Romeo Juliet Rule: పోక్సో చట్టాన్ని (POCSO Act) బాలికలపై లైంగిక దాడులను నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ చట్టం దుర్వినియోగానికి (POCSO Act Misuse) గురవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రేమ సంబంధాలను సైరంగా నేరంగా చూపి ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నారనే బలమైన వాదనలు ఉన్నాయి. ముఖ్యంగా, 16 నుంచి 17 ఏళ్ల బాలిక, 18 నుంచి 19 ఏళ్ల అబ్బాయి మధ్య సమ్మతితో నడిచిన ప్రేమ సంబంధం బయటపడితే, అమ్మాయి తల్లిదండ్రులు కోపంతో పోక్సో కేసు పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వ్యక్తిగత కక్షల కోసం, కుటుంబ వివాదాలు, భూ తగాదాలు, రాజకీయ శత్రుత్వాలు, బెదిరింపులు, రాజీ కోసం ఒత్తిడిలు వంటి కోసం, డబ్బు డిమాండ్ చేసేందుకు కూడా పోక్స్ కేసు పెడుతున్నారనే ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన సుప్రీంకోర్టు పోక్సో చట్టానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచన చేసింది.
రోమియా జూలియట్ రూల్ తీసుకురండి
పోక్సో చట్టంలో రోమియో జూలియట్ నిబంధన (Romeo Juliet Rule) తీసుకురావాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్ట్ సూచించింది. టీనేజీ లవ్ రిలేషిప్స్‌ను ప్రాసిక్యూషన్ నుంచి మినహాయించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. 18 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారు, స్వల్ప వయసు వ్యత్యాసం ఉన్నవారు పరస్పర అంగీకారంతో సంబంధాలు కలిగి ఉంటే వారిని క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి మినహాయించేందుకు రోమియో జూలియట్ నిబంధన ఉపయోగపడుతుందని తెలిపింది.
Read Also- Fake Reviews: నెగిటివ్ రివ్యూ ఇచ్చేవారికి బిగ్ షాక్ ఇచ్చిన మెగాస్టార్ మూవీ టీం.. ఏం చేశారంటే?
చట్టాల నుంచి మినహాయింపు
18 ఏళ్లకు కాస్త తక్కువ వయసున్నవారు ప్రేమలో పడితే, సాంకేతికంగా వారు మైనర్లే అవుతారు. అయినప్పటికీ ప్రేమ, అంగీకార సంబంధాల్లో ఉన్నవారిని ఈ చట్టం నుంచి మినహాయించేలా నిబంధనలు రూపొందించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. పోక్సో చట్టం దుర్వినియోగం నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఓ కేసు విచారణలో ఈ కీలక సూచన చేసింది. పరస్పరం సమ్మతితో సాగే సంబంధాలను తరచూ నేరంగా పరిగణిస్తే తీవ్ర పరిణామాలకు దారితీస్తోందని ధర్మాసనం పేర్కొంది. వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు పోక్సో చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారని తెలిపింది. పోక్సో చట్టాన్ని ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేసే వారిని శిక్షించడానికి ఒక యంత్రాంగం కూడా ఉండాలని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సిఫార్సు చేసింది. ఈ మేరకు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్‌సింగ్‌లతో కూడి ధర్మాసనం శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. నిజమైన టీనేజీ లవ్ రిలేషన్స్‌ను కాపాడేందుకు ఈ రూల్ తీసుకురావాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శికి తీర్పు కాపీ పంపించింది.

