Telangana High Court: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినీ నిర్మాతకు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. సినిమా టికెట్ల ధరలను పెంచుతూ గురువారం అర్ధరాత్రి ఇచ్చిన మెమోను తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. గురువారం అర్ధరాత్రి తెలంగాన హోంశాఖ టికెట్ ధరలను పెంచుతూ మెమో జారీ చేసిన విషయం తెలిసిందే. ‘ది రాజా సాబ్’ (The Raja Saab) చిత్రానికి సంబంధించి టికెట్ల ధరల పెంపును సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తున్నారన్న న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలతో కోర్టు ఏకీభవించింది. హోంశాఖ ఇచ్చిన మెమోను సస్పెండ్ చేయడమే కాకుండా, వెంటనే పాత రేట్లకే టికెట్స్ అమ్మాలని బుక్ మై షో కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ‘ది రాజా సాబ్’ మూవీ టికెట్ ధరలు సాధారణంగానే ఉండనున్నాయి. ఇది నిజంగా నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌కు ఎదురు దెబ్బనే చెప్పాలి.
Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’ టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు ఆగ్రహం.. అసలేం జరుగుతోంది?
ఇకపై ఎలాంటి మెమోలు ఇవ్వవద్దు
ఒక్క ‘రాజా సాబ్’ అనే కాదు.. ఇక మీదట ఎలాంటి మెమోలు ఇవ్వద్దని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఒకవేళ టికెట్ ధరలు పెంచాలనుకుంటే జీవో నెంబర్ 120 ప్రకారం రూ. 350 లోపే సినిమా టికెట్ ధర ఉండాలని సింగిల్ బెంచ్ సూచించింది. ‘‘టికెట్ ధర పెంపు వల్ల ప్రైవేట్ వ్యక్తి మాత్రమే ఇబ్బందికి గురవుతారు. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు.. ఒక రిట్ పిటిషన్ మాత్రమే. అయినా సినిమా యూనిట్ అడిగిన అన్ని రిలాక్సేషన్స్‌కు మేము ఒప్పుకోలేదు. అందులో కొన్నిటికి మాత్రమే మేము ఓకే చెప్పాము. పెంచిన టికెట్ ధరలతో వచ్చే లాభాల్లో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలనే డిమాండ్ పెట్టాం. దీని ద్వారా సినీ కార్మికులు ఎందరో లబ్ధి పొందుతారు. సినీ కార్మికుల అసోసియేషన్‌ను పార్ట్ చేయకుండా, వారి వాదన వినకుంటే ఎలా? అంటూ ప్రభుత్వం తరుపున న్యాయవాది వినిపించిన వాదనను కోర్టు తోసిపుచ్చింది.
Also Read- The Raja Saab: ‘ది రాజా సాబ్’ థియేటర్లో మొసళ్లు.. వీళ్లు మాములు ఫ్యాన్స్ కాదు బాబోయ్!
అలా చెప్పిన తర్వాత కూడా ఎలా పెంచారు
అంతకు ముందు నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తున్నారని న్యాయవాది విజయ్ గోపాల్ తన వాదనను వినిపించారు. హోంశాఖ కార్యదర్శికి మెమో జారీ చేసే అధికారం లేదని, ఇలాంటి మెమో జారీ చేసే అధికారం జిల్లా స్థాయిలో కలెక్టర్లకు, హైదరాబాద్‌లో సీపీకి మాత్రమే టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చే అధికారం ఉందని అన్నారు. ఈ సినిమాకు మెమో జారీ చేసిన అధికారికి రూ. 5 లక్షల జరిమానా విధించాలని న్యాయవాది విజయ్ గోపాల్ కోర్టును కోరారు. విజయ్ గోపాల్, జీపీ వాదనలు విన్న అనంతరం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వయానా సంబంధిత మంత్రే ఇకపై ధరలను పెంచం అని చెప్పి మళ్లీ ఎలా పెంచారని కోర్టు ప్రశ్నించింది. ఫైనల్‌గా హోంశాఖ కార్యదర్శి ఇచ్చిన మెమోని సస్పెండ్ చేస్తూ.. ఇకపై ఎలాంటి మెమోలు ఇవ్వద్దని హైకోర్టు స్పష్టం చేసింది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

