Chiranjeevi Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. టికెట్ ధరల పెంచుకునేందుకు. స్పెషల్ షోలు వేసుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా జనవరి 11, 2026 రాత్రి 8:00 గంటలకు ప్రీమియర్ వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ షో టికెట్ ధర జీఎస్‌టీ తో కలిపి రూ. 600 వరకూ పెంచుకునే అవకాశం కల్పించింది. అంతే కాకుండా.. జనవరి 12 నుంచి జనవరి 18 వరకు మొదటి 7 రోజులు పాటు అదనపు ధరలు అమల్లో ఉండనున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు సాధారణ ధరపై GSTతో కలిపి రూ. 50 వరకూ అదనంగా పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్ లు సాధారణ ధరపై GSTతో కలిపి రూ. 100 వరకూ అదనంగా పెంచుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. దీంతో మెగాస్టార్ సినిమా తెలంగాణలో మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.
Read also-Dandora OTT Release: ‘దండోరా’ వేస్తూ ఓటీటీలోకి వచ్చేస్తోన్న శివాజీ సినిమా.. ఎప్పుడంటే?
అయితే తెలంగాణ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుతూ కొన్ని నిభంధనలు కూడా పెట్టింది. థియేటర్ల యాజమాన్యాలు ఈ పెంచిన ధరల ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20% మొత్తాన్ని ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్’ ఖాతాకు విధిగా జమ చేయాలని తెలిపింది. సినిమా ప్రదర్శన సమయంలో మాదకద్రవ్యాలు, డ్రగ్స్ సైబర్ క్రైమ్ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రకటనలను తప్పనిసరిగా ప్రదర్శించాలి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది కాబట్టి, భారీ బడ్జెట్ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. దీంతో మెగాస్టార్ అభిమానుల సంబరాలు చేసుకుంటున్నారు.
Read also-RajaSaab Controversy: ‘ది రాజాసాబ్’లో తన మ్యూజిక్ కాపీ కొట్టారంటూ.. చెప్పు చూపించిన స్వీడన్ డీజే..

