisory: యూసఫ్‌గూడలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు.. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకంటే?