The Raja Saab: ‘ది రాజా సాబ్’ థియేటర్లో మొసళ్లు.. డై హార్డ్ ఫ్యాన్స్!
The Raja Saab Crocodile (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

The Raja Saab: ‘ది రాజా సాబ్’ థియేటర్లో మొసళ్లు.. వీళ్లు మాములు ఫ్యాన్స్ కాదు బాబోయ్!

The Raja Saab: ‘ది రాజా సాబ్’ థియేటర్లలో సందడి మొదలైంది. తెలంగాణ మినహా అన్ని చోట్ల ప్రీమియర్స్ పడ్డాయి. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అవకాశం రావడంతో.. ఎంత హంగామా చేయాలో అంతా చేస్తున్నారు. థియేటర్లను భారీగా ముస్తాబు చేసి, కటౌట్లతో కుమ్మేస్తున్నారు. ఇక ప్రీమియర్ పడిన థియేటర్లలో ప్రభాస్ ఫ్యాన్స్ (Prabhas Fans) ఆనందానికి అవధులే లేవు. ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ సినిమాలకు ఎలాంటి సందడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమాలోని హీరోహీరోయిన్లు వేసుకున్న డ్రస్సులు వేసుకొచ్చి, తెర ముందు నిలబడి డ్యాన్సులు చేయడం అంతా చూశారు. ఇంకా ఆ హీరో వాడిని ఆయుధాలతో కూడా కనిపించారు. ఇలా ఏదో ఒక స్పెషల్ ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా చాలా వైల్డ్‌గా ఆలోచించారు. ఏం చేశారని అనుకుంటున్నారా?

Also Read- Niharika Konidela: సంగీత్ శోభన్‌తో నిహారిక నిర్మిస్తున్న సినిమా టైటిల్ ఇదే.. మోషన్ పోస్టర్ అదిరింది

డై హార్డ్ ఫ్యాన్స్..

డార్లింగ్ ప్రభాస్‌కు ఫ్యాన్స్ కాదు.. డై హార్డ్ ఫ్యాన్స్ ఎక్కువ. ఇండస్ట్రీలోని సెలబ్రిటీలందరూ, ఆయనతో కలిసి నటించిన సెలబ్రిటీలందరూ ఆయనని ఎంతగా ప్రేమిస్తారో.. అనే దానికి ఇటీవల బాలీవుడ్ నటీనటులు జరీనా వాహబ్, బొమన్ ఇరాజీ వంటి వాళ్లు చెప్పిన మాటలే సాక్ష్యం. వాళ్లే అలా ఉంటే, ఇక డై హార్డ్ ఫ్యాన్స్ ఇంకేలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమాలో ప్రభాస్ మొసలితో ఫైట్ చేసినట్లుగా డైరెక్టర్ మారుతి (Director Maruthi) చెబుతూ వస్తున్నారు. రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్‌లో కూడా మొసలితో ఫైట్ చేస్తున్న సన్నివేశాన్ని యాడ్ చేశారు. ఈ సీన్‌లో ప్రభాస్ యాక్టింగ్ చూసిన వారంతా ఫిదా అయ్యారంటే అస్సలు అతిశయోక్తి కానే కాదు. అందుకే.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అదే తరహాలో ఆలోచన చేశారు. ఈ సినిమా థియేటర్‌లోకి మొసళ్లను పట్టుకుని వచ్చారు.

Also Read- Jana Nayagan: ‘అఖండ 2’కు ఆర్థిక ఇబ్బందులు.. మరి ‘జన నాయగన్’కు?

ఇంత వైల్డ్‌గా ఉన్నారేంట్రా..

మొసళ్లు అనగానే నిజమైనవి అనుకుంటారేమో.. కాదండోయ్. ఫ్యాన్స్ రబ్బరు మొసళ్లను పట్టుకుని థియేటర్‌లోకి వస్తున్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా.. ప్రభాస్ ఫ్యాన్స్ ఏంటి మరీ ఇంత వైల్డ్‌గా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు వాళ్ల హీరోలనే, ఫ్యాన్స్ కూడా ఏది చేసిన చాలా భారీగా ఉంటుందని ప్రోత్సహిస్తున్నారు. మొత్తంగా అయితే ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ప్రభాస్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారనే విషయం అర్థమవుతోంది. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) పతాకంపై టీజీ విశ్వప్రసాద్ గ్రాండ్‌గా నిర్మించారు. ఈ సినిమా తొలిరోజే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబడుతుందని నిర్మాత ధీమాని వ్యక్తం చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Fire Accident: కారేపల్లి జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం.. సంఘటన పై అనుమానాలెన్నో..?

EC on RUPPS: తెలంగాణ రాజకీయ పార్టీలకు.. ఈసీ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎందుకంటే?

Ambani-Adani: వామ్మో.. ఒకే రోజు అంబానీ, అదానీలకు చెరో రూ.22 వేల కోట్లకుపైగా నష్టం.. ఎందుకంటే?

CM Chandrababu: నీళ్లా, గొడవలా అంటే.. గొడవలే కావాలంటున్నారు.. జగన్‌పై చంద్రబాబు ఫైర్!

Municipal Elections: నోటిఫికేషన్ కోసం అధికారుల ఎదురుచూపులు.. మున్సిపాలిటీలలో ఉత్కంఠ