Fake Reviews: సినిమా పరిశ్రమను పైరసీ భూతం ఎంతగా ఇబ్బంది పెడుతుందో తెలిసిందే. పైరసీ మాత్రమే కాకుండా నెగిటివ్ రివ్యూలు కూడా సినిమాను దెబ్బ తీస్తున్నాయి. తాజాగా దీనికి చెక్ పెట్టింది ‘మన శంకరవరప్రసాద్ గారు’ టీం. ఈ విషయమై మూవీ టీం కోర్టును ఆశ్రయించింది. దీంతో కోర్డు అలాంటి వాటిని వెంటనే నిలిపి వేయాలని తెలిపింది. దీంతో బుక్ మై షోలో నెగిటివ్ రివ్యూలు ఇచ్చే వారికి చెక్ పడింది. సినిమా విడుదల సమయంలో వాణిజ్యపరమైన ప్రయోజనాలను దెబ్బతీసే ఉద్దేశంతో ఇచ్చే ఫేక్ రివ్యూలపై కోర్టు సీరియస్ అయ్యింది. టికెటింగ్ ప్లాట్‌ఫామ్స్ (ఉదాహరణకు BookMyShow వంటివి) ఇతర రివ్యూ సైట్లలో అనామక రేటింగ్స్ నిలిపివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విషయంలో ‘BlockBIGG’, ‘Aiplex’ సంస్థలు కీలకంగా వ్యవహరించాయి.
Read also-Chiranjeevi Movie: మెగాస్టార్ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ప్రీమియర్ ఎంతంటే?
Aiplex అనేది ప్రముఖ పైరసీ నిరోధక (Anti-Piracy) సంస్థ. ఇది ఇంటర్నెట్‌లో సినిమా కంటెంట్ లీక్ అవ్వకుండా, అక్రమ లింకులను తొలగించడంలో వీరు సిద్ధహస్తులు. BlockBIGG అనేది సినిమాల చుట్టూ జరిగే డిజిటల్ కుట్రలను, నెగెటివ్ ప్రచారాన్ని ట్రాక్ చేసి చట్టపరంగా ఎదుర్కోవడానికి పనిచేస్తోంది. కేవలం రివ్యూలు నిలిపివేయడమే కాకుండా, తప్పుడు సమాచారం వ్యాప్తి చేసే యూట్యూబ్ ఛానెల్స్, సోషల్ మీడియా అకౌంట్లపై ‘కాపీరైట్ స్ట్రైక్స్’, ‘లీగల్ నోటీసులు’ పంపే అధికారాన్ని ఈ సంస్థలు కలిగి ఉన్నాయి. దీనివల్ల బాట్‌లు (Bots) లేదా పెయిడ్ ప్రచారంతో సంబంధం లేకుండా, సామాన్య ప్రేక్షకుడు థియేటర్లో సినిమా చూసి ఇచ్చే స్పందనకు విలువ పెరుగుతుంది. కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు, సినిమా ఫలితాన్ని కొన్ని గంటల్లోనే మార్చేసే కుట్రల నుండి రక్షణ లభిస్తుంది. సినిమాను విశ్లేషించే వారు ఇకపై మరింత బాధ్యతాయుతంగా, చట్టపరిధిలో తమ అభిప్రాయాలను పంచుకోవాల్సి ఉంటుంది. ఇది వ్యక్తుల అభిప్రాయ స్వేచ్ఛను హరించడం కాదు, కేవలం వ్యవస్థీకృతమైన నెగెటివ్ ప్రచారాన్ని అడ్డుకోవడం మాత్రమేనని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
Read also-RajaSaab Controversy: ‘ది రాజాసాబ్’లో తన మ్యూజిక్ కాపీ కొట్టారంటూ.. చెప్పు చూపించిన స్వీడన్ డీజే..
We Thank AiPlex and BlockBigg for leading this ground-breaking initiative to safeguard cinema from orchestrated digital manipulation.
This historic, court-backed step to restrict malicious reviews and down-ranking sets a powerful precedent for fair and transparent digital… pic.twitter.com/kmIxgi3bHP
— Shine Screens (@Shine_Screens) January 10, 2026

