MSG Ticket Price: చిరు సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
MSG Ticket Price (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

MSG Ticket Price: చిరు సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టికెట్ ధరల హైక్, ప్రీమియర్ వివరాలివే!

MSG Ticket Price: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), హిట్ మెషిన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్‌లో రూపుదిద్దుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu) చిత్రానికి ఏపీ ప్రభుత్వం (AP Govt) గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ల ధరలను పెంచుకునే వెసులుబాటుతో పాటు, రిలీజ్‌కు ఒక రోజు ముందు ప్రీమియర్ షో‌కు కూడా అనుమతిని జారీ చేసింది. విక్టరీ వెంకటేష్ ఇందులో ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డెన్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల గ్రాండ్‌గా నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబైంది. ఈ క్రమంలో ఏపీలో టికెట్ ధరల పెంపుకోసం, అలాగే ప్రీమియర్ షో కోసం నిర్మాతలు అనుమతులు కోరగా, వెంటనే ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇస్తూ జీవోని జారీ చేసింది.

Also Read- Purushaha Teaser: ‘పెద్ది’ దర్శకుడు వదిలిన ‘పురుష:’ టీజర్.. పొట్ట చెక్కలవ్వాల్సిందే!

పెరిగిన టికెట్ల ధరల వివరాలివే..

ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి జనవరి 12 నుంచి 10 రోజుల పాటు టికెట్ల ధరలను పెంచుకునే వెసులు బాటును కల్పించారు. పెరిగిన టికెట్ల ధర ఎలా ఉందంటే.. టికెట్ ధరపై సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 పెంచుకునేలా అనుమతులు జారీ చేశారు. అంతేకాదు, ఒక రోజు ముందు అంటే జనవరి 11 రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్ షో‌కు అనుమతి ఇస్తూ, ఈ పో ధర రూ. 500గా నిర్ణయించారు. అలాగే రిలీజ్ రోజు నుంచి.. రోజుకు 5 షోలకు కూడా అనుమతి ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ అనుమతులతో చిత్రయూనిట్, అలాగే మెగాభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో ఇకపై టికెట్ల ధరలు, బెనిఫిట్ షో‌లు ఉండవనేలా క్లారిటీ వచ్చేసింది కాబట్టి.. ‘మన శంకర వరప్రసాద్ గారు’గారికి కూడా అనుమతులు ఉండకపోవచ్చు.

Also Read- Silent Screams: వరంగల్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాలతో శృతి హాసన్‌కున్న లింకేంటి?

‘హుక్‌ స్టెప్’ సాంగ్ వైరల్

ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంపై భారీగా అంచనాలున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా బీభత్సమైన హైప్‌ని ఇచ్చేశాయి. పాటలన్నీ చార్ట్ బస్టర్ లిస్ట్‌లోకి చేరాయి. తాజాగా వచ్చిన ‘హుక్‌ స్టెప్’ సాంగ్ అయితే మెగాభిమానులకు ముందే పండగ వాతావరణాన్ని ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అలాగే సెలబ్రిటీలు కూడా ఈ పాటకు ఫిదా అవుతున్నారు. వింటేజ్ మెగాస్టార్‌ని చూసిన ఫీలింగ్ వచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక చిరు, వెంకీ ఈ సినిమాలో చేసిన అల్లరి అంతా ఇంతా కాదని ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. ఇక థియేటర్లలో వారి చేసే రచ్చ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మాత్రం ఇంకొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

AP MSG GO (Image Source: X)

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

GHMC Commissioner: గ్రేటర్‌ను పరిశుభ్రతకు కేరాఫ్‌గా మార్చాలి.. రంగంలోకి జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్!

TG Health Department: ఆరోగ్య శాఖకు రూ.20 వేల కోట్లు? బడ్జెట్ ప్రపోజల్ సిద్ధం చేస్తున్న అధికారులు!

YouTuber Arrest: మైనర్లతో అసభ్య ఇంటర్వ్యూలు.. ఏపీ యూట్యూబర్ అరెస్టు

Khamenei – Trump: ‘ట్రంప్.. నీ పతనం ఖాయం’.. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ స్ట్రాంగ్ వార్నింగ్

GHMC: ఆ తేది నుంచి స్పెషల్ ఆఫీసర్ పాలనకు ఛాన్స్.. ఆ తరువాతే మూడు కార్పొరేషన్ల ఉత్తర్వులు?