Silent Screams: తెలంగాణలోని ఆ 3 జిల్లాలతో శృతికున్న లింకేంటి?
Shruti Haasan (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Silent Screams: వరంగల్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాలతో శృతి హాసన్‌కున్న లింకేంటి?

Silent Screams: నటి శృతి హాసన్‌కు వరంగల్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాలతో ఉన్న లింకేంటి? టైటిల్ చూశాక.. ఎక్కడో చెన్నైలో ఉండే శృతి హాసన్‌కు, తెలంగాణ రాష్ట్ర జిల్లాలతో సంబంధం ఏంటి? అనే అనుమానం రాకమానదు. ఆమె ఏమైనా ఆ జిల్లాలలోని గ్రామాలను దత్తత తీసుకుంటున్నారా? అనే అనుమానం కూడా రావచ్చు. కాకపోతే ఇక్కడ విషయం మాత్రం అది కాదు. తెలంగాణలోని వరంగల్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాలలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారిత కేసులను వెలుగులోకి తీసుకొచ్చిన శక్తివంతమైన క్రైమ్ డాక్యుమెంటరీ (Crime Documentary) ‘సైలెంట్ స్క్రీమ్స్’ (Silent Screams). మహిళలపై నేరాలు కేవలం సంఖ్యలుగానే మారిపోతున్న కాలంలో, ఆ సంఖ్యల వెనుక ఉన్న మనుషుల కథలను చెప్పేందుకు సన్ నెక్స్ట్ (Sun NXT) ఓటీటీ సిద్ధమైంది.

Also Read- Telangana High Court: ‘రాజా సాబ్’ నిర్మాతకు షాక్.. టికెట్ ధరల హైక్ మెమోని కొట్టేసిన హైకోర్టు!

శృతి హాసన్‌కు ఉన్న లింక్ ఇదే..

‘సైలెంట్ స్క్రీమ్స్’ స్క్రీమ్స్‌తో పేరుతో వరంగల్, ఆసిఫాబాద్, నల్గొండ జిల్లాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన క్రైమ్ డాక్యుమెంటరీ‌ని ప్రేక్షకుల ముందుకు సన్ నెక్స్ట్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ డ్యాక్యుమెంటరీ టాప్ 1లో ట్రెండ్ అవుతోంది. ఈ క్రైమ్ డాక్యుమెంటరీ నేరాల ప్రభావం ఎంత లోతుగా కుటుంబాలు, సమాజాలపై పడుతుందో హృదయాన్ని తాకేలా ఆవిష్కరించం విశేషం. ఇదంతా బాగానే ఉంది. ఇక్కడెక్కడా శృతి హాసన్ పేరు రాలేదు కదా.. మరి ఆమెకు, ఈ క్రైమ్ డాక్యుమెంటరీ‌కీ సంబంధం ఏంటి? ఇందులో ఏమైనా ఇన్విస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆమె నటించిందా? అనే డౌట్ వస్తుంది కదా. ఆ విషయానికే వస్తే.. ఈ డాక్యుమెంటరీకి శృతి హాసన్ (Shruti Haasan) వాయిస్ ఓవర్ ఇచ్చింది. ఆమె వాయిస్‌ నరేషన్‌తో సాగిన ఈ సిరీస్, కేవలం నేరాల వివరాలను తెలిపడమే కాకుండా, న్యాయం కోసం సాగే పోరాటాన్ని, బాధితుల మౌన వేదనను ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లుగా చూపించడంతో.. ప్రేక్షకులు ‘సైలెంట్ స్క్రీమ్స్’‌ను చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

Also Read- The RajaSaab Review: రెబల్ సాబ్ ‘ది రాజాసాబ్’తో ఎంతవరకూ మెప్పించారు?.. ఫుల్ రివ్యూ..

చాలా గ్యాప్ తర్వాత సన్ నెక్స్ట్ పేరు

సంక్రాంతి పండుగ వేళ.. జిగ్రీస్, ముఫ్తీ పోలీస్ వంటి వినోదాత్మక కంటెంట్‌తో పాటు, అందరినీ ఆలోచింపజేసే ఈ డాక్యుమెంటరీతో సన్ నెక్స్ట్ తన వైవిధ్యాన్ని చాటుతోంది. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ సన్ నెక్ట్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. శృతి హాసన్ ప్రతీది చాలా వివరంగా తెలుపుతూ.. ఇందులో లీనమయ్యేలా చేస్తోంది. ఓటీటీ రంగంలో బాగా వెనకబడిన సన్ నెక్స్ట్.. ఈ డ్యాక్యుమెంటరీతో మళ్లీ లైమ్ ‌లైట్‌లోకి వచ్చేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ‘సైలెంట్ స్క్రీమ్స్’‌ గురించి ఇప్పుడు చర్చ నడుస్తోంది. ముందు ముందు మరిన్ని మంచి సినిమాలను తీసుకుని, ఈ ఓటీటీ సంస్థ టాప్‌లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తోందని కూడా తెలుస్తోంది.

Silent Screams (Image Source: X)

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.1.02 కోట్ల ప్రమాద బీమాకు గ్రీన్ సిగ్నల్ : మల్లు భట్టి విక్రమార్క!

BMW Heroines: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. హీరోయిన్లు యమా హుషారుగా ఉన్నారుగా!

Dance Politics: డిప్యూటీ సీఎం పవన్ డ్యాన్స్‌పై అంబటి రాంబాబు హాట్ కామెంట్స్

Sanjay Dutt: మూడు రూ. 1000 కోట్ల చిత్రాలున్న ఏకైక ఇండియన్ యాక్టర్.. ‘రాజా సాబ్’ మిస్!

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినెలా రూ.800 కోట్లు సేఫ్?.. ఎందుకంటే