RajaSaab Controversy: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ‘ది రాజాసాబ్’ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ సినిమా ‘నాచే నాచే’ పాటపై అంతర్జాతీయ స్థాయిలో వివాదం నెలకొంది. ఈ పాట ట్యూన్‌కు సంబంధించి.. తాను 2024లో రూపొందించిన మ్యూజిక్ బీట్‌ను ‘ది రాజాసాబ్’ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కాపీ చేశారని స్వీడన్‌కు చెందిన ప్రముఖ డీజే విడోజీన్ ఆరోపించారు. సినిమా చూసానని అందులో ప్రభాస్ నటన అద్భుతమని కొనియాడారు. అసలు మ్యూజిక్, కాపీ చేసిన మ్యూజిక్ రెండూ ఒకే సారి ప్లే చేస్తూ.. ఇది కరెక్టు కాదు అన్నట్లుగా చెప్పు చూపించాడు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడిమాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన థమన్ ఫ్యాన్స్ ఆ డీజేపై ఫైర్ అవుతున్నారు. నిజంగా కాపీ చేసి ఉంటే లీగల్ గా చూసుకోవాలి అని, ఇలా వీడియో పెట్టి చెయ్యి చూపించడం కరెక్టు కాదని నెటిజన్లు మండి పడుతున్నారు. దీనిపై థమన్ ఎలా స్పందిస్తారో చూడాలిమరి.
Read also-BMW Heroines: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. హీరోయిన్లు యమా హుషారుగా ఉన్నారుగా!
కొల్లగొడుతున్న కలెక్షన్లు..
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో విడుదలైన ‘ది రాజా సాబ్’ బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజే సుమారు రూ.54.15 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇందులో ఇండియాలో వచ్చిన వసూళ్లు దాదాపు రూ.45 కోట్లు. పెయిడ్ ప్రివ్యూ షోల ద్వారానే ఈ చిత్రం రూ.9.15 కోట్లు సాధించింది. పెయిడ్ ప్రివ్యూలు మొదటి రోజు కలెక్షన్లు కలిపి మొత్తం రూ.54.15 కోట్లు వసూలు చేసింది. ఇది ప్రభాస్ గత సినిమాలు అయిన సలార్, కల్కీ సినిమాలతో పోలిస్తే చలా తక్కువ. అంతే కాకుండా 2022లో విడుదలైన రాధేశ్యామ్ సినిమా మొదటి రోజు కలెక్షన్లతో సమానంగా ఈ సినిమా ఈ సినిమా కూడా వసూలు చేసింది. అంటే ప్రభాస్ గత సినిమాలతో పోల్చుకుంటే.. ఈ సినిమా దాదాపు మూడు రెట్లు తక్కువ. అయితే రానున్న రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.
Read also-MSG Ticket Price: చిరు సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టికెట్ ధరల హైక్, ప్రీమియర్ వివరాలివే!
ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ చిత్రంలోని 'నాచే నాచే' పాటపై అంతర్జాతీయ స్థాయిలో వివాదం నెలకొంది. ఈ పాట ట్యూన్‌కు సంబంధించి.. తాను 2024లో రూపొందించిన మ్యూజిక్ బీట్‌ను ‘రాజాసాబ్’ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాపీ చేశారని స్వీడన్‌కు చెందిన ప్రముఖ DJ విడోజీన్ ఆరోపించారు. ప్రభాస్ నటనను… pic.twitter.com/GzVsJJ1m8b
— ChotaNews App (@ChotaNewsApp) January 10, 2026

